ఇంద్రాణి లాంటి ఇల్లాళ్ళు అయినా, నాగపూర్ లోని నవ్య వెలయాళ్ళు అయినా , "మై చాయిస్ " విష సంస్కృతీ పుత్రికలే.
గత వారం రోజులుగా భారతావనిని నిశ్చేష్టకు గురి చేసిన ఇంతి ఇంద్రాణి ఉదంతం ఒక గొప్ప సెక్స్ , క్రైమ్ , దిల్లర్ సినిమాను మించి పోయింది. ఈమె గారి ఉదంతం ని సినిమాగా తీసి జనాల మీదకు వదిలితే , వచ్చే కలెక్షన్ లు "బాహుబలి " ని మించిపోవడం ఖాయం. దీని గురించి తెలుసుకోవాలంటే , వెనుకటి టపాను చూడండి . మన దేశం లో కొన్ని తప్పుడు వాదాలు ఉన్నాయి. అందులో స్త్రీ లను, పురుషులను మొత్తంగా వేరు చేసి చూసే "ఆదునిక స్త్రీ వాదం" ఒకటి. దీనినే "ఫెమినిజం " అని అంటారు కాబోలు. ఒక స్త్రీకి వ్యతిరేకంగా మరొక స్త్రీ నేరం చేస్తే దానిని పట్టించుకోదు స్త్రీ వాదం. ఆ నేరం లో ప్రమేయం ఉన్న పురుషుడిదే పూర్తి బాద్యత అని అడ్డగోలు వాదం చేస్తుంది . ఉదాహరణకు ఒక పెండ్లి అయిన వాడిని , అతని భార్య హక్కులుకు వ్యతిరేకంగా , అతనితో సహజీవనం చేస్తున్న మరొక స్త్రీ