ప్రేమకు వయసు అంతరం అడ్డు కాదని చాటి చెప్పిన, "మిడిల్ మిత్రవింద - ముసలి కాలబైరవ" ల సరసమైన కధను చదవండి !!!
"మగ ధీర " అనే తెలుగు సినిమా కద గురించి తెలియని వారు ఉండక పోవచ్చు. అందులో హీరో హిరోయిన్ లు అయిన మిత్ర వింద , కాలబైరవులు ఒక జన్మ లో ప్రేమించుకుని , పరిస్తితుల ప్రబావం చేత తమ ప్రేమ సపలం కాకుండానే తనువులు చాలించి , మరు జన్మలో మోడ్రన్ యువతి యువకులుగా పుట్టడం , ఆ తర్వాత మాటి మాటికి హీరో చేతిని హీరోయిన్ వేసుకున్న చున్ని కోస తాకుతూ వెనుకటి జన్మ తాలూకు ప్రేమ బావనలు కలిగిస్తూ ఉండడం , చివరకు వెనుకటి జన్మలో విలనే ఈ జన్మలోను వారి ప్రేమకు అడ్డం పడడం, అయినా డైరక్టర్ మంచి వాడు కాబట్టి ప్రేక్షకుల పీలింగ్ ని అర్దం చేసుకుని వారివురిని ఒకటి చెయ్యడం తో కద ముగిసి పోతుంది. అదిగో అలాంటి ఒక అమర ప్రెమికుల జంట రియల్ స్టొరి గురించి చె...