ప్రేమకు వయసు అంతరం అడ్డు కాదని చాటి చెప్పిన, "మిడిల్ మిత్రవింద - ముసలి కాలబైరవ" ల సరసమైన కధను చదవండి !!!


                                                                             


                         "మగ ధీర " అనే తెలుగు సినిమా కద గురించి తెలియని వారు ఉండక పోవచ్చు. అందులో హీరో హిరోయిన్ లు అయిన మిత్ర వింద , కాలబైరవులు ఒక జన్మ లో ప్రేమించుకుని , పరిస్తితుల ప్రబావం చేత తమ ప్రేమ సపలం కాకుండానే తనువులు చాలించి , మరు జన్మలో మోడ్రన్ యువతి యువకులుగా పుట్టడం , ఆ తర్వాత మాటి మాటికి హీరో చేతిని హీరోయిన్ వేసుకున్న చున్ని కోస తాకుతూ వెనుకటి జన్మ తాలూకు ప్రేమ బావనలు కలిగిస్తూ ఉండడం , చివరకు వెనుకటి జన్మలో విలనే ఈ  జన్మలోను వారి ప్రేమకు అడ్డం పడడం, అయినా డైరక్టర్ మంచి వాడు కాబట్టి  ప్రేక్షకుల పీలింగ్ ని అర్దం చేసుకుని వారివురిని ఒకటి చెయ్యడం తో కద ముగిసి పోతుంది. అదిగో అలాంటి ఒక అమర ప్రెమికుల జంట రియల్ స్టొరి గురించి చెపుతాను. కాకపోతే ఇందులో ట్విస్ట్ ఏమిటంటె , ఈ  కధలోని మిత్రవిందకు 44 యేండ్లు కాగా , కాలబైరవుడికి 68 యేంలు అందుకే వారిని "మిడిల్ మిత్రవింద" ముసలి కాల భైరవ " అందాం . ఇక కదా కమామీశు ఏమిటంటే .

                        ఆమె గారొక T V  యాంకర్. అదీ కూడా రాజ్యసభకు సంబందించిన సమాచారం ప్రసారం చేసే T V యాంకర్. ఆమె వయస్సు  44 యేండ్లు. భర్త ,పిల్లలు ఉన్నారు. రెండేళ్ళ క్రితం ఆమెకు, బార్య చనిపోయి విరహం తో తెగ బాద పడిపోతున్న 68 యేండ్ల ప్రముఖ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్  గారు కనిపించారు. అయన మీద బోళ్డంతా సానుభూతి కలిగింది. అయన బాదను అర్దం చేసుకునే స్త్రీలే లేనందుకు , ఈ సమాజం మీద ఆమెకు అంతు లేని కోపం వచ్చింది. అందుకే ఈ సమాజం లోని కట్టు బాట్లు తనకు ఆప్ట్రాల్ అనుకుంది. అందుకే నేమో మొగుడికి విడాకులు ఇవ్వ కుండానే  ముసలి సింగ్ గారికి దగ్గరైంది. అసలే భార్య పోయి బోల్డంతా బాదపడుతున్నాడెమో , సింగ్ గారు కూడా 42 ఏండ్ల యాంకర్ లోని రొమాన్స్ మూడ్ చూసి చిత్తై  పోయాడు.  అంతే!

                              అసలు ఆమె తన కోసమే పుట్టిన "మిత్రవింద " అని, తను కాల బైరవుడిని అని తెగ గురి కుదిరింది ముసలి సింగ్ గారికి .అయన గారి ప్రకారం  పూర్వజన్మలో వీర ప్రేమికులు అయిన తాము ఈ  జన్మలో , బ్రహ్మ దేవుని లెక్కలో ఎక్కడో పొరపాటు జరిగినందు వలన తానూ పాతికేళ్ళు ముందు పునర్జన్మ పొందాడట , అందువలననే తను "ఆశ " అనే ఆమెను మొదటి పెండ్లి చేసుకోవాల్సి వచ్చిందట. , అలాగే అమృత రాయి కూడా "ప్రదాన్" అనే ఒక ప్రొపెసర్ గారిని పెండ్లి చేసుకుని హాయిగా కాపురం చేసుకోవాల్సి వచ్చిందట. కాని రాజ్యసభ టీవీ యాంకర్గా  అమృత రాయి ఎప్పుడైతే రాజ్య సభలో అడుగుఎట్టిందో అప్పుడే ఆమె చున్నినో మరేదో దిగ్విజయ్ సింగ్ గారికి తగలడం , ఆయనలో పూర్వ జన్మ గుర్తుకు రావడం , బ్రహ్మ దేవుడు వారిద్దరిని కలపడం కోసం , వారి ప్రణయానికి అడ్డు అని బావించి " ఆశ " గారిని తన వద్దకు రప్పించుకోవడం తో సింగ్ గారి వైపు లైన్ క్లియర్ అయింది. కాని అమృత రాయి గారి మొగుడికి ఏ రోగము లేకపోవడం వలన , విడాకులు ఒక్కటే శరణ్యం అని మొగుణ్ణి ఏదో రకంగా ఒప్పించి మూచువల్ డైవోర్స్ కి అప్ప్లై చేయించడం లో విజయం సాదించింది "మిడిల్ మిత్ర వింద".

       ఇక అక్కణ్ణుంచి ఆమె లో తన ముసలి ప్రియుడితో తనకున్న రొమాన్స్ ని ఎలాగైనా బయటి ప్రపంచానికి తెలియ చేయ్తాలి అనే తపన మొదలైనట్లుంది. అంతే ! బ్రహ్మ దేవుడు ఆమె కు తెలియా కుండానే ఆమె పర్సనల్ లాప్ టాప్ లోని వారివురి ప్రణయ సన్నీ వేసాలు కొన్ని లీక్ అయ్యేలా చేసాడట. దాని మీద గత సంవత్సరం  పెద్ద దుమారం సాగడం , చివరకు వారి మద్స్య ఉన్నది అసలు సిసలు ప్రేమే అని , ప్రేమకు వయసు తారతమ్యాలు లేవని చాటి చెప్పడానికే ఈ  లోకంలో తిరిగి తాము జన్మించామని చెప్పడమే కాక , ఆమెకు విడాకులు రాకుండానే ఇద్దరూ ఒక్కటై చెత్త పట్టాలు వేసుకుని తిరిగినంత కాలం తిరిగి , చివరకు మొన్ననే  విదేశం లో వివాహం చేసుకున్నారు  అట. విదేశం లో వివాహం ఎందుకంటే ఇండియన్ బ్రహ్మ అలా డిసైడ్ చేసాడట మరి!.

    మిడిల్  "మిత్ర వింద " , ముసలి కాలబైరవ  ప్రేమ కహానిలో కొసమెరుపు ఏమిటంటె అమృత రాయి గారి నిస్వార్ద బుద్దిని తెలియచేసే ఆమె ప్రకటణ. తనకు సింగ్ గారి న్రోమాన్స్ మీద తప్ప అయన గారి ఆస్తులు మీడ ఏ మాత్రం ఆసక్తి లేదని అందుకే అయన ఆస్తులు అన్నీ అయన మొదటి బార్య పిల్లకే ఇమ్మని చెప్పిందట. ఔరా ! ఎంతటి నిస్వార్దట . రాజకీయ నాయకులకు అధికారిక , అనధికారిక భార్యలు  ఉన్నట్లే  ఆస్తులు ఉండవా? అందులో అధికారిక ఆస్తులు కంటే అనధికార ఆస్తులు ఎక్కువుగా ఉందవా? అలాంటప్పుడు అధికారిక ఆస్తులు తన సవతి సంతానానికే ఇచ్చి వేయమంటే , అనధికారిక ఆస్తులు మీద తనకే కదా అదికారం . మరి ఈ అనడికారిక ఆస్తులు కోసమే అసలు మొగుడికి విడాకులు ఇవ్వకుండానే ముసలి ప్రియుడిని తగులుకుంది ,అని ఎవరైనా తలపోస్తే అది సాక్షాత్తు బ్రహ్మ దేవుడిని అవమాఇంచినట్లే . ఎందుకంటే వీరు ప్రేమ కోసమే పుట్టారు. ప్రేమకు వయసు అంతరాలు అడ్డం కావని  చాటి చెప్పడానికే పుట్టారు కాబట్టి  .  అది బ్రహ్మ గారి ఇచ్చ కాబట్టే వారిలో ఆ ప్రేమ పిచ్చ.
                 
                            కాబట్టి ఓ భారతీయులారా ! ప్రేమకు ఏది అడ్డు కానట్లే , వయసు అంతరం కూడా అడ్డు కాదని. ఈ మిడిల్ మిత్రవింద , ముసలి కాలబైరవుడి కద వలన మీరు తెలుసుకొనుడి!

 వీరి ప్రణయ గాద గురించి ఇదే బ్లాగులోని మరొక టపా

పార్టిలో పదవుల కోసం రాష్ట్రాన్ని, పర నారి పెదవుల కోసం సంసారాన్ని విడదిసిన 67 యేండ్ల " పెద్ద మనిషి "

                                                   

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం