కొడుకుకు బుద్ది చెప్పే దమ్ము లేక, తల్లిని అనాదగా కుత్బుల్లాపూర్ లో వదిలేసిన కుమారుడు !!
మొన్నీ మద్య ఖమ్మం కు చెందిన రాములు అనే వ్యక్తీ , తను తప్పా ఎవరూ లేని తన తల్లిని , తనతో పాటు హైదరాబాద్ లోని అతని ఇంటికి తీసుకు వెల్లాడు. అక్కడ పని పాటా లేని అతని కొడుక్కి , ముసలమ్మకు ఏదో గొడవ అయితే , దానిని సాకుగా తీసుకుని తల్లిని తీసుకు వచ్చి, కుత్బుల్ల్లపూర్ గ్రామంలో వదిలి వెళ్లి పోతే , ఆ తల్లి పరిస్తితి ఏమిటి? కనీ, పెంచి , విద్యా బుద్దులు చెప్పించి, ఒక ఇంటి వాడిని చేసి "బ్రతుకు కొడకా " అని దివించిన ఆ మాత్రు మూర్తికి , ఆ కొడుకు తీర్చుకునే రుణం ఇదా? అసలు పూర్తి వివరాలు కోసం క్రింది చిత్రం చూడండి.
నిజంగా రాములుకు తన కొడుక్కి బుద్ది చెప్పే దమ్మే ఉంటే , తన ముసలి తల్లి కాలు ను గాయపరచిన కొడుకుని ఇంట్లో నుంచి వెళ్ళ గొట్తాలి. కాని ఆ పని చేయలేక , ఆశ క్తురాలు, అయిన తన తల్లిని తీసుకు వచ్చి కుత్బుల్లాపూర్ లో వదిలాడు. ఆమె భారం తనది కాదని , వీదులో వదిలేసి ఆమెకు నరకం చూపించాడు. ఎవరో దయా పరుల ఆదరణతో ఆమె హస్పిట్టల్లో కోలుకుంటున్నా, ఆమె శేష జీవితం ఆనాద బ్రతుకే కదా ! నిజంగా రాములు కు తన తల్లి మీద ప్రేమ ఉంటె , ఆమెను తన ఇంట్లో ఉంచుకునే పరిస్తితే లేక పోతే ,తన బందువుల ఇంట్లోనో , లేక డబ్బులు తీసుకుని పరిచర్యలు చేసే వ్రుద్దాశ్రమం లోనో ఆమె చేర్పించి , ఆమె బాగోగులు చూసుకోవడానికి డబ్బులు ఇస్తే , అది ఒక రకంగా నయం.
ముసలి వారి పొడ గిట్టని కర్కోటక కుటుంబ సబ్యుల మద్య ఉండె కంటె , తమ ఈడు వారు తోడుగా ఉండే వ్రుద్దాశ్రమాలే నేటి వృద్దులకు రక్షణ ఇస్తాయి. కాబట్టి ప్రబుత్వం వారు ప్రతి మండలానికి ఒక వ్రుద్దశ్రమ్ ఏర్పాటు చేసి , మండల పరిదిలోని , కుటుంబ బాడిత వ్రుద్దులను అందులో చేరేలా ప్రోత్సాహించాలి. వ్రుద్దులను నిర్లక్ష్యం చేసే వారు ఆర్దికంగా స్తోమత కలిగిన వారైతే , సదరు వృద్దుల సంక్షేమ నిర్వహణ ఖర్చు వారి నుండి వసూలు చేయాలి. మిగతా సొమ్మును స్తానిక దాతలు, ప్రభుత్వ గ్రాంట్లు ద్వారా సేకరించి, వ్రుదాశ్రమ నిర్వహణను ఒక పవిత్ర కార్యంగా బావించే స్తానిక స్వచ్చంద సంస్తలకు అప్ప చెప్పి, వాటి నిర్వహణా పర్యవేక్షణా ను జిల్లా సంక్షేమ అధికారుల కు అప్ప చెప్పాలి. పిల్లలు, వృద్దుల ఆక్రందనలు వినిపించే ఏ సమాజము అభివృద్ధి చెందదు. వారి ఉసురు కొట్టుకున్న ఏకుటుంబమూ బాగుపడదు. ఇది సత్యం.
కన్న తండ్రి మాట కోసం, రాజ్యం త్యజించి 14 యేండ్లు అడవులకు వెళ్లి అష్ట కష్టాలు పడ్డ , శ్రీ రాముడు జన్మించిన పుణ్య భూమి మనది. కన్న వారికి, వృద్దాప్యం లో ఆకలి దప్పులు నుంచి రక్షించి సాకే ప్రతివాడు నా దృష్టిలో నిజమైన రామ భక్తుడు. ఊళ్ళొ రామాలయం కట్టడం వలన వచ్చేపుణ్యం కంటె ఒక వృద్దాశ్రమం నిర్మించి , నిర్వహిస్తే వచ్చే పుణ్యం వేయి రెట్లు ఎక్కువ.ప్రతి వ్రుద్దశ్ర్తమం ఒక రామాలయమే . దాని నిర్వహణకు తోడ్పడే ప్రతి దాత రామ భక్తుడే .
తల్లి తంద్రులు ప్రత్యక్ష దైవాలు. వారి సేవను విస్మరించి , దూరాన ఉన్న మందిరాలకు పోయి దైవ సేవ చేసినా , వారి సేవలు నిష్పలమే . తల్లి తండ్రి ని కానని వాడు , దైవానికి కూదా విరోదియే . కాబట్టి ముందు ప్రత్యక్ష దైవ సేవ. ఆ తర్వాతే ఏ దేవుడైనా ,అందుకే మాత్రు దేవో భవ! పితృ దేవో భవ!
Comments
Post a Comment