రెడ్డిగారి పాలనలో కళ కళ లాడిన కేశవ రెడ్డి గారు , బాబు గారి పాలనలో విల విల లాడే "కేసుల రెడ్డి " గా ఎందుకు మారారు ? !!


                                                             



                               ఎవరైనా సరే , సామాన్యులుగా ఉన్న వారు, గొప్ప పబ్లిసిటి తో, ఆనతి కాలం లో కోటాను కోట్లకు పడగలెత్తి "అధిపతులుగా " గా మారారు అంటే ఖచ్చితంగా వారు ఎవరి నెత్తినో చేతులు పెడితే కాని వారు ఆ స్తాయికి చేరుకుని ఉండరు అని, ఇంతవరకు మన కళ్ళముందు జరిగిన చరిత్ర చెపుతుంది. అలా నెత్తిన చేతులు పెట్టించుకునే వారు ప్రభుత్వ ఆదీనం లోని బ్యాంకులు కావచ్చు , ప్రజలు కావచ్చు. మొన్నటి రామ లింగ రాజు గారి దగ్గర్నుంచి నేటి కేశవరెడ్డి గారి దాక ఎవరి విషయం చూసినా ఇదే తంతు. మనకు తిండి పెట్టె రైతుకు పది వేలు ఇవ్వడానికి సవా లక్ష ప్రశ్నలు సందించే సంస్తలు , ఈ  బడాబాబులు విషయం లో మాత్రం కిమ్మన్నకుండా రుణాలు ఇవ్వడానికి కారణం బహుసా వారికి ఉన్న ఫాల్స్ పబ్లిసిటి యే కారణం కావచ్చు. విచిత్రం ఏమిటంటె లక్షల విలువ చేసే భూములున్న రైతుబిడ్డ , తనకున్న వేల రూపాయల రుణం తీర్చ లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే , కోటాను కోట్ల ఋణం ఎగగొట్టి జైలులో ఉన్న ఈ  బడా బాబులు ఎవ్వరూ ఆత్మహత్యలు లాంటివి చేసుకున్న దాఖలాలు లేవు. బహూశా దానికి కారణం రైతు బిడ్డ కు ఎదురైన పరిస్తితులు వారు ఊహించనివి అయితే ఈ బడా బాబులు కు తాము చేసే తప్పుడు పనులు యొక్క పర్యవసానం తెలుసు కాబట్టి, అందుకు ప్రేప్లానడ్ గా సంసిద్దులై ఉండటం వలన వారికీ ఆత్మహత్యల బాద కలుగక పోవచ్చు. లేకుంటే రైతు బిడ్డలుకు ఉన్న పరువు ప్రతిష్టల సెంటిమెంట్ , బడా బాబులకు నాన్సెన్స్ గా  అని పించవచ్చు. ఏది ఏమైతేనేమి మనం ఆత్మహత్యలను కోరుకోరాదు కాబట్టి  బడా బాబులు అంతా చిరాయువులుగా ఉండాలని ఆసిద్దాం.

       అసలు 2000 సంవత్సరం నుండి విద్యా వ్యాపారం  చేస్తూ , స్కూళ్ళు మీద స్కూలు పెడుతూ తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా అంచలంచలుగా తన విద్యా వ్యాపారాన్ని విస్తరింపచేసిన విద్యా సామ్రాట్ కేశ వ రెడ్డి  సంస్తల అధిపతి కేశవరెడ్డి గారు 2014 లో రాష్ట్రాలు విడిపోయి, ప్రభుత్వాలు మారేసరికి , సంవత్సరం తిరకుండానే  దివాలా తీసిన వాడి లాగ కేసుల్లో ఎందుకు కూరుకు పోవలసి వచ్చింది. ఇప్పటి దాక ఇంద్రుడు చంద్రుడు అని పొగిడిన పిల్లల పేరెంట్స్ , హటాతుగా  అయన ఒక  "చీటర్ " అని ఎందుకు కేసులు పెట్టాల్సి వచ్చింది? ఐ విషయం తెలుసుకోవాలంటే పెద్ద కదే ఉంది . అదేమిటో క్రింది చిత్రం లో చూడండి.

                                                                           


                                          అయ్యా అదీ కధ. అయితే ఇక్కడ  ఈనాదులో చెప్పని విషయం ఒకటుంది అట. అదేమిటంటే , కేసవరెడ్డి గారికి ఇంతవరకు  గత  ప్రభుత్వ పాలనలో అయన మాట చెల్లేది కాబట్టి , అప్పులు విషయం లో కొంత వెసులు బాటు ఉందేది . తను ప్రజల సొమ్ముతో కొని కట్టించిన బిల్డింగులు , ఇతరత్రా ఆస్తులు మరొక 5, 6 యేండ్లు ఉంటె , వాటి విలువలు మరింత పెరిగి తద్వారా ప్రజల అప్పులు తీర్చే వారేమో ! కాని ఏమి గూడు పుటాని జరిగిందో , బ్యాంకులు అయన ఆస్తులు వేలం వెయాడానికి సంసిద్ధం కావడం తో , ఆందోళన చెందిన విద్యార్దుల  తల్లి తండ్రులు , తమ బా కీల కోసం రెడ్డి గారిని ఒత్తిడి చేస్తుండడం , అయన ఇప్పుడు సాధ్యపడదు అని చెప్పడం తో , వారు కేసులు పెట్టడం తో వ్యవహారం క్లైమాక్స్ కి చేరి కేశవ రెడ్డి గారు కటకటాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. మరొక విషయం ఏమిటంటే  రెడ్డి గారు తన విద్యాసంస్తలను విద్యార్దులు తో సహా  మంత్రి నారాయణ గారి సంస్తలకు అమ్మి వేసినట్లు తెలుస్తుంది . డబ్బు రావడానికి మరొక సంవత్సరం ఆగాల్సి ఉందని , స్వయంగా కేశవర్తెడ్డి గారే ప్రజలకు చెప్పారట. అయినా నమ్మక్కం లేని తల్లి తండ్రులు కేసులు  పెట్టి  తమ బాకీలు తీర్చమని అడుగుతున్నారు.

                               దీని వలన మనకు అర్ధమయ్యే నీతి ఒకటే , ప్రభుత్వం లోని పెద్దల ప్రాపకం ఉన్నంత కాలం  ఎన్ని అప్పులు చేసినా ,ఎన్ని బ్యాంకులకు తిరిగి కట్టకపోయినా ప్రమాదమేమి ఉందదు. కాని ప్రబుత్వం లో మన మాట  చెల్లుబాటు కాకపోతే , ఎంత పెద్ద సామ్రాట్ అయినా కుప్ప కూలి పోయి నెత్తిన చెంగు వేసుకోక తప్పదు. అప్కోర్స్ ముందె అన్ని జాగర్తలు తీసుకుంటారు కాబట్టి అసలు ఆస్తులు బినామీ పేరులు మీద ఎక్కడొ ఒక చోట వర్దిల్లు తుంటాయి . కేసుల పేరుతో వీరు జైలులో ఉన్నా, డబ్బున్న మారాజులు అయ్యారు కాబట్టి , ఇంట్లో ఉన్నా, జైలులో ఉన్నా వసతులకేమి లోటుoదదు. "అడవిలో ఉన్నా , బోనులో ఉన్నా పులి పులేరా డొంగ్రే " అన్న సినిమా డైలాగు లాగా " ఇంట్లో ఉన్నా , జైలులో ఉన్న , బడా బాబు, బడాబాబే " .

                                        ఆ  విదంగా రెడ్డిగారి పాలనలో కళ కళ లాడిన కేశవ రెడ్డి గారు , బాబు గారి పాలనలో విల విల లాడే "కేసుల రెడ్డి " గా మారినట్లు  కనిపిస్తున్న రెడ్డి గారికి ఆనతి కాలం లోనే అన్ని సర్దుకోవచ్చు గాక !!



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!