మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం , వారిని పిచ్చోళ్ళుగా ఎలా మార్చిందొ చూడండి !!?


                                                                                  

మానవత్వం లేని శాస్త్రీయ విజ్ఞానం సప్త మహా పాపములలో ఒకటి అన్నారు పూజ్య బాపూజీ . అది నూటికి నూరు పాళ్ళు నిజం అని రుజువు చేసే సంఘటణ లు తెలంగాణా రాష్ట్రం లోని జిల్లాల్లో ఇటివల జరుగుతున్నాయి. వాటి గురించి వింటుంటెనే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.  . 
  సాదారణంగా మన ఆరోగ్యాలను పాడు చేస్తూంటాయని , ఏ ఆహార పానీయం లేక పదార్దం లో కల్తీ జరగడాన్ని ఆక్షేపించడమే కాక దానిని నేరంగా పరిగణిస్తూ చట్టాలు చేసుకున్నాం. కాని కల్తీ కలిగిన  పానియం  కాకుండా స్వచ్చమైన పానీయాన్ని సప్లై చేస్తుంటే, అది త్రాగిన జనం ఉన్మాదులుగా మారి పోయి తిరిగి కల్తీ పానీయం ఇస్తే తప్పా ,వారు బ్రతికే పరిస్తితి లేదు అన్న పరిస్తితులు కనిపిస్తుంటే ఏమనాలి ?  దీనికి ఎవరిని నిందించాలి ? రోజూ కొద్ది కొద్దిగా కల్తీ పానీయానికి ప్రజలను అలవాటు చేస్తున్న "కల్తీ వ్యాపారులు "నా, ? వ్యాపారులకు కల్తీ చేయడానికి అవసరమైన రసాయనాలు గురించి విజ్ఞానం నేర్పిన గురువులు నా? బాహాటంగా దశాబ్దాలుగా ప్రజలకు కల్తీ పానీయం పట్టిస్తూ , లక్షలు దండుకుంటున్న నీచులను నిలువరించలేని గత ప్రబుత్వాలనా ? ఎవరిని నిందించాలి? ఎవరు దీనిక్ బాద్యత వహించాలి?  

    శాస్త్రీయ పరిజ్ఞానం అభివృద్ధి చెందని రోజుల్లో , తెలంగాణా పల్లెలలో గ్రామీణులు మనసులు ఎంత స్వచ్చంగా ఉండెవో , పల్లెలో వారు సేవించే "తాటి కల్లు " కూడా అంతే స్వచ్చంగా ఉండెది. రోజూ తాటి చెట్లు ఎక్కుతూ , దిగుతూ , ముంతలులో కల్లు సేకరిస్తూ , పది మందికి స్వచ్చమైన కల్లు ను పోస్తూ వ్రుత్తి జీవనం చేసే "గౌడు " అంటే పల్లీయులకు ఎంతో అభిమానం ఉండెది. పెద్ద పెద్ద కుటుంబాల వారికి కూడా "వాడుక కల్లు " పేరుతో రోజూ కల్లు సప్లై చేసే వారు తెలంగాణా గౌడు అన్నలు. వారికి కల్లు  లో కల్తీ జరపడమంటే ఏమిటొ తెలియదు.అటువంటి స్వచ్చమైన కల్లును త్రాగే వారి ఆరోగ్యాలు కూడా బేషుగ్గా ఉండేవి. కాని శాస్త్రీయ జ్ఞానం పెరిగినాక, గౌడు అన్నలు కాస్తా "గీత కార్మికులు " గా మారి పోయారు. అన్నలుగా ప్రజలకు స్వచ్చమైన కల్లు అందించిన చేతులే , కార్మికులుగా "సాకిరేన్ " అనే తక్కువ విష ప్రబావం కలిగిన పొడిని కలిపిన కల్లును అందించటం మొదలు పెట్టాయి. ఇక అక్కడితో ఆగలేదు. శాస్త్ర  విజ్ఞానం  పెరుగుతున్న కొద్ది వారి మనసులు డబ్బు యావ తో విష పూరితం కావడం మొదలైంది . దానికి కొంత మంది గౌడు లు "కల్లు డిపో" ఓనర్ లు అయ్యారు. రోజూ వేల లీటర్ల స్వచ్చమైన కల్లు సేకరించి జనాలకు సప్లై చేయడం కంటే , ఉన్న కల్లు లోనే మత్తు నిచ్చే రసాయనాలు   కలిపి ప్రజలతో తాగించడం లాబ సాటి వ్యాపారం గా మారింది.అందుకే కల్లు లో విషపూరిత మైన "సోడియం లారి సల్ఫేట్ "(SLS ), అమ్మోనియం క్లోరైడ్ , లాంటివి కలపడం మొదలు పెట్టారు  దీని వలన  కల్తీ కల్లు సహితం నురగలు కక్కే అసలు కల్లుగా కనపడుతుంది అట. 
                     ఇందులో SLS చాలా ప్రమాదకరమైనది . ఒక గంట సేపు బయటి వాతావరణం లో ఉంటే ఇది ఆవిరై పోతుంది అట అందువలన లాబెరేటరిలో కూడా దీని అన  వాళ్ళు దొరకక కేసులు వీగి పోతున్నాయి అంటున్నారు ఎక్సైజ్ అధికారులు . ఇక కల్తీ కల్లు లో మత్తు కలిగించే క్లోరో పాం , డైజీ పాం లాంటి రసాయనాలు కలపడం వలన , క్రమంగా ప్రజలు వాటికి అ లవాటు  పడ్డారు . ఎంతగా అలవాటు పడ్డారు అంటె ,ఒక్క రోజు కల్తీ కల్లును సేవించక పోతే పిచ్చెక్కి పోయె అంతగా .  అలాంటి పరిస్తుతుల్లో తెలంగాణా సర్కార్  కల్తీ కల్లును నిరోదించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడలన్నా సదుద్దేశ్యం తో" కల్లు డిపో " లు మీద  దాడులు చేయించి , కల్లు లో కల్తీ కలపడం ఆపు చేయించింది. అంతే !

           దశాబ్దాలుగా కల్తీ కల్లు కు అలవాటు పడిన జనం , ఒక్క సారిగా స్వచ్చమైన కల్లు దొరుకుతుంటే , దాని స్వచ్చతకు పిచ్చెత్తి పోతున్నారు. ఒంట్లోని నరాలు కల్తీ కలిపిన కళ్ళు కోసం ఒంకరులు తిరిగిపోతుంటె , కుటుంబ సబ్యులు " ఇదేమి ప్రారబ్దం రా దేవుడా అని ఆసుపత్రులకు తమ వారిని చేర వేస్తున్నారు. అక్కడ "స్వచ్చ కల్లు " బాదితులు చేసే ఉన్మాద చేష్టలకు వైద్యులు , సిబ్బంది నిస్చెష్టులు అవుతున్నారు. వారు రోజూ సేవించే ప్రాణాంత క మైన రసాయానాలు  స్తాయి మోతాదు లో మందులు ఇవ్వడానికి తాము నేర్చుకున్న వైద్య శాస్త్రం అంగీకరించదు అని సైక్రియాటిస్టులు చెపుతున్నారు అంటె , కల్తీ కల్లు కు అలావాటు పడిన ప్రజల ఆరోగ్య స్తితి ఎంత దయయనీయ స్తితిలో ఉందో అర్దమవుతుంది. ఇప్పుడు మాకు కల్తీ కల్లు సప్లై చేయాలి అని ఆందోలనలు ప్రజల నుండి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదు. 


          " కల్తీ అనేది కల్లు కే పరిమితం , దానివలన మనకేమి నష్టం లేదు "అని కల్లు తాగని వారు సంబర పడాల్సిన పని లేదు. ఈ  ఉదంతాలు మనకు బవిష్యత్ ని చూపిస్తున్నాయి. మొన్న్ననే పండ్లు , కూరగాయల లో జరిగే కార్బైడ్ కల్తీ గురించి విని పండ్లు తినాలంటెనే బయం వేస్తుంది. అలా గే పాలు, నీరు ,గాలి అన్నీ కల్తీయే కదా ! మరి ప్రబుత్వం వారు ఒక్కసారిగా వీటిలోని కల్తీని నిరోదిస్తే , వాటికి అలవాటు పడిన మన పరిస్తితి  కూడ "స్వచ్చ కల్లు " బాదితుల పరిస్తితీ  మాదిరిగా ఉండి , మనం కూడా కల్తీ కోసం ఆందోళనలు చేయాల్సి వస్తుందా? ఏమో మరి! ఈ  దేశం లో  కల్కిఅవతారుడు  కంటె ముందు "కల్తీ రాక్షసుడు " వచ్చాడు.వాడికి ఉన్న ఏకైక దన్ను "శాస్త్రీయ విజ్ఞానం ". మానవత్వం అబ్బక ముందే శాస్త్రీయ జ్ఞానం వాడికి అబ్బింది. అందుకే  వాడి కల్తీ దెబ్బకు ప్రజలు  వాడికి బానిసలుగా మారుతున్నారు. మరి కల్తీ రాక్షసుడిని సంహరించే "కల్కి అవతారుడు" ఎప్పుడొస్తాడో ? 


     స్వచ్చమైన కళ్ళు తాగి పిచ్చెక్కిన రోగుల పరిస్తితి ని ప్రత్యక్షం క్రింది వీడియోలో చూడండి.  


  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!