Posts

Showing posts with the label యాగం

మతం "యాగం " చేస్తుంటే , విజ్ఞానం "ఆగమాగం " చేస్తుంది!!

Image
                                                                                                                                                                                                    మత పరమైన అన్ని క్రతువులు విశ్వాసం కు సంబందించినవి. ప్రపంచ వ్యాప్తంగా ఈ  మతం, ఆ మతం అని లేకుండా అన్ని మతాలలో విశ్వాసాలకు సంబందించిన కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇవేవి సైన్స్ దృష్టితో పరిసిలీస్తే నేడు సమాజాభివ్రుద్దికి పనికి వచ్చేవిగా అనిపించకపోవచ్చు. కాని వ్యక్తిగత దృష్టితో   చూస్తే కొన్ని కోట్లు ఖర్చు చేసినా మనిషికి లభించని అలౌకిక ఆనందం తో కూడుకున్న పాజిటివ్ దృక్పదం , ఆయా మత వర్గాల ప్రజలలో కలిగించడానికి , ఈ విశ్వాస పూరిత క్రతువులు దోహదపడుతున్నాయని చెప్పవచ్చు. అలాంటి కోవకు చెందినవే పురాణాలలో చెప్పబడి , నేటికి కొనసాగుతున్న "యజ్ఞాలు " యాగాలు . భారత రాజ్యాంగం తన ప్రజలకు ఇచ్చిన మత స్వేచ్చకు అనుగుణంగా యజ్ఞాలు , యాగాలు చేసుకునే స్వేచ్చ ఉంది . దాని గురించి మాట్లాడాల్సిన అవసరం దేవుని నమ్మని నాస్తికులకు కాని, హిందూయేతర మతస్తులకు కాని లేదు.                           ఈ  మద్య  వి