Manavu e-Family Counseling Services
Manavu |
వీడియో,ఆడియో లేక టెక్స్ట్ చాటింగ్ ద్వారా కౌన్సెలింగ్ కోరువారు మీ మొబైల్ లోని BHIM App ద్వారా మా అకౌంట్ ( 9399325372@upi ) కి 1000 రూపాయలు సులువైన మరియు సురక్షితమైన డిజిటల్ పద్దతిలో పంపవచ్చు.
లేదా
ఈ క్రింద ఉన్న pay fees అనే లింక్ ని క్లిక్ చేసి సంబoదిత సర్విస్ ద్వారా గాని డబ్బును జమ చేయడానికి pay u money సైట్ లోకి అందులోని సూచనలు పాటిస్తూ పీజు చెల్లించవచ్చు . ఆ తర్వాత అపాయింట్ మెంట్ రిక్వెస్ట్ ను మాకు పంపగలరు . నిర్దేశిత కౌన్సెలింగ్ పీజ్ మా బ్యాంక్ ఖాతాలో జమ కాగానే మీకు అపాయింట్ మెంట్ తేది , సమయం ను అప్రూవ్ చేసి మీ ఈ మెయిల్ అడ్రెస్స్ కు పంపబడతాయి Pay Fees
ఇక చదవండి:- |
భారతీయ సంస్కృతికి, సంప్రదాయాలకు, నాగరికత పురోగతికి మూలమైనది ఉమ్మడి కుటుంబ వ్యవస్థ. నాగరికత విస్తరణకు పూర్వమే మనదేశంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఉందని వివిధ గ్రంథాలలో పొందుపరచబడి ఉంది. నాగరిక ప్రపంచంలోనూ మన దేశంలో ఉమ్మడి కుటుంబవ్యవస్థ మూడుపువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లింది. మనదేశంలో ఉమ్మడి కుటుంబాలు సిరిసంపదలతో తూలతూగాయనడంలో సందేహం లేదు. ఒక కుటుంబంలో తాత మొదలు వారి పిల్లలు వారి పిల్లలు ఇలా మూడు నుంచి నాలుగు తరాలు ఉమ్మడి అనే గొడుగు కింద ఒదిగి పోయేవి.ఇంటి లోని పెద్దకు అందరూ గౌరవం ఇవ్వాల్సిందే. ఆయన మాటే వేదవాక్కు. అందరిదీ ఉమ్మడి వ్యవసాయమే. సమిష్టి సంపదనే, సమిష్టి భోజనాలే ఉండే వంటే ముచ్చటేస్తుంది. తల్లిదండ్రులు, అత్తమామలు, అక్క చెల్లెళ్లు, అన్నదమ్ములు, బావా మరదళ్లు, బందుమిత్రులు, తాతలు, బామ్మలు, మనవలు, మనవ రాండ్రతో కళకళలాడే ఉమ్మడి కుటుంబాలు సిరి సంపదల నిలయాలు. ఆ కుటుంబాలలో లేమి అనే పదానిే తావు ఉండేది కాదంటే అతిశయోక్తికాదు. కష్టసుఖాలను సమానంగా పంచుకునే ఆత్మీయులు, ఆపదలో ఆదుకు నే బంధుమిత్రులతో ఒంటరితనానికి చోటుండేది కాదువిదేశీ పాలకుల పాలనలో ఉమ్మడి కుటుంబాలుగా చెలామణి అయిన ఎన్నో కుటుంబాలు నవనాగరిక ప్రప ంచంలో విచ్ఛిన్న మయ్యాయి. ఆధునికత పెరగడం, నాగరికత పురోభివృద్ధి, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వెరసి ఉమ్మడి వ్యవస్థ మీదా తీవ్ర ప్రభావాన్ని చూపింది. నవ నాగరిక ప్రపంచంలో రెండు కుటుంబాలు కాదు కదా రెండు మనసులు కూడా కలసి జీవించ లేని పరిస్థితి నెలకొంది.డబ్బు సంపాదన కోసం కనీసం భార్యభర్తలు కూడా ఒక చోట కూర్చుని ఒకరినొకరు పలకరించుకునే సమ యం చిక్కడం లేదంటే మనకుటుంబాలు ఎంతగా విచ్ఛిన్న మ య్యాయో అర్థం చేసు కోవచ్చు. ఉమ్మడి కుటుంబాలలో కలిసి మెలిసి మనగలిగే మనస్తత్వాలు లోపిం చి పెళ్లయిన మరు నాడే వేరుకాపురా లు పెట్టుకుని జంట లుగా ఒంటరై పో తున్నారు. దీంతో సలహాలిచ్చే పెద్ద దిక్కులు లేకపోవ డం, ఆపదలో ఆ దుకునే ఆత్మీ యులు దూరం కావడం, కనీసం మనసులోని బాధలను పంచుకు నే బంధువులు కరువవ్వడం నేటి సమాజంలో మనకు నిత్యం కనిపించే దృశ్యం. |
నాటి పరిస్థితులతో నేటి పరిస్థితులను పోల్చుకుంటే ఉమ్మడి కుటుం బాలలో ఉన్న అనుబంధాలు, ప్రేమానురాగాలు, ఆత్మీయత, ఆప్యాయత...ఇవేవీ నేటి కుటుంబా లలో మనకు కనిపించవు. ఇరుకు గదుల మధ్య మనసులు కూడా ఇరుకు చేసుకొని జీవించడం తప్ప ఆత్మీయానురాగాలకు చోటెక్కడా కనిపించదు. ఇటువం టి తరుణంలోనే విచ్ఛిన్నమవుతున్న కుటుం బాల మధ్య తిరిగి సఖ్యత పెంపొందించాలనే దృఢ సంకల్పంతో ఐక్య రాజ్యసమితి వరల్డ్ ఫ్యామిలీడేను నిర్వహిస్తోంది. కుటుంబ విషయంలో కుటుంబ నైతిక, సామాజిక సూత్రాలు రూపొందించి కుటుంబ సమైక్యత, సంఘటితం గురించి ప్రజలందరికీ అవగాహన కలిగించడం, జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సుస్థిర కుటుం బాలకు దోహదం చేయడం, నైపుణ్యాన్నీ, అనుభవాలను, సామా జిక విలువలను పరస్పరం పంచుకుంటూ కుటుంబ సమస్యల విషయంలో సరైన సమాచారాన్ని, సహకారన్ని అందించడం, కుటుంబాలలో నెలకొన్న విభేదాలను తొల గించి ఆయా కుటుంబాలలో సుఖశాంతులు నెల కొల్పడం వంటి లక్ష్యాలతో ఆ రోజును జరుపుకుంటున్నాము.
ఇంటి సమస్యలను రాజకీయ నాయకుల ద్వారో , పోలిస్ వారి ద్వారో పరిష్కారానికి ప్రయత్నించడం వలన గోటి తో పోయే విషయం గొడ్డలి దాక వెళ్లి చివరకు బందాలను తెంచుతుంది . దాని వలన ఇల్లు నరకంగా మారి , ఇంట్లో ని పిల్లలు , వృద్దులు నరక యాతన అనుభవిస్తారు . మరి ఇటువంటి వాటికి తగిన పరిష్కారం చూపగలిగేవి పామీలి కౌన్సెలింగ్ సెంటర్ లు మాత్రమే . చిన్న చిన్న విషయాలకు ప్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ లకు వెళ్ళడం అందరికి కుదరక పోవచ్చు . అటువంటి వారికి మా e ప్యామిలీ కౌన్సెలింగ్ పేజీ సహాయ పడుతుందని బావించి దీనిని ప్రాంబించడమ్ జరిగింది . ఒక వేళ సమస్య తీవ్రంగా ఉంటె దానికి కూడా ఏ విదంగా చేస్తే బాగుంటుందో సలహా ఇవ్వడం జరుగుతుంది . అంతే కాక అవసరాన్ని బట్టి గ్రూప్ కౌన్సిలింగ్ లు, వ్యక్తిగత కౌన్సిలింగ్ లు ఇవ్వడం జరుగుతుంది . వీటి కోసం మనవు ఆశ్రమం తగిన కార్యక్రమాలు రూపొందించి వీటన్నింటిని మన సంప్రదాయ నానుడి అయిన "కుటుంభో రక్షితో రక్షితః " అనే నినాదంతో ముందుకు తీసుకు వెళ్లాలని మా ఆశయం. అందులో బాగమే ఈ "e ప్యామిలీ కౌన్సెలింగ్". ఏర్పాటు . మీ కుటుంబ సమస్యల పై సలహాల కోసం క్రింది లింక్ మీద క్లిక్ చేయవలెను . దానితో మీరు కౌన్సెలింగ్ పేజిలో ఎంటర్ అవ్వవచ్చును . ఆ తర్వాత మీ సమస్యను క్లుప్తంగా "కామెంట్ " బాక్స్ లో కామెంట్ గా షేర్ చేసిన యెడల , దానికి తగిన న్యాయ సలహాలు ఇవ్వబడతాయి . ఈ పేజీ కేవలం కుటుంబ పరమైన అన్నీ సలహాలు అనగా వివాహాం , భార్యా భర్తల సమస్యలు, గృహ హింస , మైనర్ పిల్లల పోషణ , వృద్దుల పోషణ, కుటుంబ ఆస్తులు తదితర విషయాలకు సంబందించి మాత్రమే సలహాలు ఇవ్వబడును . కుటుంబ బాదితులు , వారి తరపు వారు ఎవరైనా మా ఫ్యామిలి కౌన్సెలింగ్ సేవలు పొందవచ్చు. మా సలహాలు మీ సమస్యలు తీర్చడంలో ఉపయోగపడితే , మాకు తెల్పిన యెడల , పలితాలను సమీక్షించి భవిష్యత్ లో మరింత మెరుగైన సేవలు అందించుటకు వీలగును. ఆన్ లైన్ లో ప్యామిలీ కౌన్సిలింగ్ సేవలు అందించడం అనేది పూర్తిగా వ్యక్తిగతంగానే జరుగుతుంటాయి కాబట్టి కుటుంబ సమస్యలను పబ్లిక్ లో కుటుంబ మర్యాదకు బంగం కలుగదు . పైపెచ్చు కుటుంబ ప్రైవసీ ని ఇది పూర్తిగా కాపాడేటట్లు ఆన్లైన్ ప్యామిలీ కౌన్సిలింగ్ పద్దతి ఉంటుంది
www.ssmanavu.in వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ కౌన్సిలింగ్ పొందు విదానాలు
కుటుంబ సమస్యల పై కౌన్సలింగ్ కోరు వారు ముందుగా క్రింది లింక్ ద్వారా మా వెబ్ సైట్ లోకి వెళ్లి అందులోని "tell me your issue " అనే బటన్ ని నొక్కి , అందులో మెస్సేజ్ బాక్స్ లో సమస్యను ఉంచి సబ్ మిట్ కొడితే అది మాకు అందుతుంది . దీనికి పిజ్ ఏమి వసూలు చేయబడదు . సమస్యను పరిసీలించిన కౌన్సిలర్ లు మీకు కౌన్సిలింగ్ అవసరమా ? అయితే అది ఏ రకం కౌన్సిలింగ్ అయితే మీకు ఉపయోగమో నిర్దారించి మీకు ఈ మెయిల్ ద్వారా తెలియచేయ బడుతుంది . ఒక వేళ మీకు కౌన్సిలింగ్ అవసరమయితే దానికి నిర్దేశిత పీజులు చెల్లించి అపాయిమెంట్ తీసుకోవలెను. ఆ తర్వాత మీ కు కేటాయించిన తేది సమయంలో సంబందిత కౌన్సిలింగ్ సెషన్ నిర్వహించబడును .
(1). ఈ మెయిల్ కౌన్ సిలింగ్
ఈ మెయిల్ కౌన్సిలింగ్ అనగా మీ సమస్య మరియు దానికి పరిష్కార దిశగా చేసే కౌన్సిలింగ్ అంతా ఈ మెయిల్ లేక టెక్స్ట్ చాటింగ్ ద్వారా జరుగుతుంది . దీనికి ప్రతి విడి కౌన్సిలింగ్ సెషన్ కు గంటకు 1000 రూపాయలు పీజు చెల్లించ వలెను
పీజును అపాయింట్ మెంట్ కు ముందుగానే పైన తెలిపిన విదంగా ఆన్ లైన్ లేక అప్ లైన్ పద్దతిలో మా బ్యాంకు ఖాతా లో జమ చేయవలెను. తర్వాత మీరు మా వెబ్ సైట్ లోని "appointment " అనే బటన్ ను నొక్కి అందులో సూచనలు పాటించవలెను. లేదంటే ఇదే బ్లాగులోని ఈ పేజీ క్రింద ఇవ్వబడిన appointment book ద్వారా మీరు మీ కౌన్సిలింగ్ తేదీ , సమయం కోరుకున వచ్చును. అయితే ఆ సమయం ఖాలిగా ఉంటేనే మీకు కేతాయించబడుతుంది . లేకుంటే మీకు తెలియ చేసి కౌన్సిలర్ మరియు మీకు అనుకూలమైన తేది ని అప్రూవ్ చేబడుతుంది . ఇదంతా పీజు మా బ్యాంక్ ఖాతాలోకి జమ అయిన తర్వాతే షెడ్యూల్డ్ ఖరారు చేయబడుతుంది .
(2). వీడియో లేక స్కైప్ కౌన్సిలింగ్
వీడియో కౌన్సిలింగ్ స్కైప్ చాటింగ్ పద్దతిలో ఇవ్వబడుతుంది. దీనికి ప్రతి సెషన్ కు రూ 1000 పీజు బ్యాంకు అకౌంట్ లో ముందుగా చెల్లించి అపాయింట్ మెంంట్ ను ఖరారు చేసుకోవలసి ఉంటుంది . ఎన్ని సెషన్ లు అవసరం అనేది సమస్య తీవ్రత బట్టి ఉంటుంది .ప్రస్తుతం విడియో కౌన్సెలింగ్ విదానం ద్వారా రెండు కౌన్సిలింగ్ సేవలు అందించబడుతున్నవి.
(1). ప్యామిలీ కౌన్సెలింగ్ (2). మారేజ్ కౌన్సెలింగ్ .
పై దానిలో ప్యామిలీ కౌన్సెలింగ్ కుటుంబ సమస్యల నిమిత్తం ఇవ్వబడితే , మారేజ్ కౌన్సిలింగ్ కేవలం వివాహ విషయాలలో వదూవరులకు , తాము ఎంచుకోబోయే జీవిత బాగస్వామి విషయాల్లో తగు సలహాలు సూచనలు ఇచ్చి సరి అయిన నిర్ణయం తీసుకోవడం లో తోడ్పడుతుంది.
పై రెండు పద్దతుల్లో అనగా ఈ మెయిల్ మరియు వీడియో కౌన్సెలింగ్ పద్దత్తుల్లో సమాచార మార్పిడి వ్యక్తిగతంగానూ , గోప్యంగాను ఉండటం వలన ఈ తరహ కౌన్సిలింగ్లు చాలా వరకు సురక్షితం అని బావించనైనది . కుటుంబ ప్రైవసీ కి ఏ మాత్రం కలిగించదు . ఒక సారి చెల్లించిన పీజు ఎట్టి పరిస్తితుల్లో వాపసు ఇవ్వబడదు. ఏవైనా టెక్నికల్ కరణాలు చేత కౌన్సిలింగ్ కు అవాంతారాలు ఏర్పడితే అపాయింట్ మెంట్ రీషెడ్యోల్ చేయబడుతుంది
పై తెల్పిన ఆన్ లైన్ కౌన్ సిలింగ్ లో కౌన్సిలర్ లు ఇచ్చే సూచనలు క్లైంట్ కుటుంబ సంక్షేమాన్ని దృష్ట్యా , ఉంచుకుని , పైన తెల్పిన విదంగా కుటుంబ రక్షణ విదానంలో బాగంగా , సదుద్దేశ్యంతో ఇవ్వబడుతున్నవి . పీజులు కేవలం నామ మాత్రం గా తీసుకుని కౌన్సిలింగ్ సేవలు అందించడంలో ఉద్దేస్యం , నిర్వహణ ఖర్చులు కోసమే కాక, అవాంచిత , అనవసర కేసులుకు అడ్డుకట్ట వేయడానికే అని కౌన్సిలింగ్ కోరువారు అంగీకరించి ఈ ఆన్ లైన్ కౌన్సిలింగ్ కు సిద్దపడవలసి ఉండాలి . .
Thanks for this useful information,
ReplyDeleteThis information is very useful to me,
Please update this type of information more
Khammam City Classified Directory Website
I appreciate it. Use weblog to share this kind of material.
ReplyDeleteFamily Counseling
Couples Therapy