వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం మోసమవుతుందా?
మీరు ఎన్నైనా చెప్పండి. నన్ను మూడ చాందసవాది అనుకోండి. నాదొకటే సిద్దాంతం " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అరె! వైద్యుడు మోసకారి అయితే వైద్య శాస్త్రం బూటకమా? సైంటిస్ట్ మోసకారి అయితే సైన్స్ బూటకమా ? చెప్పంది. కాదు గదా మరి ఇదే రూలు మన ప్రాచీన శాస్త్రం "జ్యోతీష్యం" కు ఎందుకు వర్తించదు?
ఏమి లేదండి నిన్న కొంచమ్ ఒక లుక్కేదమని అలా బ్లాగుల దర్శనానికి బయలుదేరా. ఒక సహ బ్లాగిని రాసిన నాడీ జ్యోతీశ్యం గురించి అమే స్వీయ అనుభవం చదివా. అమేగారు హేతుద్రుక్పదం కలిగిఉండి, అప్పట్టి దాక నమ్మని జ్యోతీషాన్ని ఒకే ఒక సంఘటనతో నమ్మాల్సి వచ్చిందని రాసారు. అంతే కొంతమంది బ్లాగు మిత్రులు అలా మేదావులు అనబడేవారు, దీని పీరు చెప్పి ప్రజల్ని మూడత్వం లోకి నెట్టడమె కాక, వారిని దోపిడి చేస్తున్నారని కామెంట్లు చేసారు. అందుకే నా ఈ ప్రశ్న.
అయితే నన్ను మీరు అడగవచ్చు , వైద్యం అనేది నిరూపించబడి శాస్త్రం అయింది, అలా జ్యొతీష్యం నిరూపించబడిందా అని. నిజమే కాని మానవ జాతిని కొన్ని వేల సార్లు నాశనం చెయ్యగల అణ్వాయుదాలు కనిపెట్టాడాన్నికి ప్రపంచంతో పోటి పది కొన్ని లక్షల కోట్లు ఖర్చు చేస్తున్న మనం మన ప్రాచీన శాశ్త్రం అయిన జ్యోతీష్యమ్ మీద పరిశోదనలుకు అందులో 1 శాతం అయినా కర్చు చేస్తున్నామా? మరి పరిశోదనలు చెయ్యకుండానే అది హంబగ్ అని ఎలా నిర్దారిస్తున్నారు?
కొంతమంది అడుగుతుంటారు, అణ్వాయుదాలు అనేవి ప్రపంచంలో ప్రస్తుత దేశాల మద్య పోటీ ద్రుష్ట్యా అవసరం కాని జ్యోతీష్యం వల్ల లాభమేంటని? దానికి ఒకటే సమాదానం’లేని జబ్బుల్ని అంటగట్టి లక్షల డబ్బుల్ని గుంజండమే కాక ప్రజల ఆరోగ్యానికి హాని చేసే వైద్యుడి కన్న, వంద రూపాయలతో "నీకు భవిష్యత్తు అంతా శుభప్రదం" అని చెప్పి, ప్రజల్లో ఆశావద్రుక్పదం కలిగిస్తున్న జోతీశ్యుడే ఉపయూగకారి.’
" మానవీయత లేని,శాస్త్రాభివ్రుద్ది ప్రపంచంలోని సప్త మహాపాపములలో ఒకటి అని జాతిపిత గాంది మహాత్ముని ఉవాచ.ఆ విదంగా చూస్తే సైన్స్ పెరుతో మనం ఎంతటి పాపానికి ఒడిగడుతున్నామో అర్థం చేసుకోవాలి.కాబట్టి ప్రస్తుత సైంటిస్టులు చెప్పేదే గొప్ప, వెనుకటి వాల్లు చెప్పింది అంతా నాన్ సెన్స్ అంటే ఎలా? నా ద్రుష్టిలో మతాచారములు అన్ని నిన్నటి సైన్స్. వాటిలో మంచి ఉండవచ్చు. చెడు ఉండవచ్చు . వాటిని చేతనైతే పరిశోదించి నిగ్గు తేల్చాకె వాటి మీద ఒక అభిప్రాయానికి రావడం ఉత్తంఅ లక్షణం.
ఇక పొతే జ్యోతీశ్యమ్ గురించి, నాకు తెలిసినంతవరకు ఈ ప్రపంచంలో ఏ ఇద్దరి అంగుష్టం రేకలు ఒకేల ఉండవు.కాబట్టి మానవుల జననాలు పరిమిత సంఖ్యలో ఉండి, అట్టి జననాలు నిరంతరాయంగా కొనసాగుతుండాలి.అంటె పునారవ్రుతం(జరిగిందే తిరిగి జరుగుతాఉంటే) అయితే తప్ప ఇది సాద్య పడదు.
కాబట్టి ఒక మనిషి ఈ రోజున మరణిస్తే కచ్చితంగా ఎదో ఒక నాడు పుట్టి తీరాలి. ఈ నాటి అతని అంగుష్ట రేకలే మరు జన్మలో కూడ కలిగి ఉండాలి. ఈ సూత్రం అందరికి వర్తింపచేస్తే ఇప్పుడ్డున్న వారందరు ఎదో ఒకనాడు మల్లి ఈ భూమి మీద ప్రత్యక్షమవాల్సిందే. వారి వారి తల్లి తండ్రులు అన్నాతమ్ములు,అక్కచెల్లెలు అందరు యదాప్రకారం ఉండాల్సిందే.అందుకే నాడి జ్యోతీష్యంలో కరెక్ట్గా అందరి విషయాలు చెప్పగలుగుతుంది అని నెను అనుకుంటున్నాను. దీని మీద పరిశోదనలు చెయ్యాల్సిన అవసరంఉంది. ఎన్నో వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న గ్రహాల గురించి తెలుసుకోవాడినికి కోటానుకోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్న మానవుడు తన జన్మ రహస్యం తెలుసుకోవాడినికి కొంత ఖర్చు చెయ్యకూడదా?
ఏది ఎమైనా మన చేతి రేకలు చాలా ప్రాదన్యం కలవి అనటంలో ఎటువంటి సందేహం లేదు. రాను రాను ఎ.టి.ఎం లలొ కూడ కార్డులకు బదులు అంగుష్టం నే వాడే రోజులు అతి దగ్గరలో ఉన్నాయి. అంటె పాత రోజులు మల్లి రాబోతున్నాయి. ఆ నాడు చదువు లేక వేలి ముద్రలు వేస్తె ఈ నాడు బద్రత కోసం అదే విదానం అవలింభిచాల్సి వస్తుంది. కాబట్టి ఓ శాస్త్రజ్నానులార నేను చేప్పేది ఒకటే " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అర్థంచెసుకోండి.
http://in.answers.yahoo.com/question/index?qid=20060918065859AAd77ZW
బూటకపు పునాదుల మీడ నిర్మించబడ్డ ఏశాస్త్రమైనా బూటకమే అవుతంది. జ్యోతిష్యము నిరూపించనేబడలేదని మీరన్నారు మరి ఇంతలోనే అది తప్పుకాదని ఎలా తేల్చేయగలిగారు. ఇక పరిశోధనల విషయానికే వస్తే పరిశోధనలు కొనసాగించడానికైన కొంత ఆశ అనేది ఉండాలి లేదూ అందులో కొంతైతే హేతువుంటే అప్పుడు పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. మీ వైద్యుడు వాదనని కొంచెంసేపు సీరియస్గా పరిగణిద్దాం. ఒక వైద్యుడు వాతలుపెట్టి వ్యాధులు నయంచేస్తానన్నాడనుకోండి అప్పుడు కూడా "వైద్యుడే మోసకారికానీ వైద్యం కాదు" అని వాదించి దాన్ని వెనకేసుకురావచ్చు.
ReplyDeleteజ్యోతిష్యంలో మానవీయతా? స్రే కానివ్వండి అదికూడా చూద్దాం.
ఋతుప్రకరణంలోంచి ఈవాక్యాలు ఒకసారి చూడండి.
ఆదిత్యే విధవా నారీ - ఆదివారం (రజస్వల) ఐతె విధవ అయిపోతుంది.
మందే చ పుశ్చ్యంతి నారీ - శనివారమైతే వ్యభిచారి అవుతుంది.
మూలాద్యపాదే పితరం నిహంతి - మూలా నక్షత్ర ప్రధమ పాదంలో పుట్టినవాడు తండ్రి ప్రాణానికి ముప్పుతెస్తాడు.
గ్రహరాజే స్థితే లగ్నే చతుర్ధే సింహికాసుతే
స్వదేవరాత్ సుతోత్పత్తి: జాతా తస్యా: న సంశయ: - పారాశర హోర
ధనేశే సప్తమే వైద్యే పరజాభిగామిక:
జాయా తస్య భవేద్వేస్యా మాతాపి వ్యభిచారిణీ - పారాశర హోర
ఉపపదే బుధకేతుభ్యాం యోగ సంబంధకే ద్విజ
స్థూలాంగీ గృహిణీ తస్య జాయతే నాత్ర సంశయ: - - పారాశర హోర
అర్ధాలు తెలుసనే అనుకుంటున్నాను మీకు.
చేతిరేఖలకు ఉన్న ప్రాముఖ్యత ఐడెంటిఫికేషన్లోనేగానీ జాతకాలు చెప్పగల్కగటంలోకాదు. అసలు హస్తసాముద్రికం, గ్రహల ఆధారంగా చెప్పే జ్యోతిష్యం ఒకదానికొకటి వుధ్ధమైన విషయాలను చెబితే అప్పుడు ఏది జరుగుతుందంటారు? ఈ అసంబధ్ధంగా సైన్సును ఇందులోకి లాగడం, ఇదంతా సైంటిఫిక్కేనని బుకాయించడం మానండి.
ReplyDeleteడబ్బుచెల్లించింది సత్యంకోసంగాక, ఊరడింపుమాటలకోసమే ఐనట్లైతే గణికులవద్దకెళ్ళడంకన్నా గణికలవద్దకెళ్ళడం మంచిది.
"నేను నమ్ముతున్నాను కాబట్టి నిజం" అనే "మూఢ ఛాందస" వాదనలకన్నా చేతనైతే ఋజువుచెయ్యండి. జ్యీతిషయంలోని ఒక్క ప్రాధమిక సిధ్ధాంతోనూ కార్యకారణ సంధ వివరణ అనేది ఇంతవరకూ ఋజువుచెయ్యబడలేదు.
చివరగా ఫలానిది ఫలించకపోతే వైద్యవిధానం బూటకమని చెప్పవచ్చంటూ కొన్ని నియమాలున్నాయ్. మరి జ్యోతిష్యానికి కూడా అలాంటివేమైనా ఉన్నాయా? లేక అందరి జోస్యమూ తప్పైనా వాళ్ళే మూసకారులుకానీ శాస్త్రం మోసకారికాదు అంటూ రెట్టించిన మూర్ఖత్వంతో సున్నంరాయించుకోడానికి సిధ్ధమైపోవడమేనా?
పైనుదహరించబడిన ఏ శ్లోకాలలో మీకు మానవీత కనిపిస్తుంది? అవి నిజంగా నిజమని నమ్మితే ఎన్ని కాపురాలు కూలిపోతాయో మీకేమైనా అర్ధమవుతుందా? ఇవన్నీ ఇప్పుడెవరు పాటిస్తున్నారు అనకండి. ఈమధ్యనే ఒక ప్రముఖ జ్యోతిష్యుడు ఇదే వాక్యాలను తెలుగులో చెప్పి నిరసనలెదుర్కొన్నాడు. ఇహ ఇవన్నీ ప్రక్షిప్తాలంటారా... ప్రతి చెడ్డవిషయమూ ప్రక్షిప్తమే అనిగాక ఒక విషయం ప్రక్షిప్తమని ఎలా చెప్పగలం అన్న ప్రశ్నక్కూడా మీరే సమాధానం చెప్ప ప్రయత్నించండి.
ReplyDeleteఒక విషయాన్ని(జ్యోతీష్యం) బూటకం అని నిరూపించడానికైనా పరిశోదించి నిగ్గు తేల్చాల్సిందే.అంతే కాని ఇది పరిశోదనార్హం కాదు అని చెప్పడానికి మీరు చెప్తున్న పరాశర జ్యొతిశ్యం ఒక్కటే ప్రామానిక గ్రంథం కాదు. మీరే అన్నారు జ్యోతీశ్యం లో వివిద బాగాల మద్య వైరుద్యాలు ఉన్నాయని. అటు వంటప్పుడు కేవలం పరాసర హోర మరేదో ఆదారంగా మా నమ్మకాలను వమ్ము చెయ్యలేరు.ముక్యంగా నేను చెప్పింది నాడి జ్యొతీష్యం గురించి కొంతమంది అనుభవాలను ఉదహరిస్తు దానిని పరిశొదించాల్సిన అవసరం గురించి మేము చెపితే ఏదొ మీరు ఇష్టపడని ఒక వ్రుషి గ్రంధాన్ని ఉదహరిస్తు విమర్శలు చెయ్యడమ్ అసంబద్దం.
Deleteమెంఉ స్పష్టం గా చెప్పాము ప్రజలకు మేలు కలిగించే విషయాలే జ్యోతీశ్యులు చెప్పలనే నియమం ఉందని.ఎవరో పండితుడు దానిని ఉల్లంగిస్తే దానికి నమ్మేవాల్లు మూర్కులు అంటే ఎలా? ప్రపంచ మానవాళికి జ్యొతిష్యం అనే ప్రాచీన శాస్త్రం ద్వారా జరిగిన నాశనం కన్న, నేటి సైన్స్ ద్వారా జరిగిన వినాశనం కొన్ని వేల రెట్లు. ఉదాహరరణకు హిరోషిమా, నాగసాకి. ఆమ్త మాత్రంచేత పరిశొదనలు చెయ్యడం మానారా?ఇంకా ఇంకా వినాశకాలను అవిష్కరిస్తూనే ఉన్నారు. మీకు చేతనైతే వాటిని ఆపండి. శాస్త్రీయ గ్నానంతో వినాశనాన్ని కొని తెచ్చుకునే దాని కన్న, నమ్మకాలతో అనందంగా జీవించడమే మేలు.
మీరన్నట్టు జ్యొటీష్యం మీద నమ్మకం మాకు మాత్రమే కాడు(మా టపాకి లింక్ ఏడ్ చేసాము కావా లంటే చూద గలరు). ఈ దేశం లో కొన్ని కోట్ల మందిది ఇతువంటి నమ్మకం కలిగి ఉన్నాం. . ఒక వేల దీని మీద పరిశోదన జరగాల వద్దా అనేది వొటింగ్ కు పెట్టిన నమ్మక్కస్తులదే పై చెయి. ప్రజాస్వామ్య విదానం మీద మీకు నమ్మకముంటె ఆ విదంగానైన జ్యోతిష్యమ్ మీద పరిశోదనలు జరగాలని అంగీకరించవలిసీందే.
మల్లి చెపుతున్నాము’ " దేనినైనా గుడ్డిగా నమ్మడం యెంత తప్పో, గుడ్డిగా వ్యతిరేకించడం అంతే తప్పు". అంతే కాని కేవలం మా నమ్మక్కాన్ని విమర్శించడానికి దెవుడినని వచ్చి, కనీసం మీ ఐడెంటిటి తెలుపలేని మీరు మాకు సున్నాలు రాసే దమ్ముందా? అలా చెయ్యడాని కైనా పరీశోదనలు జరగవలిశిందే.ఇక పోతే గణికుల దగ్గర కెల్లాలో, ఎవరి వద్దకు వెళ్లాలనేది వారి ఆలోచన స్తాయి ని బట్టి ఉంటుంది. నమ్మక్కమనేది మేము కల్పించుకున్నది కాదు .అది మాకు తరతరాల వారసత్వం. దానిని మీ శుష్క వాదాలతో మా మనసులనుండి చెరిపివెయ్యలేరు. పరిశోదించి నిజాన్ని అవిష్కరింప చెయ్యండి. అప్పుడే మీరు చెపుతుంది నిజమని నమ్ముతాం(మళ్లి ఇక్కడ కూడ నమ్మక్కానిదే పఈ చేయి).
పైచేయి నమ్మకానిది కారాదు అవలేదుకూడా. మీరు కేవలం మొండిగా మాది పైచేయని వాదిస్తున్నారు ఏమో భావిస్తున్నారేమోకూడా. మానమ్మకాలను చెరపలేరు అని మీకుమీరు ధైర్యంచెప్పుకోవడంతప్ప మీ ఈ వాదనలో నాకేమీ పస ఉన్నట్లుగా అనిపించలేదు.
Deleteజ్యోతిష్య ప్రక్రియలమధ్య వైరుధ్యాలున్నాయన్నారుకాబట్టి ముందు ఏది ప్రామాణికమన్న విషయంతేలాకనే ఆ ప్రామాణికమైన దానిమీదనే పరిశోధన జరిగితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి.
మీది విజ్ఞానం కాదని కేవలం నమ్మకం మాత్రమే నని ముమ్మారు చెప్పుకుంటున్నారు. ఆనమ్మకం కూడా మీదికాదని తాతతండ్రులనాటిదనీ వారివద్దనుండి అరువుతెచ్చుకున్నదని కూడా చెప్పారు. మీ అభిప్రాయాలు మీకు సొంతగా లేకపోవడం ఎంత బాధాకరమో ఎన్నడైనా ఆలోచించారా? నిజమ్నేది నిగ్గుతేలవలసింది నమ్మకాల ఆధారంగా కాదు ఋజువుల ఆధారంగా. అవుంటె ప్రవేశపెట్టండి లేదంటే "కోట్లమందిమి నమ్ముతున్నాం" అనే శుష్కవాదనలు కట్టిపెట్టండి. అసలు మీరు ఒకవిషయాన్ని నమ్మవలసిన అగత్యం ఏమిటి? ఎందుకు ఋజువులులేకుండానే నమ్మడాన్ని మొదలుపెట్టారు? కాదుకూడదన్నా మీరెలాగూ పారాశరహోరను నమ్మరుకాబట్టి దాన్ని చర్చనుండి మినహాయించినా నాడీ జ్యీతిష్యాన్ని నమ్మేవాళ్లకంటే నమ్మనివాళ్ళే ఉన్నారన్న విషయం తెలుసుకోండి.
జ్యోతిష్యానికీ అణుబాంబుకీ లంకేమిటో అర్ధంకాలేదు. అది బహుశా మీరు విషయాన్ని దారిమళ్ళించడానికి చేసిన ప్రయత్నం కావచ్చుననుకుంటున్నాను. నేను అణుబాంబులను వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు చెప్పండి జ్యోతిష్యాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారా?
పండితులు చెప్పాల్సింది తియ్యటి అబధ్ధాలు కాదు. కటువైనా ఆధారసహితమైన నిజాలు చెప్పాలి. వైద్య శాస్త్ర పండితులుకూడా ఇలాగే తియ్యటి అబధ్ధాలు చెబితే ఏమవుతుందో ఊహించారా?
తీరా ఋజువుచేసినా మీరు నిజంగా నమ్ముతారా? అప్పుడుకూడా మా నమ్మకాలు అనరని ఎలా నమ్మడం. అయినా నేను రేపు వర్షం పడుతుంది అనిచెబితే దాన్ని ఋజువుచెయ్యాల్సిన బాధ్యమీ మీమీద కాదు ఆవిషయాన్ని చెప్పిన నామీద ఉంటుంది. అయినా ఋజువుచేసుకోవాల్సిన పరిస్థితుల్లో జ్యోతిష్యమే ఉంది. మీ ఋజువులకోసం ఎదురుచూస్తున్నాను.
మనిషికి సంబందించినంత వరకు ఎప్పట్టికి పై చేయి నమ్మకానిదే . దీన్ని కాదనే ఏ వాదము పరీక్షకు నిలువలేదు. అసలు మనిషి జన్మమే నమ్మకంతో కూడుకున్నది. తల్లి వాస్తవమైతే ,తండ్రి నమ్మకం. ఆ తల్లి అనే వాస్తవం కూడ నమ్మితేనే, బహుశా దేవుడైన మీకు మ మానవ నమ్మకాల గురించి అవగాహన లేక పోవచ్చు. మనుషుల్ని అడగండి చెపుతారు. దేనిది పై చేయో.
Deleteదాంక్స్! కనీసం ప్రామాణిక గ్రంథమేదో తెలుసుకొని దాని మీద నైనా పరిశోదనకు అంగీకరించినందుకు. అసలు పరిశోదనలు అంటూ చేస్టె తులనాత్మక అద్యయనం ద్వారా ఏది ప్రామాణికమో నిర్దారించవచ్చు.
మీరు దేవుడు కాబట్టి, మీకు తల్లి తండ్రులు, తాతలు, వారసత్వాలు గురించి తెలియక పోవచ్చు. లేకుంటే సిల్లీగా "అరువు తెచ్చుకోవడమేమిటి" . ఏదైనా జీన్స్ ద్వారా నమ్మకాలు కూడ తాతల నుండి సహజంగా వస్తాయని తెలీదా?. వాటిని మార్చాలంటే జ్యొతీష్యం వాస్తవం కాదు అని నిరూపించబడి, దానిని మేము నమ్మితే అప్పుడు మా తాతల నమ్మకం చెరిపివేయబడి మా ప్రస్తుత నమ్మకం మా జీన్స్ లో రికార్డ్ అయితే అప్పుడు మెము మారతాం. అప్పటిదాక మా తాతల నమ్మకాలే మా నమ్మకాలు.
అసలు మనిషికి నమ్మకం అనే బాష తప్ప వాస్తవం అనేది ఏది తెలియదు. మీర్య్ ఏ విషయానైన్న మా నమ్మకం అనే బాషలోకి మార్చితేనే మా మనస్సు అర్థం చేసుకుంటుంది దేవుడు గారూ. ఎలాగంటే కంప్యూటర్ లాగన్నమాట.
ఎవరికైనా జ్గ్నానం ఎంట ముఖ్యమో ఇంగిత జ్గ్నానం కూడ అంతే ముఖ్యం దేవుడు గారూ! కాసేపట్లో చని పోయే రోగికి కూడ వైద్యులు నీవు బ్రకుతావు అనే చెపుతారు. అది కూడ తెలియకపోతే ఎలా దేవుడు గారూ!
రుజువులు చూపించినా నమ్మని వాళ్లమైతే ఇంత చర్చ ఎందుకు పెడతాము. అయినా మేము నమ్ముతామని ,నమ్మకం అంటె ఏమిటొ తెలియని దెవుడు గారిని మేమేలా నమ్మించేది? ఒరీ దేవుడా ! మాకేది దారి!
సరే మీరు రుజువులు అడుగుతున్నారు కాబట్టి, ఓ.కె. అలాగే చూపిస్తాను. ఒక షరతుమీద .ఏమిటంటే మీ ఒరిజినల్ ఇడెంటిటి తెలియపర్చండి. అప్పుడు రుజువు గురించి అడగండి. ఓ.కే.
దగ్గర ఉన్న "విషయం" అయిపోయాక ఎలాగూ వెటకారాలు మొదలెడుదురుగానీ అప్పుడే అందుకులెండి.
Deleteమా నమ్మకాలు మాఇష్టం అనే అనాలనుకుంటే ఇంతగోల అనవసరమండి. నేనేనో మీరు నిజాలు మాట్లాడతారనుకున్నానుగానీ మీ నమ్మకాలనుగురించికాదు.
అది ప్రామాణికం కాదని మీరే అన్నారు. నేను కేవలం ఏది ప్రామాణికమో తెలుసుకొనే/తెలియజెప్పే అవకాశాన్ని మాత్రమే మీకిచ్చాను. నా మాటలు వక్రీకరించకండి.
నమ్మకాలు జీన్స్ ద్వారా వస్తాయని మీకెవరు చెప్పారో/ మీరెలా "నమ్మేశారో" తెలుసుకోవచ్చా? నమ్మకాలు జన్మత: రావు. అవి జన్మించినతరువాత తాతతండ్రులు తాము రూధిచేసుకోవడంలో విఫలమైన నమ్మకాలను తమ పిల్లలపై రుద్ది తమ అజ్ఞానాన్ని దాచుకొనేదశలో వస్తాయి. దయచేసి మీరు నమ్మిందే సైన్సనే నమ్మకంలోంచి బయటకు రండి.
మళ్ళీ అదేమాట "నమ్మకం". నేనుకూడా మీరు నమ్మిన విధంగా ఆలోచిస్తే ఇహ మీరు వేరేకోణం తెలిసేదెలగండీ? మీరు ఒక అబధ్ధాన్ని నిజమని నమ్మి ఇతరులనికూడా మానమ్మకాలనీడలో ఆలోచించండి అనడం ఏం తర్కం? ఇంకోలా దీన్నీ "మా అజ్ఞానంలో మమ్మల్ని వదిలెయ్యండి" అనొచ్చు. మీరేమో ఒక వ్యాఖ్యానం చేస్తారూ... దాన్ని ఋజువుచెయ్యాల్సిన బాధ్యతమీద మీకుకాకుండా ఇతరులకుంటుంది? ఇదెక్కడి తర్కం?
వైద్యుడు రోగియొక్క రోగాన్ని దాచడం "ఇంగితమా"? అదేవిధంగా జ్యోతిష్యులు అబధ్ధాలాడటం కూడా ఇంగితమా? నేనన్నది మీకర్ధమయినట్లులేదు ఆ ప్రముఖ జోతిష్యుడిపై నా నిందకు కారణం అతడు నిజం చెప్పాడనికాదు ఏఆధారమూ లేకుండా వదరాడు అని మాత్రమే. గమనించగలరు. అతడు ఇలాంటి గాలికబుర్లుకాకుండా కనీసం సంఖ్యాశాస్త్ర పరంగానైనా ఋజువుచెయ్యగల విషయాలు చెప్పుంటే, అవి కటువైనవినా అది సమర్ధనీయమే. మెరమెచ్చులకు పోయేవాడా పండితుడంటే ఇదెక్కడి అర్ధం?
"అసలు మనిషికి నమ్మకం అనే బాష తప్ప వాస్తవం అనేది ఏది తెలియదు"
అని మీరనుకుంటున్నారు. ఇంకేవాస్తవమూ తెలియకుండా ఉంటే బాగుండునని ఆశిస్తున్నారు. ఇలాంటి అభిప్రాయాలున్నమీరు ఇలాంటి నిరాధార విషయాల్ని నమ్మడంలో పెద్ద ఆశ్చర్యం లేదని ఇప్పుడు నాకనిపిస్తుంది.
మీరు మీ ఊహాలోకాల్లోంచి, నమ్మకాల్లోంచి బయటకు పడేప్రయత్నమైనా చెయ్యాలంటాను. అది సాధ్యంకానప్పుడు మీరు నమ్మిందే సత్యమని బుకాయించడమైనా మానుకోవాలి.
చివరిగా పరిచయాల మాట. అది అనవసరం. నా పేరు సుబ్బారావని తెలిసిమ్నంతమాత్రాన మీకు ఒరిగిపడేదేమీ ఉండదనుకుంటను. మీరు మనవు ఎలాగో నేను దేవుడు అంతే.
(1)విషయజ్గ్నానం అనేది జేబులో డబ్బు కాదు అయిపోవడానికి. అది ఖర్చు చేస్తున్న కొద్ది పెరుగుతుంది.కబట్టి ఈ విషయంలో మీ ఆశ ఆడియాస అవక తప్పదు.
Delete(2).మీ మాటలు నేను వక్రీకరించానా? ఎంత అభాండం !
"జ్యోతిష్య ప్రక్రియలమధ్య వైరుధ్యాలున్నాయన్నారుకాబట్టి ముందు ఏది ప్రామాణికమన్న విషయంతేలాకనే ఆ ప్రామాణికమైన దానిమీదనే పరిశోధన జరిగితే బాగుంటుందేమో ఒకసారి ఆలోచించండి."(దీని బావమేమి తిరుమలేశా).
(3).మీకు మాకు మధ్య ఈ విషయంలో మౌలికంగానే బేదాభిప్రాయం ఉంది. జీన్స్ ద్వారా నమ్మకాలు వస్తాయని మేము రావని మీరు అన్నాకా ముందుగా ఈ విషయాన్ని రూడి పర్చుకుంటె మంచిది.
ఒక వేల మీరన్నట్టు నమ్మకాలు వారసత్వ సంక్రమణయే కాక పోతే, మహా సైంటిస్టుల్లున్న "షార్" కేంద్రంలో "చెంగాలమ్మ తల్లి" గుడి ఉండేదే కాదు,రాకేట్ లాంచింగ్ కు ముందు ఆమేకు పూజలు జరుగుతుండేవే కావు.అందుకే అంటారు పెద్దలు " పుట్టుకతో వచ్చిన బుద్దులు పుల్లలతో కాని పోవు అని.".ఇది అనుభవసారం మరియు నిరూపితం.
మీకున్న గుణాలను ఎదుటి వాళ్లకు ఆపాదించడమ్ మంచి పద్దతి కాదు. మీకు నిజంగా మాతో చర్చ జరపాలని ఉంటె మీ ఒరిఝినల్ ఐడెంటిటి ఇవ్వడం తప్పనిసరి. మేము మనవు అనే పేరుటొ బ్లాగు ను నిర్వహిస్తున్నా మా పేరు,ఫోటో తో సహా ప్రచురించాము. ఇది మా నిజాయతి.మేఏరేవ్వరో తెలియకుండా మీతో చర్చ ఇక పై జరపం.ఇది ప్రస్తుత సామాజిక,భద్రాత పరిస్తితుల ద్రుష్ట్యా అనివార్యం. మీరు చర్చ కొనసాగాలంటే మీ రెవరో చెప్పండి దట్సాల్.
1) ఇదే మీసమస్య. ఎక్కడైతే హేతువుతో అవసరం ఉంటుందో అక్కడ మీరు తర్కాన్నో, తత్వాన్నో వాడుతున్నారు. మీరన్న ఒక్కమాటనూ మీరు ఋజువుచెయ్యడం అలా ఉంచి కనీసం మీకు మీరు రూఢిచేసుకోగలరా?
Delete2) మీ వ్యాఖ్యను నేను తప్పుగా అర్ధం చేసుకొని అలా వ్యాఖ్యానించాను. దాన్ని ఉపసంహరించుకుంటున్నాను.
3) జీన్స్ లేదా జన్యువులు అనేవి తలిదండ్రుల నుండి వారి పిల్లలకు సంక్ర మిస్తాయి. అవి ప్రధానంగా శరీరక లక్షణంఆలను (ఎత్తు, రంగు), పిల్లలకు సంక్రమించల వ్యాధుల(కాన్సర్, రక్తహీనత, షీజోఫ్రెనియా) సంభావ్యతనూ ప్రభావితం చేస్తాయి. నమ్మకాలు అనేవి జన్యువులమీదకాక పెరిగిన (మళ్ళీ చెబుతున్నాను పుట్టినకాదు) పెరిగిన పరిస్థితులపైన, సమాజిక నేపధ్యంపైన ఆధారపడతాయి. "చెంగాలమ్మ" పూజించే తలిదండ్రులకు పుట్టిన బిడ్డ తప్పిపోయి, ఏ క్రైస్తవులకో, మహమ్మదీయులకో దొరికితే ఆ బిడ్డ చెంగాలమ్మను కాక ఇంకొకర్ని ఆరాధించేవాడిలా పెరుగుతాడు. అదే ఒక క్రైస్తవుని ఇంట పుట్టిన బిడ్డ ఈ చెంగాలమ్మ భక్తులకు దొరికినట్లైతే అతను చెంగాలమ్మను పూజించేవాడిలా తయారవుతాడు. ఒక మనిషి చెంగాలమ్మనో, నూకాలమ్మనో పూజించడంలో జన్యువుల ప్రభావం ఉండదు. మీకర్ధం కాకపోతె ఇదే వివరణ ఇంకోలా ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. దయచేసి తెలుపగలరు. చర్చ జరపాలా వద్దా అనేది మీ ఇష్టం, నా సిహ్టం దానికి identity ని సాకుగా చూపించవలసిన అవసరం లేదు. మీరుచెబుతున్నట్లుగాక భద్రతా కారణల దృష్ట్యా వ్యక్తిగత విషయాలు ఇంటర్నెట్లో బయటపెట్టుకోవద్దని నిపుణులు చెబుతారు.
నమ్మకం గురించి ఒక ప్రశ్న. అదే సైంటిస్టులు కట్టగట్టుకొని నిత్యానందను పూజిస్తే అతను గొప్పవాడైపోతాడా? కొన్నాళ్ళు గొప్పవాడుగా చలామణీఅయిన అతను నిజం తెలిసిన తర్వాతే కదా ఈనాడు పాఖండుడు అని తెలిసింది. అదే నిజాన్ని తెలియబరచుకొన్నాకే అతన్ని అనుసరించాలోవద్దో నిర్ణయించుకొనుంటే ఆయన భక్తులకు తలవంపులు తప్పేవికదా.
Are beliefs inherited?
DeleteResearch shows some attitudes are rooted in genetics, though environment is still key.
By TORI DeANGELIS
April 2004, Vol 35, No. 4
In a 1998 study reported in Personality and Individual Differences (Vol. 24, No. 1), Tesser and colleagues even demonstrated that people react physiologically if they are primed to change highly heritable attitudes--indeed, their heart rates increase and they show higher skin conductance.
As a whole, Tesser's studies suggest that highly heritable attitudes may drive such high-stakes decisions as who to marry, how to earn a living and where to live. "You want to be around people who agree with you," Tesser says, "and even in very abstract terms, the probability of returning to places that agree with you are higher for more highly heritable attitudes."
Tori DeAngelis is a writer in Syracuse, N.Y.
ఏదో మీకు తెలిసిన సైన్స్ యే సైన్స్ అని నమ్మక్కo గురించి మాట్లాడే వాళ్లు మూర్కులని బావిచడం మానివేయండి. మీరు చెప్తున్న జీన్స్ సిద్దాంతం అదే జీన్స్ కేవలమ్ మనిషి ఆకారం, వ్యాదులు లాంటి వి సంక్రమింపచేస్తాయని, నమ్మకాలు లేక ద్రుక్పదాలుకు సంబందం లేదని సగం శాస్త్రాలు చూసి,సర్వం తెలిసిన పండితుడు లాగ చెపితే ఏలా?వీటి మీద చాల సమాచారం దొరుకుతుంది.చదవండి.(పైన ఆంగ్లంలో ఉన్న రిఫరెన్స్ ఒక ఉదాహరణ మాత్రమే)
మీరు చెప్పిన అరాదన ఉదాహరణ లో కూడ జీన్ ప్రభావం ఉంది తీరాలి. ఇక్కడ మౌలిక బేదం ఏమిటంటే ఏ దేవుడిని ఆరాదించాలి అనేది సమాజిక నేపద్యం మీద అదారపడినా అసలు అరాదన అనే లక్షణం మాత్రం జీన్ ద్వార సంక్రమిస్తుంది. ఒక వేళ ఏ దేవుడు దొరకక పోతే సినిమా దేవతలనైనా ఆరాదిస్తారు.నేను మా వూళ్లొ చూసాను. దేవుని ప్రభ బండికి మార్క్స్ ఫొటొ పెత్తుకుని వచ్చారు. అసలు దైవ పూజ వద్దంటే వారిలోని ఆరాదన లఖ్శనం ఎదురుతిరుగుతుంది. అందుకే రాజి మార్గంగా తమ పార్టి సిద్దాంత కర్త మార్క్స్ ఫోటో పెట్టుకుని ప్రభ బండి కట్టి గుడికి వచ్చారు. పోని మీలాంటి శాస్త్రీయవాదులు అలా చెయ్యడం తప్పని నిరోదిశ్తే ఏమి జరుగుతుంది ఆ యెరియాలో పార్టి గోవిందా!
నేను చెప్పిన ఈ సూత్రం నిత్యానంద కదకి కూడ సరిపోతుంది. మీరు సత్యం చెప్పి నిత్యానందను మార్చ గలరు. మరో ప్రేమానందని అరాదించరని గ్యారంటి ఏముంది. అందుకే మన పని ఏది మంచి ఏది చెడు చెప్పటం వరకే. ఆసలు ఆరాదనే వద్దంటే జీన్ దెరపి ఏమ్మన్నా కని పెట్టి ,హిట్లెర్ లాగ అందర్ని శాసీంచి జీణ్ దెరపీ చేయించండి. అప్పుడు ఏమన్న పలితం ఉండవచ్చు.
బద్రత కారణాల వల్ల దెవుడిగా ప్రత్య్క్షమవుతున్నారు అంటే మీరు కచ్చితంగా దేవత అయి ఉంటారు. సరే మీకు మినహాయింపు.
Well Mr. Manavu this is the first time you have come up with proofs are at least something that looks like that. I must say.. bravo!!
DeleteWhile the concept of the genes that lay dormant until they "experience" triggering factors in the environment is not a concept unknown, the "study" it self falls... no confines itself at the in the grey area. This at best is an explanation to support the "statistical" evidence. The studies have never been subjected to the standard scientific processes of verifiability and hence are merely anecdotal if not blank-filler explanations.
For the umpteenth time... gene therapy could not account for any change in the belief systems and the beliefs do get formed and strengthened and further reinforced out of peer pressure in other words social conditioning.
Thanks for giving me a waiver with regard to this "identity crisis".
ఈ చర్చ మీ కోసం నా కోసమో కాడు. తెలుగు వీక్షకుల కోసం. మేము కేవలం ఇతరులు చెప్పినది ఏ బాషలో ఉంటే ఆ బాషలో దానిని కాపి చేసి బ్లాగులో ఉంచటం జరుగుతుంది. అందు కోసమే అలా ఇంగ్లిష్ లో ప్రచురించాము తప్ప అన్యదా కాదు. అభ్హిప్రాయాలన్ని తెలుగులోనే తెలపాలని మనవి.
Deleteమీరు చెపుతున్న దాని బట్టి ఏదైనా శాస్త్రీయంగా రుజువు కానిదే నమ్మం అంటారు. మేము మొదతనుంచి మొత్తుకుంటున్నది అదే గదా! జ్యొతీష్యాన్ని పరిశోదించాలంటే అది బూటకం దానిని పరిశోదించేది ఏమిటీ అంటారు. ఏదఈనా ఒక విషయంలో ఇతరుల అనుభవాలు ప్రవేశ పెడితే అది శాస్త్రీయంగ పరీక్షలకు గురి కాలేదు అంటారు. మీకు ప్రతిదీ శాస్త్రీయ పరంగా రుజువు కావాలంటే ఈ సమాజంలో ప్రతి తండ్రి డి.ఏన్.ఏ పరిక్షకు గురి కావాల్శి వస్తుంది. ప్రతి తల్లి శీలం సైస్స్ పరీక్షలకు నిలవాల్శి ఉంటుంది. దీనిని అడ్డగోలు వాదం లేదా పిడి వాదం అంటారు. అమ్మ పెట్టా పెట్టదు, అదుక్కు తిననివ్వదు అని అటు పరీషోదనలు వద్దంటా? ఇటు నమ్మరంటా? వారేవా !మీరు దేనికైనా ఒప్పుకోవాలి. పరీశోదించి నిగ్గు తేల్చడమా? లేక ప్రజల నమ్మకాల్ని ఒప్పుకోవడమా?
Deleteఋజువు అంటే శాస్త్రీయమైన ఋజువు అని మీరర్ధం చేసుకుంటరనుకున్నానుకానీ మరొకటికాదు. ఇహ శాస్త్రీయ విధానం అనడంలో నా ఉద్దేశ్యం double blind, triple blind విధానాల గురించి. జ్యోతిష్యం విషయానికే వస్తే ఒక జ్యోతిస్యవిధానానికీ ఇంకొక జ్యోతిష్య విధానానికి మధ్య విభేదాలున్నప్పుడు ముందు వాటిలో వాటిని కలహించుకోనివ్వండి ఆవిధంగా విజేతను శాశ్త్రీయ మనం ఆస్కార్, ఒలంపిక్స్ కు పంపించే తీరుగా పరీక్షకు అనుమతించండి. ఇందువల్ల ప్రజాధనం కూడా ఆదా అవుతుంది కదా అన్న అర్ధంలో నేను చేసిన వ్యాఖ్య ఉంది. మరోసారి గమనించగలరు. మీసమస్య నాస్తికులకు శాస్త్రాలతో పొసగకపోవడంకాదు ప్రత్యేకించి జ్యోతిష్యశాస్త్రం విషయంలో. జ్యోతిష్యంలోని ఒక విధానం ఇంకొక విధాన్నానికీ ఎంతమాత్రమూ పొసగదు. ఇక పారాశరహోర తనతఓ తానే విభేద్ఫిస్తుంది. ఉదాహరణకు పంచమిలో రజస్వల ఐన స్త్రీకి ఒక ఫలితాన్నీ, ఆదివారం రజస్వల ఐన పూర్తిగా విరుధ్ధమైన ఇంకొక ఫలితాన్నీ ఆపాదిస్తుంది. మరి పంచమి ఆదివారం? అన్నవిషయంలో మౌనం వహిస్తుంది. ఏదైనా ఒక భౌతిక శాస్త్రం ఇంత లోపభూఇష్టంగా ఉన్నటైతే అది పరిశోధన విషయం అలా ఉంచి కనీసం పలిశీలనకు కూడా నోచుకోదు. కాబట్టి నా ఉద్దేశ్యం ప్రకారం ఈ విషయంలో (పైనుదహరించిన శ్లోకాల నేపధ్యంలో) పరిశోధనకన్నా సంస్కరణ అవసరం ఎక్కువగా ఉంది.
Deleteమీరు చెబుతున్న కర్మ సిధ్ధాంతంకూడా నిరూపణకు నిలిచేదికాదు. Strong form of కర్మ సిధ్దాంతం 'మీ జీవిత గమనం నిర్దేశించబడిన ప్రకారమే నడుస్తుంది, దాన్ని మీరు మార్చలేరు' అనిచెబుతుంది. అదే కర్మ సిధ్ధాంతాన్ని సడలిచి అందులో మళ్ళీ జ్యోతిష్యానికి వెసులుబాటు కల్పించి నట్లైతే అదే కర్మ సిధ్ధాంతం 'కొన్నిసార్లు నిజమఔతుంది, ఇంకొన్నిసార్లు కాదు' అని అర్ధం వచ్చేలా ప్రవర్తిస్తుంది. తద్వారా అదసలు ఒక సిధ్ధాంతగా కూడా పరిగణించగల అర్హత కోల్పోతుంది. ఏదేమైనా... కొన్నికులాలవారిని నిరాశలోకి నెట్టి, వారిని బానిసలకంటే తక్కువస్థాయికి నెట్టడంలో ఈ పునర్జన్మ ప్రస్తావనతోకూడిన కర్మ సిధ్ధాంతం పాత్ర ఎన్నదగినది. ఇలాంటి సిధ్ధాంతాలను అమాయక ప్రజల మెదళ్ళలో విజయవంతంగా చిప్పించడంద్వారా కొందరు గతంలో కాయకష్టంచేయకుండా, సామాజిక సంపదల నిర్మాణంలో ఏమాత్రంపాలుపంచుకోకుండా తమ జీవనోపాధిని కల్పించుకోగలిగారు. మనకు కావలసింది కష్టపడాలన్న తపన కలిగినవారేకానీ జ్యీతిష్యులుకారు. వీరివల్ల నయాపైసకూడా సమాజానికి లాభంలేకపోగా అమాయకులపై అధారపడి జీవించే పరన్నభుక్కులువీళ్ళు. మతాన్నడుపెట్టుకొని వీళ్ళుచేస్తున్న మోసాలవల్లే మొత్తం మతానికీ చెడ్డపేరువస్తుంది.
మీరు ఎక్కువగా మిమ్మల్ని మీరు "మేము" అని సంబోధించుకోవడం, ఒకే టపాని పలుమార్లు పోస్టుచేయడం ఎబ్బెట్టుగా ఉన్నాయి మరియు ఇదంతా ఏదో వ్యాఖ్యలకోసం పాకులాటలా నాకు అనిపించింది. కాబట్టి ఇక శెలవు.
Deleteమాది వ్యాఖ్యల కోసం పాకులాటే అయితే దానికి చాలా పద్దతులున్నాయి. తమే గొప్ప విజ్గ్నాఅవంతులమని, నమ్మకాలు కలిగిన వాళ్లు మూర్కులని,నమ్మకం పెంచుకున్న మీలాంటి వాళ్ళు చివరకు చెప్పే మాటలు ఇవే. వేరు,వేరు పేర్లతో మీరు ఎప్పూడైతే విమర్శలు మొదలు పెట్టారో అప్పుడే మీ నిజ స్వారూపం తెలిసిన కెవలం విషయ విస్త్రుతి కోసమే వాదనలు చేసాము. మా ఈ బ్లాగును ఎవరు నిర్వహించిన ఇది మా ఆశ్రమం అయిన శ్రీ సూర్య సావర్ణిక మనవు ఆశ్రమం తరపున నిర్వహించబడుతుంది. ఆశ్రమం ఒక రిజిస్టర్డ్ సొసైటి. కాబట్టే మెము అనే పదం ఉపాయగిస్తున్నాను. ఆచార సంప్రాదాయాలు గౌరవించే వాళ్లని చూస్తే అవంటే తెలియనివాళ్లకి కలిగిదీ ఎబ్బెట్టు,జుగుఫ్సాలే. మీ లాంటి వాళ్లని చూస్తే మాకు కలిగేది జాలి మాత్రమే.
Deleteమను స్మ్రితి ప్రాకారం వాగ్వాదం కూడ ఒక యజ్ణమే. మేము అలా భావించే సాద్యమైనంత వరకు ఎక్కువమందిని ఈ యజ్ణంలో బాగం చేయదలచి అలా ౩ సార్లు రీ పోస్టింగ్ చేసాము. మీశలవుకు మా దన్యవాదాలు.
మీరు చెప్పిన సిద్దంతాలన్ని విని విని ఉన్నవే. కొన్ని విదానాలు మంచివే అయినప్పట్టికి చేప్పే విదానం తెలియక మహమహులే ఆచరణలో విఫలమయ్యారు. మార్క్శిసమ్ అనేది గొప్ప ఆర్థికవాద పరిణామ సిద్దాంఆతం. దాని ప్రకారం కూడ ఒక వ్యవస్త తర్వాత మరొక వ్యవస్త రావాలి.ఇంకా ఇది ఒక రకంగా అర్థిక వాద కర్మ సిద్దాంతమే.సాఖ్శాతు మార్ఖ్స్ అన్నట్లు మార్క్సిసమ్ కూడ స్తానిక పరిస్తితుల కనుగుణంగా మార్చ గలిగినప్పుడే విజయం సాదిస్తుంది. లేకుంతే మన దేశమ్లో ఏ పరిస్తితి ఉందో అలాగే అవుతూంది ఒక వేళ ఈ దేశంలో కమ్మునిజం వచ్చిన అది మీరనుకునే రూపములో రాదు. అది ఈ దేశ సంస్క్రుతి ననుసరించి మనదైన ఇజం రూపంలో మాత్రమే వస్తుంది. ఏదో ఒక వర్గం మీద ద్వేష బావంతో ఇతర వాదాలను ఆశ్రయించి ఈ దేశ ప్రజలు ఎప్పటికైనా వాటిని అనుసరిస్తారు అనుకుంటే దానికన్న మూర్కత్వం మరొకటి ఉండదు.
Deleteరకరకాల పేర్లతో ఇతరుల బ్లాగులలోకి జొరబడి తెల్వి చూపిస్తున్నననుకోవడం ఒక మానసిక రోగం. త్వరగా మంచి వైద్యుడిని సంప్రదించిడం అందరికి సృఎయశ్కరo
Deleteవాస్తుని నమ్మేవాళ్ళు కూడా ఇంతే. ఏ ఇద్దరు వాస్తు పండితులూ చెప్పేది ఒకేలాగ ఉండదు అని మనం చెపితే వాస్తుని నమ్మేవాళ్ళు ఆ విషయాన్ని పట్టించుకోరు. మేమేమీ నలుగురైదుగురు వాస్తు పండితుల దగ్గరకి వెళ్ళలేదు, అందరికీ తెలిసిన వాస్తు సూత్రాలే మేము చెపుతున్నాము అని అంటారు.
ReplyDeleteప్రస్తుత చర్చ వాస్తు మీద కాదు. ఆ సందర్భం వచ్చిన్నపుడు తప్పకుండ చర్చిద్దామ్. మా బ్లాగును దర్శించినందులకు దన్యవాదాలు.
Deleteచర్చించడానికి వ్యాఖ్య వ్రాయలేదు. నమ్మకాల విషయంలో కూడా కన్వీనియన్స్‌ని చూసుకోవడం వాటిని నమ్మేవాళ్ళకి సహజమే. ఆ విషయం గుర్తు చెయ్యడానికే వ్యాఖ్య వ్రాసాను. ఇద్దరు జ్యోతిష్యులు పెట్టే ముహూర్తాలు కూడా ఒకేలాగ ఉండవు అని వాటిని నమ్మేవాళ్ళకి తెలుసు. మా నాన్నగారు కూడా ఏ జ్యోతిష్యుడు తొందరగా ముహూర్తం చూస్తే ఆ జ్యోతిష్యుణ్ణే నమ్మేవారు. మీతో చర్చించడానికి వేరే వ్యక్తి ఉన్నారు. ఆయన ఈ-మెయిల్ అడ్రెస్ గుర్తొచ్చిన తరువాత దీని గురించి ఆయనకి ఫార్వార్డ్ చేస్తాను.
ReplyDeletethank you praveen once again
ReplyDeleteఒకవేళ నమ్మకాల మీద బతకడం సాధ్యమైతే మీరు జ్యోతిష్యుల దగ్గరకి వెళ్ళకుండా సొంతంగా జ్యోతిష్య పుస్తకాలు చదివి ముహూర్తాలు చూసుకోవచ్చు కదా. కానీ ఆ పని ఎవరూ చెయ్యరు. జ్యోతిష్యుల దగ్గరకే వెళ్తారు, జ్యోతిష్యులు చెప్పినది తప్పైతే తప్పు వ్యక్తులదే కానీ నమ్మకానిది కాదంటారు.
ReplyDelete"మతం మంచిది, కానీ మత గురువులు మాత్రమే మోసగాళ్ళు" అని అంటే fundamental truthని అంగీకరించలేని విధంగా మన నిజాయితీ లోపించినట్టే. అందుకే అలాంటి వాదనలు చేసేవాళ్ళతో నేను చర్చించను. వాళ్ళ వాదనలలోని లొసుగులు బయట పెట్టడానికి కొన్ని సార్లు మాట్లాడుతుంటాను.
ReplyDeleteచర్చకు రావటం లేదు అంటూనే చర్చాంశంతో సంబందం లెని విషయాన్ని ఎందుకు ప్రస్తావితున్నారోఅర్థం కావటం లేదు. మల్లి చెపుతున్నాను. ఈ చర్చ జ్యోతీశ్యం శాస్త్రామా? మూడనమ్మకమా? అన్న దాని మీదే. మతాలు, మత గురువుల మీద కాదు. అయినా ఒక్క విషయంతో మీకు చెప్పదల్చుకున్నాను. అన్ని మతాల వలే హిందూ అనేది ఒక మతం కాదు అది జీవన విదానం దీనిని మన సుప్రీమే కొర్టు వారే తేల్చారు.
ReplyDeleteUnlike other religions in the world,the Hindu religion does not claim any one prophet it does not worship any one god; it does not believe in any one philosophic concept; it does not follow any one act of religious rites or performances; in fact, it does not satisfy the traditional features of a religion or creed.IT IS A WAY OF LIFE AND NOTHING MORE..
SUPREME COURT OF INDIA
కాబట్టి మీరు ఏమాన్న చర్చించ దలిస్తే విషయానికి పరిమితం కండి.
శాస్త్రం బూటకమైనప్పుడు ఆ శాస్త్రం పేరుతో వ్యాపారం చేసేవాళ్ళ వ్యాపారం కూడా బూటకంగానే ఉంటుంది. అంతే కానీ జ్యోతిష్యుల వల్ల జ్యోతిష్యం కొత్తగా బూటకంగా మారినది ఏమీ లేదు. "మంచి ముహూర్తంలో పుట్టినవాడు ఆఫీసర్ అవుతాడు - దుర్ముహూర్తంలో పుట్టినవాడు దొంగ అవుతాడు" అని ప్రముఖ జ్యోతిష్యుడు పుస్తకంలో వ్రాసినా, చెట్టు కింద జ్యోతిష్యుడు చెప్పినా తన కొడుకు దుర్ముహూర్తంలో పుట్టాడు కనుక నిజంగా దొంగ అవుతాడని నమ్మేసి తన కొడుక్కి చదువు ఎవరూ మానిపించరు. ఈ విషయాలు చెపితే వ్యక్తిగత బలహీనతల గురించి చర్చ అనవసరం అని మీరే అంటారు. అందుకే నేను చర్చించను అని చెప్పాను. జయగోపాల్ అనే మా గురువు గారు ఇక్కడ వైజాగ్‌లోనే ఉంటున్నారు. ఆయన జ్యోతిష్యులకి ఒక చాలెంజ్ వేశారు, జాతకాలు నిజమని నిరూపించగలిగితే ఐదు లక్షలు ఇస్తామని. ఆయనకి గుర్తు చేద్దామని అనుకుంటే ఆయన ఈ-మెయిల్ అడ్రెస్ గుర్తు రాలేదు.
ReplyDeleteజ్యొతీషం తో జీవించే వారిని అది అంటే పడని మీరే కాదు అలనాడు మనువే తీవ్రంగా నిరసించాడు. జ్యొతిష్యం అసలు శాస్త్రమా? మూడ నమ్మకమా? అనే దానిని పరిశిలించడమే మేము చేస్తున్న ఏ చిన్ని ప్రయత్నం. మీరు గాని ఎవరు గాని వీటి మీద పరిశోదించి ఉన్నట్టైతే మీ అనుభవాలు మాతో పంచుకోవచ్చు.ఈ దెశంలో వ్యపారమనేదే నీతిలేకుండా పొయింది. ఇక జ్యొతీష్యాన్నే వ్యాపారం చేసిన వాడు ఎలా నీతిపరుదవుతాడు. జ్యొతీష్యం బూతకమని తెలిపే మీ స్వీయ అనుభవాలు ఎమన్న ఉంటె చెపితే ఆలోచించవచ్చు. ఎవరో ఏదో చేసారని మీరూగిపొయీ, మీరేదో అన్నారని మేమూగి పోతే ఒరిగేది యెమి లేదు మీ స్వీయ లెక వేరే అదార సహితంగా బూటకమని నిరూపిస్తే బాగుంటుంది.
Deleteఇలాంటి చోట్ల వ్యాఖ్యలు వ్రాయడం ఎందుకు అని నా బ్లాగ్‌లోనే పోస్ట్ వ్రాసాను: http://hegelian.mlmedia.net.in/2012/10/blog-post_6506.html
Deleteకాకి పిల్ల కాకికి ముద్దు. ఎవరి వాదం వాళ్లదే కదా. మా ఇల్లు మీ ఇంటికి ఎంత దూరమో మీ ఇల్లు మాకంతే దూరం. ఇప్పట్టి వరకు మీ బావాలు పంచుకున్నందుకు దన్య వాదాలు.
Deleteఇది వాదానికి సంబంధించిన ప్రశ్న కాదు. సత్యానికి సంబంధించిన ప్రశ్న. తాము వ్యక్తిగతంగా నమ్మని విషయాలని ఇతరులు నమ్మాలని కోరుకోవడమే జాతకాలని నమ్మేవాళ్ళతో ఉన్న ప్రధాన సమస్య. అంతే కానీ వాళ్ళు గ్రహశాంతి పూజలు చేస్తారా లేదా అనేది సమస్య కాదు. ప్రతి విషయానికీ ఆధారం అడిగితే తల్లి శీలానికి కూడా ఆధారం అడగాల్సి వస్తుందని మీరు వ్రాసినప్పుడే మీ నిజాయితీ ఏమిటో అర్థమైపోయింది. నేను అలా వ్రాయలేదు అని సమాధానం ఎలాగూ చెపుతారు కానీ అది చెప్పే ముందు మళ్ళీ మీ వ్యాఖ్యని చెక్ చేసుకోండి. మీరు వ్రాసిన ఆ వ్యాఖ్యని ఆడవాళ్ళెవరైనా సమర్థిస్తారని నేను అనుకోను.
Delete"మీరు చెపుతున్న దాని బట్టి ఏదైనా శాస్త్రీయంగా రుజువు కానిదే నమ్మం అంటారు. మేము మొదతనుంచి మొత్తుకుంటున్నది అదే గదా! జ్యొతీష్యాన్ని పరిశోదించాలంటే అది బూటకం దానిని పరిశోదించేది ఏమిటీ అంటారు. ఏదఈనా ఒక విషయంలో ఇతరుల అనుభవాలు ప్రవేశ పెడితే అది శాస్త్రీయంగ పరీక్షలకు గురి కాలేదు అంటారు. మీకు ప్రతిదీ శాస్త్రీయ పరంగా రుజువు కావాలంటే ఈ సమాజంలో ప్రతి తండ్రి డి.ఏన్.ఏ పరిక్షకు గురి కావాల్శి వస్తుంది. ప్రతి తల్లి శీలం సైస్స్ పరీక్షలకు నిలవాల్శి ఉంటుంది. దీనిని అడ్డగోలు వాదం లేదా పిడి వాదం అంటారు. అమ్మ పెట్టా పెట్టదు, అదుక్కు తిననివ్వదు అని అటు పరీషోదనలు వద్దంటా? ఇటు నమ్మరంటా? వారేవా !మీరు దేనికైనా ఒప్పుకోవాలి. పరీశోదించి నిగ్గు తేల్చడమా? లేక ప్రజల నమ్మకాల్ని ఒప్పుకోవడమా? "
Deleteవాదాన్నీ వాదంతో ఎదురుకోవడం చేతకాని వాల్లు చేసే మొదటి పని ఇతరులను రెచ్చగొట్టి పబ్బం గదుపుకోవడం. పై దానిలో కేవలమ్ స్త్రీలను గురించే ఉందా? సర్రిగ్గా చదవండి.ఒక పురుషుడు పిత్రుత్వం పరీక్ష చేయవలసి వస్తే అంతిమంగా అది స్త్రీలను శంకీంచడమే అవుతుందని బావన. వ్యాక్యలను విడదీసి చూడడమ్ కాడు మొత్తంగా చూడాలి. అయినా మొదత్నుంచి మీ తీరు నా కవసరం లేదంటు వచ్చి ఇతరుల మీద నెపాలు వేయడం విజ్గ్నానవంతుల లక్షణం కాదు.
చేతకానితనం ఎవరిది? మీరైనా ఆధారం చూపించారా అంటే అదీ లేదు. ఒకడు జాతకాలని నమ్మకపోతే అతనికేమీ నష్టం రాదు. అతను తన తల్లిని అనుమానిస్తే అతని తల్లి అతన్ని పట్టుకుని కొడుతుంది, తల్లి మీద విశ్వాసం లేని కుక్క పుట్టినందుకు. ఒకడు జాతకాలని అనుమానించినంతమాత్రాన తన తల్లిని కూడా అనుమానించాలనడం crude joke తప్ప ఇంకొకటి కాదు.
DeleteAre beliefs inherited?
DeleteResearch shows some attitudes are rooted in genetics, though environment is still key.
By TORI DeANGELIS
April 2004, Vol 35, No. 4
In a 1998 study reported in Personality and Individual Differences (Vol. 24, No. 1), Tesser and colleagues even demonstrated that people react physiologically if they are primed to change highly heritable attitudes--indeed, their heart rates increase and they show higher skin conductance.
As a whole, Tesser's studies suggest that highly heritable attitudes may drive such high-stakes decisions as who to marry, how to earn a living and where to live. "You want to be around people who agree with you," Tesser says, "and even in very abstract terms, the probability of returning to places that agree with you are higher for more highly heritable attitudes."
Tori DeAngelis is a writer in Syracuse, N.Y.
ఇది నేను చూపించిన ఆదారం. దీని రిఫరెన్స్ అడ్డ్రెస్స్ అందులో ఉంది. దానిని నమ్మం అనీ దేవుడు అన్నారు.అసలు మేఏతో నాకు ఈ విషయం మీద చర్చ జరగలేదు. దేవుడు గారికి నాకు మద్య జరిగింది. మొదట్నుంచి మీది అనుమానస్పద వైకరిగానే ఉంది ఇశ్టం వచ్చిన్నట్ట్లు కామెంట్ చెయ్యాడాలు, అయినా నాకేందుంకు అనడం, కాసేపు వేరేవరి పేర్లో చెప్పి వాళ్ళతో మీటింగ్ కి రడియా అనడమ్. ఏమిటిదంతా? పద్దతిగా నడిస్తేనే ఏదైనా. సంభాషణలను వక్రికరించి ఏదో మేదావినని ఊహించుకుంతే పొరపాటు. నీ ఫ్హోటో చూసి ఏదోలే చిన్నవాడివి.నీ వాదనలు గెలిపించుకోవాడానికి తపత్ర్యపదుతున్నావు అనుకుంటున్నాను. నీకు ఇస్టం అయింది ఏదైనా ఉంటే నీ బ్లాగులొ పేట్టుకో. అంతే కాని నీకు సంబందం లేని దాని గురించి అరాటపడక. నీవు చేసే ప్రతిదీ రికార్డ్ అని గుర్తుంకోవటం మంచిది.
ఆ చర్చ నేను చదివాను. జ్యోతిష్యం నిజం అని చెప్పడానికి అది ఆధారం కాదు. కనుక సంబంధం లేని వ్యాఖ్యలు వ్రాస్తున్నది ఎవరో అర్థమైపోతుంది. నేనేమీ చిన్నవాణ్ణి కాదు. అది పదేళ్ళ క్రితం తీసిన ఫొటో. మా అమ్మానాన్నలు ఇద్దరూ హిందూ విశ్వాసులు, నేను నాస్తికుణ్ణి. నమ్మకాలన్నీ సంక్రమితమైనవైతే నాకు నా తల్లితండ్రుల నుంచి నమ్మకాలు కలిగించే జన్యువులు ఎందుకు సంక్రమించలేదు?
Deleteమీకు జాతకాల మీద నమ్మకం ఉంటే నమ్మండి. కానీ జాతకాలని నమ్మకపోతే తల్లితండ్రులని కూడా నమ్మాల్సిన అవసరం కనిపించదు అని అర్థం వచ్చేటట్టు వ్రాస్తే జుగుప్స కలుగుతుంది. నమ్మకాలు లేకపోయినా మనిషి బతకగలడు. కానీ కుటుంబ సభ్యులతో నెగటివ్‌గా మాట్లాడి గొడవలు పెట్టుకోవాలని ఎవడూ అనుకోడు.
Deleteఎక్కడైనా పైన చెప్పిన రిఫరెన్సులో జ్యోతీష్యం అనే మాట వచ్చిందా? నమ్మకం అనేది వారసత్వ పరంగా వస్తాఈ అని చెఫ్ఫడమే దాని సారాంశం. దానిని మేము నంంఅం అనేది దేవుడు మాట. ప్రటీ దాని సైణ్స్ పరంగా రుజువు ఐయితే తప్ప నమ్మను అంటే మనిషి జన్మమే నమ్మకంతో మొదలవుతుంది అని ఉదాహరణ ఇచ్చాము. లేకుంతే మెము జ్యొతీష్యాన్ని నమ్మమని మీకెక్కడైనా చెప్పామా?అది శాస్త్రమా ? కాదా అనేది పరిషోదించి అయినా నిగ్గు తేల్చాలని ఆ విదంగా ప్రజలను మార్చవచ్చని మేమంటుటే, మేఏరే పరీశోదించాల్సిన పని లేదని, అటువంటిది బూటకం అని మీ ఇశ్తం వచ్చినట్టు మాత్లాడుతు ఒకదాని కొకటి పొంతన లేని వ్యాక్యానాలు చేస్తు చివరకు మీ పెర్సనల్ విషయానికి కూడ ఇలా ఎందుకు జరగలేదు ? అని మమ్మల్ని అదిగితే మెమేమి చెపుతాము. మేము లేచిన వేళ మంచిది కాదు అనుకుంటాము.మాకోకటే నమ్మకం కొన్ని జాతకాలు అంతే.మీకు నమ్మకం లేదూ ,లెడూ అంటూనే నాస్తికుడిని అనేశారు అంటే దేవుడు అనే వాడు లేడనేగా మీ నమ్మకం. కాబట్టి మీరు కూడ ఎడొ ఒక నమ్మకం(దేవుడు లేడనే నమ్మకం} తో జీవిస్తూ మా నమ్మకాలని ఎందుకు గాయపరుస్తావు. ఒక పక్క ఒక విషయంలోనెమో సైంటిఫిక్గా పరీశొదిస్తేనే నమ్ముతానంతారు వేరొక విషయమ్లో నేమో పరిషోదన అక్కర్లేదు బూటకం అంటావు. ఇతువంటి దానినె అద్దగోలు వాదం అంటారు. ఏదొ ఒక దానికి కట్టుబడితే దానిని సరి చూడవచ్చు. ఇంతకు మించి మీలాంటి వారితో మాత్లాడడం అనవసరంఅని మా అభిప్రాయం.
Delete"Tesser and colleagues even demonstrated that people react physiologically if they are primed to change highly heritable attitudes--indeed, their heart rates increase and they show higher skin conductance."
Delete" తల్లితండ్రులని కూడా నమ్మాల్సిన అవసరం కనిపించదు అని అర్థం వచ్చేటట్టు వ్రాస్తే జుగుప్స కలుగుతుంది. నమ్మకాలు లేకపోయినా మనిషి బతకగలడు. కానీ కుటుంబ సభ్యులతో నెగటివ్‌గా మాట్లాడి గొడవలు పెట్టుకోవాలని ఎవడూ అనుకోడు."
మనిషికి నమ్మకమే ముఖ్యం అని మీరు కూడ ఒప్పుకున్నటె. మనవు గారు ఇచ్చిన రెఫరెన్స్ అదేమిటంటే ఎవరైనా తమ గట్టి నమ్మకాలు{జీన్స్ ద్వార వచ్చినవి)కు వ్యతిరేఖంగా ఇతర బావనలును ప్రవేశపెడితే అది శారీరకంగా కూడ ప్రభావం చూపుతుంది అనెదానిని మీరే ( జుగుప్స కలుగుతుంది) రుజువు చేసారు.తల్లి తండ్రుల మీద నమ్మకం జీన్స్ ద్వార వచ్చే నమ్మకం అనడానికి ఈ ఉదాహరణ చాలు.
హ..హ..హ..ఏమిటి ప్రవీన్ గారు జ్యోతీష్యం నిజమని నిరూపిస్తే 5 లక్షలేనా?. ఈ ప్రపంచంలో ఎవరూ చెయ్యడానికి సాహసించని పనికి ఆఫ్ట్రాల్ 5 లక్షలేనా?. ఇంకో మాట చెప్పమనండి మీ గురువు గారిని. ఒక పందెంకి నేను రెడి. ఎవరఈనా సరే 5 కోట్లు రూపాయలు ఇస్తే జ్యోతీష్యం నిజమని నిరూపిస్తా! లేదంటే నా బ్లాగు మూసేస్తా! ఇది సీరియస్ గా చెపుతున్న మాట.
Deleteమీరు చర్చిస్తానంటే మీతో మీటింగ్ పెట్టడానికి జయగోపాల్ గారు ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు. ఫలానా స్థాయి వారితో నేను చర్చించను అనే రకం కాదు ఆయన.
ReplyDeleteఇది చర్చ యే నాయన! దీని కోసం అవసరమైనప్పుడు అన్ని చేయొచ్చు. ప్రస్తుతం బ్లాగు వ్యాఖ్యానాలు ద్వారానే మీ వాదం తెలుపండి.
Deleteకర్మ సిద్దాంతానికి, జ్యోతిష్యానికి కుదురుతుందంటారా ?
ReplyDeleteమన కర్మ ఎలా రాసిపెట్టుంటే అలా జరుగుతుందని కర్మ సిద్ధాంతం చెప్తుంది.
జ్యోతిష్యం మాత్రం, మనం భవిష్యత్తు చెప్పి, అందులో ఎమన్నా బాధలు ఉంటె వాటికి ముందే నివారణోపాయాలు చెప్తానంటుంది.
ఇది ఎలా సాధ్యమో మీరేమైనా చెప్పగలరా ?
కుదరడానికి అవకాశం ఉండి. ఎలాగంటారా? మన కర్మలో జ్యోతీష్యం ద్వారా భవిషత్తు తెలిసికొనటమే కాక, తద్వారా భవిషత్తు భాదలకు నివారణోపాయాలు పోందుతామని రాసీ ఉంటే అలాగే జరుగాలి కాబట్టి, ఇది సాద్యపడవచ్చు.ఏమంటారు? మా బ్లాగును దర్శించినందుకు దన్య వాదాలు కాశి గారు.
ReplyDeleteThis comment has been removed by the author.
Deleteకాదేదీ కవిత్వానికి అనర్హం శ్రీ, శ్రీ అన్నట్టు. కాదేదీ శాస్త్రానికి అనర్హం. నేను అనేక శాస్త్రాలు అభ్యసించాను. మీరు యవరినైనా చంపాలనుకుంటున్నారా రండి నాదగ్గిర చేతబడి అనే శాస్త్రం వుంది. ఒంట్లొ ఏవయవాన్ని కావాలంటె ఆ అవయవాన్ని తీచేయవచ్చు. మీరు వెంటనే కొటీస్వరులు కావాలా నాదగ్గర వుంగరాలు వున్నాయి.అంబానికి ఇచ్చాను వాళ్ళ కొడుకులకు ఇచ్చాను. భారతదేశంలొనే అత్యంత ధనవంటులయ్యారు.వాళ్ళు ధనవుంతులైంది శ్రమదొపిడీ వల్ల అయ్యరని మార్క్స్ అంటాడు మీరు అటు పొరపాట్న కుడా కన్నేత్తి చుడవద్దు.తర్వాత నాలాంటి శాస్త్రగాలంతా ఏమైపొవాలి? మీకు ఆర్దిక ఇబ్బందులూ, జబ్బులూ ,ఎమైన వచ్చాయా నా దగ్గర జ్యొతిష్య శాస్త్రం వుంది. మీ ఇంటిని వెయ్యి ముక్కలు చేసైనా మీ ఆర్దిక ఇబ్బందులు తొలగిస్తాను . సొంత ఆస్తిగల సమాజంలొ నిర్దిష్టమైన ఆయా సమాజాల ఉత్పాదక పంపినీలబట్టి, అవి మారుతూ వుంటాయని చేపలకొసం నీళ్ళలొనూ, సమస్యలు సమజ స్వబావాన్ని బట్టి వుంటాయనీ ఆ సమస్యల పరిస్కారం కొసం సమాజంలొ వెతకాలి గాని శున్యంలొ వెతికితే ఉపయొగం వుండదని కొంతమంది అంటారు వాటిని ఎమాత్రం పట్టించుకొవద్దు. మరి నా బతుకుతీరువు ఎమవ్వాలి? అలాగే నే ఈమద్య నరకం శాస్త్రం, స్వర్గం శాస్త్రం కనిపెట్టేను మీకు ఎదికావాలన్నా ఐదు నిమిషాలలొ మీకు ఎర్పాటు చెయ్యగలను. దేవుడిని అందరూ చుడ్డం సాద్యం కాడంటారు మీరు దాన్ని నమ్మవద్దు. నా దగ్గర అన్ని మతాల దేవుళ్ళూ వున్నారు మీరు ఎ దేవుణ్ణినైనా చుసే సౌలబ్యం వుంది. బక్తులారా త్వరపరండి. ఆలస్యం చేశారా ఆశాభంగం తప్పదు. ఎందుకంటె వాళ్ళు నా దగ్గర నిర్నీతమైన సమయంలొ మాత్రమే వుంటారు.
ReplyDeleteఏటి చెయ్యమంతావు సామీ! నీవు చెప్పె వాల్ల కన్నా నీవే నయం సామి. డబ్బుల్లు కొద్దే తీస్కున్న ఏదో ఒక మాయానందం అయినా కల్పిస్తావు . నీవూ చేప్పే వోల్లున్నారు చూసావు. ఏమి లాబమ్లేదు సామి. వాళ్లేదో చేతరని నిన్ను వదలి ఆల కాడిఖి పోఇనమా ! ఏటి ఒరిగినది మాకు! అహ ఏటి ఒరిగినాదని! చెప్పు
Deleteఏదో సుత్తి కొడవలి చూపిస్తే ఈళ్లు మనోళెగద్దని ఎల్లినం. మొదట్లో కొడవల్ బాగానే పని చేస్తుంతే చూసి తెగ సంబరపడ్డం.ఇక జమాన మనదే గదా అనుకున్నం. కాని ఆల్లల్లో ఆలకే గొడవొలొచ్చినై. 100 గ్రూపులైతిరి. కొడవలి మొద్దుబారిపాయే. ఇక మిగిలింది సుత్తేనాయె. ఇక చూడు ఏడ చూసిన సుత్తే.ఎవడు చెప్పిన్నా సుత్తె. సుత్తి.. సుత్తి..సుత్తి... .మునుపుటోడే నయం సోలతొనన్నా ఇచ్చిండు. ఈల్లైతే మానిక తో నైతే కొలిచిన్రు గాని తిరగేసి కొలిచిన్రు. ఇక మా గోదు ఎవరితో చెపుకోవాల్నొ తెలియక నీ కానికే తిరిగొచ్చినం. దీర్గాకాలిక విప్లవమ్ దీర్గాకాలిక విప్లవమ్ అని దీర్గ నిద్రలొకి పోఇన్రు. బావదో గ్రూపు, బామ్మర్దిదో గ్రూపు.అందరూ ఆల్లే దనవంతులైరి.
ఈ మద్య హైదరాబాదులో ఎదో పెట్టరంటగా ఆమ్తరించిపోతున్న జీవ జాల పరిరక్షణ అని. దానికి తోడు ఇంకోటి కూడ చేర్చమని చెప్పు, అదే అంతరించి పోతున్న భావజాల పరిరక్షణ. దానిలో బాగంగా అక్కడాఖ్ఖడ మిగిలిన నిజమఈన సుత్తి కొడవల్లను రక్షిస్తే ఝ్నాపకాలైనా మిగుల్తఈ.
ఈట్టన్నిటి గూర్చి నేవేమి పట్టిచుకోకు చిన్నోడా! వాల్లు అలాగే అంటరు. మెమేప్పుడు నీతోనె .