'మనుస్మృతి ఇరాని ' అంటూ తనను హేళన చేస్తున్న వారి నోళ్ళు మూయించిన "స్మ్రుతి ఇరాని " గారు!!!
కాళికా దేవి ని పచ్చి వ్యభిచారిణిగా , మహిషాసురుడిని గొప్ప వీరుడిగా చిత్రీకరించడమే కాక "మహిషాసుర అమరదినం" గా విజయదశమిని జరుపుకోవాలన్న రాక్షస సిద్ద్దాంత కర్తల ముఖం మీద చెప్పు తీసుకు కొట్టినట్లు, "మనువులూ నోరు ముయ్యండి " అనే తెగిడిచిన రాతలతో తమ "హాస్య పత్రికలలో " ఆర్టికిల్ రాస్తూ , తనను 'మను స్మ్రుతి ఇరాని ' అని అవహేళన చేయడమే కాక ,దేశ ద్రోహ కార్యకలాపాలు చేసే వారిని హీరో లు అని కీర్తించిన , కుహానా ఎర్ర మేదావులను నోరెత్తకుండా చేసినట్లు ఉంది , నిన్న పార్లమెంట్ లో మహిళా మంత్రి "స్మ్రుతి ఇరాని " గారు జవాబు తీరు. నిజంగా కలకత్తా కాళికయే ఆమెను పూనిందా అన్నంత ఆవేశంగా , ఎంతో ఉత్తేజిత పూరితంగా ఉంది ఆమె సమాదాన ప్రసంగం. ఆమె మాట్లాడిన గంట సేపు ప్రసంగం క్రింది విడియోలో ఉంది దానిని క్లిక్ చేసి చూడ వచ్చు. సదరు ప్రసంగం లోని కొన్ని హైలైట్స్ ను క్రింద ఇవ్వడమైనది.
(1). దేశం లో ఉన్న కేంద్రియ విశ్వవిద్యాలయాలలో ఉన్న పాలకామండళ్ళు అన్నీ గత U.P.A ప్రబుత్వం లో నియమించబడినవే తప్పా , ఒక్కటి అంటే ఒక్కటి కూదా మా ప్రభుత్వం హయాం లో నియమింపబడలేదు.
(2). హైదరాబాద్ యునివర్సిటి లో ఆత్మహత్య చేసుకున్న వేముల రోహిత్ వద్దకు 12 గంటల పాటు రాష్ట్ర పోలీసులను రానీయకుండా చేయడం వలన అతనికి సకాలం లో వైద్యం అందలేదు.
(3). ఒక విద్యార్ది చావును రాజకీయాలకు వాడుకునే నీతిమాలిన రాజకీయాలకు పాల్పడుతున్నారు ప్రతిపక్ష నాయకులు.
(4) . రాహుల్ గాందీ తన జీవితకాలంలో ఒకే విషయం గురించి రెండు సార్లు హాజరు అయిన సంఘటణ ఏదైనా ఉందంటే అది రోహిత్ శవ రాజకీయ సంఘటనే .
(5). యునివర్సిటి లో బావప్రకటణ స్వేచ్చ కావాలని కోరే వారు చేస్తున్న పనులు ఏమిటి? దేశం అంతా మహిషాసురుడు ని రాక్షసుడుగా , కాళికా దేవిని అది శక్తి గా బావించి విదయడశమి వేడుకలను జరుపుకుంటుంటే , విశ్వవిద్యాలయాలో మహిషాసుర అమర దినంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ , కాళికా మాతను వేశ్య గాను , మహిషాసురుదును వీరుడైన రాజుగాను ప్రకటించడమే బావప్రకటణ స్వేచ్చకు అర్ధమా?
ఇదే విషయాన్ని కలకత్తా వీదుల్లో ప్రజల సమక్షమున తేల్చుకోవడానికి అటు తృణముల్ కాంగ్రెస్ కాని , ఇటు సోనియా కాంగ్రెస్ వారు కాని సిద్దమా? ఆ దమ్ము మీకు ఉందా?
(6). డిల్లీ నెహ్రు విశ్వవిద్యాలయం లో కన్నయా కుమార్ తో సహా 6 గురు విద్యార్దులు దేశ ద్రోహ కార్యక్రమాలకు పాల్పడారని తగిన ఆధారాలు విద్యాలయ అధికారులకు లభించబట్టె , వారి మీద కేసులు పెట్టారు తప్పా అన్యదా కాదు.
(7) గత ప్రభుత్వాలు తయారు చేసిన పాట్యాంశాలలో 4వ తరగతి , 6 వ తరగతి పిల్లలకు, దేశ సమగ్రతకు బంగం కలిగించే విష బీజాలు ఉన్నాయి. అటువంటి పాటాలు నేర్చుకున్న వారు దేశ ద్రోహులుగా కాక , దేశ భక్తులుగా ఎలా తయారీ అవుతారు?
(8). హైదరాబాద్ విశ్వవిద్యాలయం లో జరుగుతున్నా అరాచకాలు గురించి కాంగ్రెస్ పార్టి నాయకుడు అయిన V . హనుమంత రావు గారే అనేక మార్లు రాతపూర్వక వినతి పత్రాలు ఇచ్చారు. నేను కేవలం భండారు దత్తాత్రేయ గారి లేఖా నుసారమ్ ఉపకులపతికి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకొమ్మని ఆదేసించినట్లు ఆరోపించడం అవాస్తవం. అది నిరూపిస్తే నేను రాజీనామాకి సిద్దమ్. అయినా సంబందిత మంత్రికి పిర్యాదు వచ్చినప్పుడు తగిన చర్యలు తీసుకొమ్మని సంబందిత అధికారులను అదేసించడమ్ తప్పు ఎలా అవుతుంది? అది చట్టబద్దమే.
(9). ఏది ఏమైనా విచారణ ను సవ్యంగా జరుగనివ్వండి. పోలీసులను వారి పని వారిని చేయనివ్వండి. ప్రతి దానిని రాజకీయ దృష్టితో లబ్ది కోసం చూడకండి. ఇది దెశ ప్రయోజనాలకు భంగకరం.
పై విదంగా సమాదానం ఇస్తుంటే ప్రతిపక్ష నాయకులు విషయాలను ఖందించలేదు. ఆమెనెప్పుడు హేళనగా మాట్లాడే వారు మాత్రం ఆమే నోటి నుండి వస్తున్నా మాటల తూటాలకు , ఆమే కళ్ళలో , ముఖం లో కనిపించే ఉద్వేగ బావాలకు ఏమనాలో తెలియని అయోమయ పరిస్తితుల్లో ఉండి , చివరకు తేరుకుని వాకౌట్ చేసారు. సదరు వాకౌట్ ను కూడా స్మ్రుతి ఇరాని గారు ఎద్దేవా చేసి సబ్యుల మనసులను చూరగొన్నారు. స్మ్రుతి ఇరాని లాంటి మహిళలు మన దెశం లో ఉన్నంత కాలం , మన సంస్కృతిని నాశనం చేయాలని చూస్తున రాక్షసుల గురించి బీతిల్ల వలసిన పని లేదు. వారే కాళిక లై విజ్రుంభించిన వేళ సదరు రాక్షస మూక తోకలు ముడవక తప్పదు.
ఇక వీడియో ని చూడండి .
Comments
Post a Comment