"పంది కడుపున ఏనుగు పుట్టును " అన్న బ్రహ్మం గారి కాలజ్ఞాన వాక్యం నిజమయిందా !!!?
బవిష్యత్ లో జరుగబోయే దానిని ముందుగానే దర్శించిన మహానీయుల్లో తెలుగు గడ్డ మీద జన్మించిన శ్రీ వీరబ్రహ్మేంద్రుల వారు ఒకరు . 16 వ శతాబ్దానికి చెందిన ఈయన రచించిన "కాలజ్ఞానం "లోని అనేక బవిష్యాలు నిజమయ్యాయి అని అనేక మంది నమ్ముతున్నారు . తాను కలి యుగాంతం నకు వీరబోగ వసంత రాయలు నై వస్తాను అని ,అప్పుడు జరగబోయే కొన్ని వింతలు వీరబోగ వసంత రాయలు రాకకు గుర్తుగా ఉంటాయని కూడా "కాలజ్ఞానం '" లో చెప్పడం జరిగింది . అలాంటి వింతల్లో 'పంది కడుపున ఏనుగు పుట్టును ' అనేది కూడా ఒకటి . అ వాక్యం వేరే రూపంలో నిజమయిందా అని అనిపిస్తుంది "నార్వే'" దేశం లో జరిగిన ఈ వింత జననం చూస్తుంటే . నార్వే దేశం లో ని అండర్సన్ ,అలెగ్జాండర్ అనే దంపతులకు ఒక పిల్లవాడు కలిగాడు . అయితే అ పసివాడు ఏనుగు పిల్ల మాదిరి వింత ఆకారం తో జన