కోటి రూపాయలు ఖర్చు చేసినా, విజ్ణానం, కొవ్వుని తగ్గించవచ్చు గాక !అహంకారాన్ని మాత్రం కాదు!
మనిషి ఆనందంగా ఉండటానికి బౌతిక విజ్ణానం కాదు, ఆత్మ జ్ణానం లేక ఆద్యాత్మిక విజ్ఞానం కావాలి. అది పొందనంత కాలం మనిషి ఆనందం కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.ఆద్యాత్మిక జ్ణానం మనిషిలో ఉన్న అహంకారాన్ని మాయం చేసి,పంచ బూతములు తనయందును, తనను పంచ బూతముల యందును చూసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే మనిషి తానే స్రుష్టికి ప్రతిరూపమని బావిస్తాడో,అప్పుడు అతనిని బాద పెట్టే అంశాలేమి ఉండవు. నిర్మాలానందంని పొందుతుంటాడు. డబ్బు, దస్కం హోదా , కిర్తీ, ప్రతిష్టలు ఇవ్వన్నీ బౌతిక ఆనాందాలు ఇచ్చేవి అయినా,అట్టి బౌతిక అనందాలు మనిషిని సంత్రుప్తి పరచక, మరిన్ని సుఖాల కోసం ఆరాటపడేలా చేస్తాయి. కాబట్టి అది అసంత్రుప్త ద్రావణం లాంటిది. మనిషి సాదించిన విజ్ణానం అతనికి బౌతిక ఆనందాలను ఇస్తుండవచ్చు. కాని మనిషి కాని, సమాజం కాని ప్రశాంతం గా ఒక నియమబద్దమైనా రీతిలొ కొనసాగాలంటే,ఆద్యాత్మిక జ్ణానం అవసరం. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించదానికి ప్రయత్నిస్తాను. బాగా తినడం అలవాటు ఉన్న వ్యక్తికి, కొవ