కోటి రూపాయలు ఖర్చు చేసినా, విజ్ణానం, కొవ్వుని తగ్గించవచ్చు గాక !అహంకారాన్ని మాత్రం కాదు!


                                                                                                                              

      మనిషి ఆనందంగా ఉండటానికి  బౌతిక విజ్ణానం కాదు, ఆత్మ జ్ణానం లేక ఆద్యాత్మిక విజ్ఞానం కావాలి. అది పొందనంత కాలం మనిషి ఆనందం కోసం వెంపర్లాడుతూనే ఉంటాడు.ఆద్యాత్మిక జ్ణానం మనిషిలో ఉన్న అహంకారాన్ని మాయం చేసి,పంచ బూతములు తనయందును, తనను పంచ బూతముల యందును చూసుకునేలా చేస్తుంది. ఎప్పుడైతే మనిషి తానే స్రుష్టికి ప్రతిరూపమని బావిస్తాడో,అప్పుడు అతనిని బాద పెట్టే అంశాలేమి ఉండవు. నిర్మాలానందంని పొందుతుంటాడు. డబ్బు, దస్కం హోదా , కిర్తీ, ప్రతిష్టలు ఇవ్వన్నీ బౌతిక  ఆనాందాలు ఇచ్చేవి అయినా,అట్టి బౌతిక అనందాలు మనిషిని సంత్రుప్తి పరచక, మరిన్ని సుఖాల కోసం ఆరాటపడేలా చేస్తాయి. కాబట్టి అది అసంత్రుప్త ద్రావణం లాంటిది.
     మనిషి సాదించిన విజ్ణానం  అతనికి బౌతిక  ఆనందాలను ఇస్తుండవచ్చు. కాని మనిషి కాని, సమాజం కాని ప్రశాంతం గా ఒక నియమబద్దమైనా రీతిలొ కొనసాగాలంటే,ఆద్యాత్మిక జ్ణానం అవసరం. దీనిని ఒక ఉదాహరణ ద్వారా వివరించదానికి ప్రయత్నిస్తాను.

       బాగా తినడం అలవాటు ఉన్న వ్యక్తికి, కొవ్వు బాగా పెరిగి ఊబకాయం తో బాదపడుతున్నాడు అనుకుందాం. అతను ఆనందంగా జీవించదానికి తన ఊబకాయం అవరోదం కనుక దానిని వైద్యుల వద్దకు వెళ్లి తగ్గించుకోవాలని చూస్తాడు. వైద్యులు అతనికి సర్జరీ చేసి, అతనిలోని కొవ్వుని తీసి వేస్తారు అనుకోండి. సదరు ఊబకాయుడికి చెప్ప లేని ఆనందం వేస్తుంది. తనను రక్షించింది విజ్ణాన వాదులైన వైద్యులే అని చెప్పి వారిని, వారిలోని విజ్ణానాని  పొగడుతాడు.కాని తిరిగి కొన్నాళ్ళకు కొవ్వు తిరిగి పెరగడం చూసి,లబోదిబో మని అదే డాక్టర్ల దగ్గరకు వెలితే,కొవ్వు పెరిగినప్పుడల్లా కోయించుకొవద్డమే విజ్ఞానవంతుల లక్షణమని చెపితే,లక్షణం గా  కోయించుకుని వస్తాడు. కాని అదే ఎవరైనా "నాయానా  తిండి తగ్గించుకుంటే,కొవ్వు కంట్రోల్ లొ ఉంటుంది,దానికి తోడు శారిరక, మానసిక వ్యాయామం చేయి" అని చెపితే అతనికి  ఉపాయోగకరంగా ఉండవచ్చు కాని డాక్టర్లకు మాత్రం నష్టం కలిగిస్తుంది. అందు చెత అలా చెప్పే వాళ్ళను అజ్ణానుల్లా ఈసడించె ప్రచార కార్య క్రమాలు మొదలుపెడతారు. ఈ ఉదాహరణలో అదిక తిండికి దూరంగా ఉండటమే అద్యాత్మిక జ్ణానం.అది మాత్రమే అతనిని ఆనందంగా జివించేలా చేస్తుంది. కాని 
 వ్యాపార ద్రుక్ప దం కలిగిన వారికి,తమ అభివ్రుద్దికి సో కాల్డ్  విజ్ణానం ఉపయొగపడుతుండగా అద్యాత్మిక జ్ణానం అడ్డుపడ్తుండ బట్టి వ్యాపార వాదులు విజ్ణాన వాదుల ముసుగులొ అద్యాత్మిక వాదులను, వారి కార్యాక్రమాలను, మూడ నమ్మక్కం అని చెప్పి అడ్డుకుంటున్నారు.

    రోజూ ఇంట్లో పాలిష్డ్ బియ్యం తో వండిన అన్నం తినే విజ్ణాని ,శాస్త్రీయా ఆహారం గురించి లెక్చర్లు దంచుతాడు. తమ పిల్లలు కోకా కోలా లు తాగుతుంటే వద్దని చెప్పలేని వాడు, వాటి లోని విష పదార్దాల గురించి గంటల కొద్దీ ఏకరువు పెడతాడు. ఏమి తెలియని వాడు నాలుగు రకాల కూరలతో విందు బోజనాలు ఏర్పాటు చేస్తే. అన్ని తెలుసు అని విర్రవీగే విజ్ణాని రోస్టులు, ఫ్రై లతో విష బోజనాలు ఏర్పాటు చేస్తున్నాడు. మనిషి జీవితాయుర్దాయం ఒక వారం తగ్గించాలంటే  నేడు ఒక గ్రాండ్ పార్టీకి అటెండ్ అయితే చాలు. ఇవ్వన్నీ మనిషి యొక్క విజ్ణానపు తాలుకు వెర్రి తల్లలో నుంచే పుట్టినవి. కాబట్టి సో కాల్డ్  విజ్ణానం మనిషిని ఆనందంగా ఉంచడానికి కాదు. మరింత అశాంతి పరుడ్ని చెయ్యడానికే ఉపయోగ పడుతుంది. నిజమైన  విజ్ణానంసాగర మదనంలో పుట్టే "అమ్రుతం" లాంటిది. దానికి ముందు పుట్టిందే వ్యాపార ద్రుక్పదం అనె "హలా హలం". ఆ హలా హలాన్ని మ్రింగ గలిగెదే "  త్రీనేత్రుని కంఠం అనే అద్యాత్మిక జ్ణానం. అదే ప్రస్తుతం మనకి కావల్సింది.          

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం