చేప ప్రసాదంలో "మందు విలువలు"మాత్రమే లేవు కాని , విజ్ణానులు దగ్గర అసలు ఆస్మాకి మందే లేదు!
పాపం కొంత మందిని చూస్తే వారికి జ్ణానం ఉండవచ్చు కాని ఇంగిత జ్ణానం మాత్రం ఏ మాత్రం లేదేమో అనిపిస్తుంది. జనవిజ్ణాన వేదిక వారు "చేప ప్రసాదం" మీద అంత లొల్లి చేసి సాదించినది ఏమిటో అర్థం కావటం లేదు. కేవలం పబ్లిసిటి తప్పా!రాజ్యాంగ నియమాలు ప్రకారం ఏ వ్యక్తి అయినా తను నమ్మిన విశ్వాసాలను ఆచరించవచ్చు, ప్రచారం చెసుకొవచ్చు . కాకపోతె ఆ విశ్వాసం మనిషి అరోగ్యానికి కాని, దేశ బద్రతకు కాని బంగం కలిగించకూడదు.
గతంలొ చెప ప్రసాదం మీద కొర్టుల్లో జనవిజ్ణాన వేదిక వారు పిటిషన్ లు వేసినప్పుడు హై కోర్టు వారు స్పష్టంగా చెప్పారు.చెప మందు లేక ప్రసాదం అని చెప్పబడుతున్న దానిలో మనిషికి హాని చెసే పదార్దములు ఏమి లేవు కాబత్టి, దానిని ప్రసాదంగా పంపిణి చెసుకోవచ్చు అని. బత్తిన సోదరులు కూదా అది తమ పూర్వికులకు ఒక సాదువు ఇచ్చిన వరప్రసాదం అని, దానిని సేవించిన వారు ఆస్మా నుండి ఉపశమనం పొందుతున్నారు అని చెపుతున్నారు . కాబట్టి వారు నిరబ్యంతరంగా ప్రసదాన్ని పంపీణి చెయవచ్చు. ఇది వారి మతపరమైన రాజ్యాంగ హక్కు.
ఇక పొతే సదరు బత్తిన సోదరుల పంపిణి కార్యక్రమానికి ప్రబుత్వం వారు సహయ సహకారాలు అందించదం గూర్చి.నిజానికి ప్రజలు తమ తమ మత విస్వాసాలను అచరించడానికి కాని, ప్రచారం చెసుకోవదానికి కాని, సహకరించదం తప్పా? అదే నిజమైతే "చిన్న చిన్న జాతరల నుండి, "స్టేట్ ఫెస్టివల్" గా మారిన "సమ్మక్క, సారక్క జాతర వరకు ప్రబుత్వ యంత్రాంగాలు ఎందుకు పని చేస్తున్నాయి.?అంతె త్వరలో వీటి మీద కూడా పెటిషన్ లు
వెయ్యబోతున్నారా?మరి నిన్ననె దక్షిణ మద్య రైల్వే వారు రెండు ప్రత్యెక రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించారు. ఇది ప్రబుత్వ సహకారం క్రిందకు రాదా?దీని కేమైనా బత్తిన సోదరులు డబ్బులు ఇస్తున్నారా? బత్తిన సోదరుల "చేప ప్రసాద పంపిణి కార్యక్రమం వల్ల, రైల్వేలకు, అర్.టి.సి. వారి కూడా ఆదాయం లక్షల్లో వస్తుంది. ఇది ప్రబుత్వ సంస్తలకు లాబం చేకూర్చే పని కాదా? మరి వాటిలో బత్తిన సోదరులకు ఎంత వాటా ఇస్తారు?కేవలం ఆ మత వాదుల విస్వాశాలను ఏదో రకంగా దెబ్బ తీయాలన్నా దురద కాకపోతే, వారినుండి ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి అద్దె వసూలు చేసినంత మాత్రానా మిరు వారి మత విస్వాసాలను దెబ్బ తియ గలరా?
అసలు ఉబ్బసానికి అల్లోపతిలొ మందే ళెదని విజ్ణానులే ఒప్పుకుంటున్నారు. అటువంతపుడు ఒక నమ్మక్కం మందుగా పనిచెసి మానసికంగా ఉబ్బస రోగికి ఉపశమనంగా పనిచెస్తుందేమొ ఎవరైనా పరిక్షించారా?శాస్త్ర ప్రకారం పుట్టిన వారికి మనసు అనె దాని మీద నమ్మక్కం ఉండదు కాబోలు!.అమ్మ పెట్ట పెట్టదు, అడుక్కు తిననివదు అని,మీ దగ్గర మందు లేదు, ఎవరైనా కొంత నమ్మకం కలిగించి, ఉపసమనం కలిగిస్తుంటె ఒర్చుకొలేరు. ఇదెక్కడి రాక్షస మనస్తత్వం?
cancer మందులు ఉన్నాయి. దానికి ఉపశమనం కలిగించడానికి అల్లొపతిలో వైద్య సాస్త్రీయ ప్రక్రియలు ఉన్నాయి. అయినా సరే కాన్సర్ ని ప్రార్దనల ద్వారా బాగు చేస్తామని ,కొందరు నిరంతర "స్వస్త శాలలు" పెట్టి జనాల్ని రప్పించుకుంటుంతే, వారి మీడ పిటిషన్లు వేసే వెన్నెముక లేని వారు, బత్తిన సోదరుల లాంటి నిస్వార్దుల జోలికి వెల్లడం కెవలం హిందూ బావజాలన్ని అవమానించదమె. దీని మీద హిందువులు నిరసన తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
.
Comments
Post a Comment