మొత్తానికి బ్రిటిష్ వాళ్లు మన కోహినూర్ వజ్రాన్నే కాదు," కెనార్క్" D.N.A కూడా దొంగిలించుకు వెళ్ళారన్న మాట!

                                                        

   నిన్న ఒక వార్త చూశాను. ఆ వార్త చూసి మనవాళ్లు కొంతమంది సంతోషిస్తున్నట్లు ఉంది. ఇంతకి వార్త ఏమిటంటే, ప్రస్తుత బ్రిటిష్ యువరాజు "చార్లెస్ డయానా",ల కుమారుడు విలియమ్స్ లో మన బారతీయ స్త్రీ మూలాలు అంటే D.N.A  ఉందట! కాబట్టి ఆయన మన వాడేనట. అదీ సంబడం!

  ఇంతకి బ్రితిష్ యువరాజులో మన వాళ్ళ  D.N.A    చేరిన విదంబు ఎట్టిదనిన, సదరు యువరాజు గారి అమ్మ,అమ్మ,అమ్మ,అమ్మ,అమ్మ అయిన "ఎలిజా కెనార్క్" గారు సూరత్ లో ఒక ఇంగ్లీష్ జాతీయుడు అయిన వ్యాపారి వద్ద పని మనిషిగా ఉండేదట! వారిద్దరి మద్య ఉన్న ఒప్పందానుసారం కాబోలు ఆవిడ గారు ఆయన గారికి "కేదరిన్" అనే కూతురిని కని ఇస్తే, ఆయన ఇంగ్లాండ్ తిరిగి వేళ్ళేటప్పుడు పనిమనిషిని వదిలేసి తన మనిషి(కేదరిన్) ని తీసుకు వేళ్ళాడట. అదిగో ఆ కేదరిన్ తాలుకు వారసురాలే  విలియమ్స్ తల్లి "డయానా". ఆమే ద్వారా బారతీయ "జీన్"   విలియమ్స్ కి వచ్చిందట!. ఇప్పుడు ఆయన గారి ఇంగ్లాండ్ సింహాసనం అదిష్టించబోయే  చార్లెస్ కుమారుడు మరియు తర్వాతి వరుసలో ఉన్నవాడు కాబట్టి, మన బారతీయ  D.N.A      ఇంగ్లాండ్ సింహాసనం మీద ఉందని ఆనందించవచ్చటా! ఎంతటి అల్పానందం!

  తెల్లవారు మన దేశం ని యదేచ్చగా దోపిడి చేసి, వెళుతూ, వెళుతూ మన నెమలి సింహాసనం, కోహీనూర్ వజ్రం తీసుకు వెల్లరని చెపుతారు. అలాగే యువరాజు విలియమ్స్  గారి ముత్తాత, కోహినూర్ వజ్రం కన్నా విలువైన అత్యంత అరుదైన "మైట్రో కాండ్రియల్"  D.N.A   ని దొంగిలించుకు వెళ్ళాడు. బ్రిటిష్ యువరాజులో ఉన్న ఆ బారతీయ    చాలా అరుదైనదని బ్రిటిష్ శాస్తవేత్తలే తేల్చారు మరి!నిజంగ  విలియమ్స్ముత్తాత ఇండియన్ పనిమనిషి మీద ప్రేమ ఉంటే ఆమెని కూడ తీసుకు వెళ్ల్లాలి కదా.అలా కాకుండా తనకు పుట్టిన కూతురును మాత్రమే తీసుకు వెళ్ళాడు అంటే అది ఖచ్చితంగా "వారసత్వ చౌర్యమే"!

  అయినా మన పిచ్చి కాని, వారి బావజాలాన్ని(విడదీసి పాలించు) మనకెక్కించి, మన వారసత్వాన్ని వారు తీసుకు వెలితే, ఇక్కడా నష్టమే, అక్కడా నష్టమే! మనం రెంటికి చెడ్డ రేవడిలం!  




Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!