"మోస్ట్ పాపులర్ ఫాదర్" మరో మగపిల్లవాడు కోసం "లింగ నిర్దారణ పరిక్ష" చేయించాడట!
మొన్ననే ఆయన గారిని పదకొండు వేల మంది మహిళలు మోస్ట్ పాపులర్ ఫాదర్ గా ఎన్నుకున్నారు. ఈ రోజు ఆయన గారి గురించి ఒక విశేషం ప్రకటించారు.
ఆయనకి ఇద్దరు సంతానం.అందులో ఒకరు మగ, రెండవవారు ఆడ. వారంటే ఆయనకి ఎనలేని ప్రేమట. పిల్లలు పెద్దవారైతే వారిని స్నేహితులు లాగా చూడాలని విజ్ణులు చెప్పినట్లే ఆయన అభిప్రాయం కూడా అట. మొన్న ఫాదర్స్ డే సందర్బంగా ఒక మారేజ్ సంస్త వారు ఒక అభిప్రాయ సేకరణ చేసి బారత దేశంలో ఆయనని అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రిగా తేల్చిపారేశారు.ఇలా తేల్చడానికి వారికి ఉపయోగపడింది ఎవరో తెలుసా? అచ్చంగా మహిళలు.మరి అటువంటి మహిళ లను కించ పరచేలా మరో "మగబిడ్డ" కోసం ముందస్తు నిర్దారణలు చేయించిన ఫాదర్ "మోస్ట్ పాఔలర్ ఫాదర్" అవుతాడా?
హిందీ సినిమా ఇండస్ట్రీ బాద్షా గ్రేట్ షారుక్ గారు ఇద్దరు పిల్లల తండ్రి కాని వారితో ఆయనకి సంత్రుప్తి కలగలేదు. ఎలాగైనా మరో మగపిల్ల వాడిని పొందాలనుకున్నాడు.వయో రీత్యా కావచ్చు, లేదా ఇంకే కారణమయినా కావచ్చు, అతను సహజ పద్దతుల్లో కాకుండా, క్రుత్రిమ "సర్రో గసి" పద్దతిలో మరో మగపిల్లవాడిని పొందాలనుకుని, దాని కోసం లింగ నిర్దారణ పరీక్షలు కూడా చేయించాడట! ఇలా చెయ్యడం మన దేశంలో నేరం కాబట్టి, ఒక స్వచ్చంద సంస్తవారి పిటిషన్ మేరకు ముంబాయి ప్రబుత్వం విచారణ జరుపుతుందట! అదీ సంగతి.
మరి ఇటూవంటి వ్యక్తిని "మోస్ట్ పాపులర్ ఫాదర్" గా ప్రకటించి "షాదీ డాట్ కాం’ వారు బారతీయ తండ్రులను అవమానించారని చెప్పక అని చెప్పక తప్పదు.
Comments
Post a Comment