"దొరలా" దొంగ బ్రతుకు బ్రతికే కన్నా, "దొంగలా" దొర బ్రతుకే మిన్నా!
అరవై నాలుగు కళల్లో "చోర కళ" కూడా ఒకటి. అనుకుంటాం కాని దొంగతనం అంత ఈజీ కాదన్ సెలవిస్తుంటారు అనువభవజ్ణులు.సరే వారు అనుబవంతో అన్నారో, ఊహతో అన్నారో తెలియదు కాని అవకాశం దొరికితే ఇండియాలో దొంగతనం చెయ్యడం చాలా సుళువు.
ఒక పెద్దమనిషి ఎన్నికల సమయంలో పంచాయతి ప్రెసిడెంట్ గా నిలబడ్డాడట. పాపం డబ్బున్న ప్రత్యర్ది, గెలుపు కోసం తన అక్రమ సంపాదన(బ్లాక్ మని) విరజిమ్ముతుంటే, ఏమి చేయాలో పాలుపోక,రాత్రుళ్ళు దొంగతనాలకు వెళ్ళి, పగలు ప్రచారంలో ఆ డబ్బును పంచాడట!అలా ప్రెసిడెంట్ గా గెలిచి పదవి అనుబవిస్తుంటే, కొంతకాలానికి సదరు దొంగతనాలు బయట పడి కటకటాలా పాలు అయాడు ప్రెసిడెంట్ గారు.ఇది నిజంగా జరిగిన విషయం.
పై ఉదంతంలో ప్రెసిడెంట్ పదవి మీద మోజు అతనిని దొంగ తనానికి పురిగొల్పింది. పదవి మీద మోజు అనేది కూడా స్వార్దమే కాబట్టి, అతను చేసిన దొంగతనాన్ని పరమాదం గా బావించలేము. కాని ఇల దొంగ తనం చేసిన సొమ్ము ఎన్నికళ్ళో పంచడమనేది,అతను ఒక్కడే చేసాడా, అంటే కాదు అనే సమాదానం వస్తుంది. అసలు దొంగతనం అంటే ఏమిటి? పరుల సొమ్మును వారికి తెలియకుండా తీసుకోవడమే. ఒక వేళ తెలిసి దౌర్జ్యన్యంగా తీసుకున్నా అది దొంగతనం లో పై స్తాయిది అవ్తుంది. ఒక్క కార్పోరేటర్ పదవికి కోటి రూపాయలు ఖర్చు పెడుతున్నరు అంటే, అది ఎదో విదంగా ప్రజలకు తెలియకుండా కాజేసిన సొత్తే అయిఉండాలి.ఎవరో ఒకరిద్దరు దీనికి మినాహయింపు కావచ్చు. మరి ఇలా దొంగ సొమ్ముని ప్రజలకు పంచి పదవులు పొందే వ్యవస్తను ప్రజాస్వామ్యం అందామా?
కాదు నిర్వచనం మార్చాలి. ఇలా అంటే కరెక్టుగా ఉంటుందేమో!
" ప్రజల కొరకు దొంగతనం చేసి, దొంగడబ్బుతో ప్రజల చేత ఎన్నుకోబడి, ఆ ప్రజల వలన దోపిడి చేసే స్తాయికి ఎదిగే వీలున్న వ్యవస్తే "ప్రజా స్వామ్య వ్యవస్త".నిజంగా ఏ మాత్రం నిజాయితి ఉన్న ప్రస్తుత రాజకీయాలకు దూరంగా ఉండాలనే బావిస్తారు. దొరల్లాగ ముసుగులు వేసుకుని దొంగ బ్రతుకులు బ్రతికే కన్నా నిజాయితీగా అడవుల్లో మాటు వేసి దోపిడిలు చేసే వారి బ్రతుకులు ఎంతో స్వచ్చంగా ఉంటాయి. ఎందుకంటే వారు తాము దొంగలమనే చెప్పి దోచుకుంటారు. పైకి ఒక మాట లోపల ఒక మాట ఉండదు. దొంగతనం పాపం అని చెప్పరు. తమ వ్రుత్తి అని చెపుతారు. ఒక వేళ వారు చచ్చినా స్వర్గానికే వెళతారు. ఎందుకంటే వారి మనసు స్వచ్చం కాబట్టి. కాని రాజకీయాలలో ఉన్న ఈ దొర ముఖ దొంగలు మాత్రం గరుడ పురాణమ్ లో ఎన్ని శిక్షలు చెప్పబడాయో అన్నింటికి అర్హులే!
Comments
Post a Comment