ప్రజల్ని కాపాడలేని "లౌకిక" ముఖ్యమంత్రులు కన్నా, కాపాడే "మోడీ" లాంటివారే లక్షరెట్లు మిన్నా!
మతమో, గితమో ప్రబుత్వాలకు అనవసరం. తమని నమ్మిన వారికి సహయం చెయ్యడమే ప్రభుత్వ దర్మం. తమను నాయకులు గా బావించి, వోట్లేసి ఎన్నుకున్న ఆ ప్రజలు, దేవున్ని చూద్దామని "దేవబూమి" అని చార్ దాం యాత్రకు వెళితే,అక్క్డ ప్రక్రుతి ప్రకోపించి, రుద్ర దామాలు అన్నీ "రుద్ర భూమి" గా మారిపోతే, చేష్టలుడిగి పోయింది కాంగ్రెస్ పార్టీకి చెందిన "విజయ బహుగుణ" ప్రబుత్వం. నిస్సిగ్గుగా, మానవత్వం మరచి, అక్కడ వరద విపత్తులో చిక్కుకున్న భక్తులను దొంగలు దోచుకుంటుంటే, ఆపడం చేతకాని సర్కార్కి "చార్ దాం" ప్రాంతాన్ని ఏలే నైతిక హక్కు ఉందా?. అది అసలు "చార్ దామా"? లేక చోరోంకి దామా? ప్రజల్ని గుర్రాల మీద వచ్చి యద్దేచ్చగా దోపిడి చేస్తున్నారని మన ఆంద్రా యాత్రీకులు చెపుతున్నారు. వరదలనుంచి కాపాడలేరు సరికదా దొంగలనుంచి, వందరూపాయల వస్తువును వేయి రూపాయలకు అమ్మే వ్యాపార చోరులనుంచి కూడా కాపాడలేని దిక్కు మాలిన ప్రబుత్వాలు ఉంటే ఏమి? ఊడితే ఏమి?
కాని అందరూ అలాగే ఉంటారా? ఉండరు అని రుజువు చేసారు "హిందుత్వా వాది" మోడి గారు. అఫ్కోర్స్ ఆయన అందరికి సహాయం చేసే స్తితిలో లేకున్నా తనను నమ్ముకున్న గుజరాతీల కోసం తాను స్వయంగా అధికార సమేతంగా రంగంలో దిగి, వరద్దల్లో చిక్కుకున్న15,000 మంది గుజరాతీయులని కాపాడాడు అని టైమ్స్ ఆఫ్ ఇండియా వారు ప్రకటించారు. ఇది చాలు ఒక మతవాదికి ఎంత నిబద్దత ఉంటుంది ప్రజల్ని కాపాడడం లో అనేది చెప్పడానికి!నిజంగా మోడి లాంటి ముఖ్యమంత్రిని పొందిన గుజరాతీయులు దన్యులు.మరిన్ని వివారాల కొరకు లింక్ మీద క్లిక్ చెయ్యండి. http://timesofindia.indiatimes.com/india/Narendra-Modi-lands-in-Uttarakhand-flies-out-with-15000-Gujaratis/articleshow/20721118.cms
Comments
Post a Comment