సినిమాలో చూపించిన హీరోఇజం "పర్యాటక విపత్తులో" లో కానరాదే!
మన తెలుగువాడు, ఆంద్రుల అభిమాన నటుడు గారికి భారత పర్యాటక శాఖా మంత్రిగా పదవి వచ్చినందుకు అందరికీ సంతోషం వేసిఉండవచ్చు. పాపం ఆయన గారు చేదామని ఎంతో ఉబలాటపడిన"సామజిక సేవ" దాని కోసం ఆయన పెట్టిన పార్టీ, సదరు పార్టీ తాలుకు ఆర్oభ సబలో ఆయన చూపించిన బావోద్వేగాలు అన్నీ చూసి మల్లీ తెలుగువారికి, మరో నిస్వార్ద నేత దొరికాడు అని సంబరపడిన వాళ్ళు చాలా మందే ఉన్నారు. కాని విది వక్రించి అనుకున్నన్ని సీట్లు రాక రాజకీయంగా ఆయన బేజారు అయిన తరుణంలో, అధికార పార్టీలో జరిగిన హఠాత్ పరిణామాలకు ,ఆయన స్పందించి తీసుకున్న నిర్ణయం వళ్ళ ఆయన పెట్టిన పార్టీ కనుమరుగైనా అయనకు లబించిన "పర్యాటక శాఖా మంత్రి" పదవితో ఆయన మటుకు "చిరంజీవి" కాగలిగారు.
ఆయన పదవినలంకరించిన ఈ సంవత్సరం లోనే పర్యాటక యాత్రీకులుకు కానరాని కష్టాలు వచ్చి పడ్డాయి. "దేవబూమి" గా ఉన్న ఉత్తారాకాండ్ "మరు భూమి" గా మారి పోయింది. అది దైవ ఘటన కాబట్టి ఎవరూ ఏమి చేసేది లేదని సర్ది చెప్పుకున్నా, వరద విలయ అనంతర పరిణామాలలో ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రులు, అధికారులు ప్రదర్శిస్తున్న చొరవ, ప్రజల పట్ల వారికున్న నిబాదత చూస్తుంటే మన రాజకీయాలు ఎంత బ్రష్టు పట్టి పోయాయో అర్దమవుతుంది.
ప్రక్రుతి బీబత్సానికి అల్లడి తల్లడై, యాతికులు పదిరోజులుగా అష్టకష్టాలు పడుతుంటే
కనీసం వారి వద్దకు వెల్ళి, దగ్గరుండి స్వయంగా సహాయక చర్యలను పర్య వేక్షించాల్సిన బాద్యత ఉన్న పర్యాటక శాఖా మంత్రి గారు, కేవలం రక్షణ శాఖా మంత్రిని కలిసి పర్యాటకులను రక్షీంచమని వినతి పత్రం ఇచ్చి వస్తారా!అదే పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రి తాను స్వయంగా తన అధికార గణంతో వెల్లి, పదిహేను వేల మంది తన రాష్ట్ర పౌరులను కాపాడి వారిని విమాన సర్వీసుల ద్వారా తమ తమ ఇళ్ళకు చేర్చి ఇండియాలోనే ఒక గొప్ప "హీరోయిజాన్ని" ప్రదర్సిస్తే, స్వయంగా తాను నటుడిగా అనేక సినిమాలలో, విపత్కర పరిస్తితుల్లో హీరోఇజాన్ని చూపించిన ఆ హీరో గారు నిజ జీవితం లో "జీరోయిజాన్ని" చూపించారు.పాపం ఇటువంటి వ్యక్తిని నమ్మి ఎంత మంది అభిమానులు ఆయన పెట్టిన పార్టీ కోసం తమ సర్వసాలు దారపొసారూ!
ఇక పోతే, నిన్న మన తెలుగు రాజకీయ నాయకులు డెహ్రాడూన్" విమానాశ్రయం లో యాత్రీకుల పట్ల ఔదార్యం,చూపించటం కోసం వారు ప్రదర్శించిన బల ప్రదర్శనలు చూస్తూమ్టే "కేదానాద్" లోని శవాల కంపు అంతా ఒక్కసారే కొట్టినట్లు ఫీలయారు బారతీయులు. ఇటు చూస్తే తెలంగాణా నాయకులకు అసలు ఉత్తరాకాండ్ మన విషయం కాదు అన్నట్లు ప్రవర్తిస్తూ, తెలంగాణా సబలు సమావేశాలు మీదే ద్రుష్టి కేంద్రీకరించి తమ ప్రాంతీయ రాజకీయ లబ్ది కోసం ఆరాట పడుతున్నారు. మరి ఉత్తరాకాండ్ లో ఇరుక్కుపోయిన తెలంగాణా జిల్లాల వాళ్ళు ముఖ్యంగా హైద్రబాదీయులు గురించి అయినా స్పందించే స్తితిలో లేని పరిస్తితి వారిది. ఇటువంటి నాయకులను నమ్మా, మనం మన రాష్ట్ర బవిష్యత్తును వీరి చేతిలో పెట్టి నిబ్బరంగా నిద్రపోతుంది? ఆలోచించాల్సిన తరుణం వచ్చింది.
రాజకీయాలలో మచ్చ లేని చంద్రులు, నూటీకి నూరు శాతం ప్రజా సేవ చేసే వారు ఉండక పోవచ్చు. కాని సమకాలీనులలో ఎవరు ఎంతగా ప్రజా సేవ పట్ల స్పందిస్తున్నరో పోల్చి చూడాల్సిన అవసరం ఉంది. గుజరాతీ ప్రజలు చేసుకున్న పుణ్యం ఏమిటి? మనం చేసుకున్న పాపం ఏమిటి? వారి అంత విజ్ణులం కామా మనం? మనకు సేవ చెయ్యడానికి ఏ పొరుగు రాష్ట్రం వాడో రాడు, రావాల్సిన అవసరం కూడా లేదు. మన రాష్ట్రం లోను 'మోడీ' లాంటి నాయకులు ఉన్నారు. కాని వారిని మనం గుర్తించి వారికి వెన్నుదన్నులు ఇస్తేనే ముందుకు రాగలుగుతారు. వారు ఎవరూ అనేది బేరీజు వేసి చూడండి. పార్టిలతో, వర్గాలతో పని లేదు. సేవా తత్పరులు ఏ పార్ట్లో ఉన్నా స్వాగతించండి.పార్టి సిద్దాంతల్ల ప్రకారం నాయకులు లేరు. ఆ పరిస్తితులు కూడా లేవు. వ్యక్తిగతంగానె చూడండి.మంచి నాయకుల ప్రబవం మన చేతులలోనే ఉంది.
Comments
Post a Comment