కట్టుకున్నోడు పోయినట్లు లేదు! కానివాడు పోయినట్లుంది!


                                                            
                                                            
  నేను ఈ మద్య తెలిసినతను మర్డర్ చేయబడ్డాడు అని తెలిసి, వాళావిడని, పిల్లలను పరామర్సిదామని వెళ్లాను. అక్కడ ఆవిడని పలకరించడానికి చాలా మంది బందువులు, చనిపోయిన వ్యక్తి స్నేహితులు వచ్చి పరామర్సించి వెలుతున్నారు.

  మర్డర్ కావించబడిన వ్యక్తి కారుకు యజమాని. అతనికి స్నేహితులు ఎక్కువే. అలా స్నేహితులతో కలసి కారులో వెళ్ళిన వ్యక్తి, తన కారులోనే శవం గా వెనుక సీటులో పడుకోబెట్టబడి ఉంటే మొదట ఎవరూ గమనించలేదట. ఆ కారు కూడా వేరే ఊరిలో రోడ్ వారాగా ఆపుచెయ్యబడి ఉందట. ఒక రోజు అలాగే ఉన్న కారులోనుంచి దుర్వాసన వస్తుంటే గమనించిన పాదచారులు విషయం పోలిసులకు చెప్పారట. పోలిస్ వారు వచ్చి, కారులో ఉన్న శవం చొక్కా జేబులో ఉన్న చరవాణి అదారంగా, అతని బార్యకు కబురు చేస్తే, ఆమె తన బందువులతో కలిసి వెల్లి బర్తని గుర్తించి, అతనికి పోస్ట్ మార్టం చేసిన తర్వాత తీసుకువచ్చి, ఆ రాత్రే దహనం చేసారట! తెల్లారి ఈ విషయం పేపర్లో  సంచలన వార్త గా ప్రచురించ బడ్డాకా, మా లాంటి వారందరికి తెలిసి పరామర్సించడానికి వస్తున్నారు.

  సాదారనంగా కుటుంబంలో ఏ వ్యక్తి అయిన హటాత్ మరణం చెందితే ఆ షాక్ నుండి దగ్గరి బందువులు ముఖ్యంగా బార్యా కాని, బర్త కాని కోలుకోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఏ క్యాన్సర్ లాంటి జబ్బుతోనో బాదపడి మరణించే వారి విషయంలో, కుటుంబసబ్యులు మానసింకంగా ఆ వ్యక్తి మరణం గురించి సంసిద్దులై ఉంటారు కాబట్టి తొందరగానే కోలుకుంటారు. కాని హటాత్ మరణం ముక్యంగా మర్డర్ లాంటివి జరిగితే వారి స్పందన్ వేరుగా, ఒక షాకింగ్ మూడ్ లో ఉంటుంది. ఆ ఉద్దేస్యంతోనే అందరూ ఆమెను ఒదార్చాలని వచ్చి ఆశ్చ్యర్యం గా బుగ్గలు నొక్కుకుంటున్నారు.

   ఆ అమ్మాయిలో తన బర్తను ఎవరో చంపారే అనే బాద ఉన్నట్లే లేదు. ఏదో తమ కారు డ్రైవర్ ఏక్సిడెంట్లో చనిపోయినట్లు వచ్చిన వారితో  మాట్లాడుతుంది.రావాల్సిన ఇంసూరెన్స్ డబ్బులు వాటి గురించి తన బందువులతో మాట్లాడుతుంది.  తన ప్రాణా నాదుడు(?) అని బావింపబడిన వాడు, తన పిల్లలకు తండ్రి అయిన వాడు నిన్నటి దాక తమతో ఉన్నవాడు  ఈ రోజు ఒక దయనీయమైన పరిస్తితిలో చంపబడితే, దాని తాలుకు కోపం ఆక్రోశం,ఉవ్వెతుఉన పొంగి కన్నీటి రూపంలో వస్తుంటాయి అనుకున్న వారు పాపం ఆమెను చూసి నిరాశ చెందారు. పక్క మెటిరీలైజెడ్ గా  ఉన్న ఆమెను చూసి తమ గురించి కూడా తమ బార్యలు ఇలాగే ఏఫీలింగ్ లేకుండా ఉంటారా? అని కొంత మంది మగవారికి అనుమానం వస్తుంటే, ఈమే ఇలా ఎలా ఉండగలుగుతుందా ఆడవారు ముక్కున వేలేసుకుంటున్నారు.

  నిజంగా బార్యాబర్తల బందం ఇంత అల్పమయిందా? బర్త చనిపోతే ఎవరో కానివాడు చనిపోయినట్లు ఉండగలిగేంత స్తితిలో ఆమెను ఉంచుతుందేమిటి? వైరాగ్యమా? సంసారజీవితం మీద కలిగిన విరక్తా? ఏమో మరి! ఆ భగవంతుడికే తెలియాలి.ఇటువంటివారిని చూస్తుంటే  బార్యా భర్తలు మద్య అనుబందాలు ఎంత మెటిరీలైజ్ గా మారాయో అర్దమవుతుంది.      

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!