కోడళ్లను కాల్చుకు తినే అత్తలకు,అత్తలను హింసించే కోడళ్ళకు బతుకమ్మ అడే నైతిక అర్హత ఉందా?
రెండు తెలుగు రాష్ట్రాల లోని తెలుగు ప్రజలు గత 4 రోజులుగా స్త్రీ శక్తికి ప్రతి రూపం అయిన ఆ ఆదిశక్తిని ని తమ తమ సాంప్రాదాయ రీతులలో కొలిచి అంతులేని అలౌకిక అనందం ని అనుభవిస్తున్నారు . తెలంగాణా ప్రాంతంలో ఆ తల్లిని "బతుకమ్మ " రూపంలో అట పాటలతో కొలిచినా , ఆంద్రా ప్రాంతంలో కనక దుర్గమ్మ రూపంలో ఆ తల్లిని వేడుకున్నా అంతరార్దమ్ ఒకటే . ఈ పది రోజులు ప్రక్రుతి రూపమైన స్త్రీ శక్తిని పూజించడమే . హిందూ జీవన విదానంలో పురుష శక్తి కి ఎంత ప్రాదాన్యం ఉందో స్త్రీ శక్తికి అంత ప్రాదాన్యం ఇవ్వబడింది అని దసరా పండుగ మరియు బతుకమ్మ పండుగల విశిష్టత మనకు తెలియ చేసుంది . ...