Posts

Showing posts with the label అడవి బిడ్డలు

అడవి బిడ్డలుకు, ఉన్న పాటి బుద్ది లేని నాగరీకులు!

                                                                                                                                     2011  జనాభా లెక్కలు ఒక విషయాన్ని తేట తెల్లం చేసాయి. మనుష్యులలో స్త్రీ పురుష బేదమనేది, చదువు సంద్య నేర్చిన నాగరీకులలోనే ఎక్కువ. అది మనుషులంతా అడవితల్లి ఇచ్చిన బిడ్డలే అని నమ్ముతున్న గిరిజనులలో లేదట!అందుకు ప్రబల ఉదాహరణ గిరిజన మండలాలో  వెల్లడైన స్త్రీ పురుష సంతాన నిష్పత్తి.   నగరాలలో, అలాగే గిరిజనులేతరులు ఉండే మండలాల్లో సైతం   పురుషుల కంటె స్త్రీల సంతాన నిష్పత్తి దారుణంగా తగ్గిపోతుంటే,గిరిజన మండలాల్లో మగబిడ్డలు కంటే ఆడబిడ్డలే అధికంగ ఉండంటం గమనార్హం.   ఉదాహరణకు ఖమ్మం జిల్లా కూనవరం మండలంలో ప్రతి వేయి మంది పురుషులకు పదకొండు వందల యాబై మంది స్త్రీలు ఉన్నారట!. అలాగే ఆదిలాబాద్ జిల్లాలోని గిరిజన గ్రామాల్లో ఈ నిష్పత్తి కనపడుతుంది. దీనంతటికి కారణం వారిలో పిల్లల పట్ల పక్షపాతి దోరణి లేకపోవడం ఒకటైతే, వారికి దైవబీతి ఉండటం కూడ ఒక కారణం కావచ్చు.   దీని వలన మనం అర్థం చేసుకోవలసింది ఒకటే, ఆదిమ సమాజాలలో కాని, వేదకాలంలో కాని మనుష్యులలో తరతమ బేదాలు లేవు. కాని జ్ణానం