మట్టికుండ కోసం గొర్రె ని కోసి గోడని కూల్చిన కధ ను గుర్తుకు తెచ్చిన "బోరు బావిలో గిరిజ" ఉదంతం !
గత మూడురోజులుగా రంగారెడ్డి జిల్లాలో మంచాల గ్రామంలో జరుపుతున్న బోరు బావి రెస్క్యూ అఫరేషన్ గమనిస్తుంటె నిజంగా మన అధికారులు ఇంత మానవత్వం ఉన్న వారా అని ఆశ్చర్య పోవాలో లేక ఇంత పాగల్ గాళ్ళా అని నిర్ఘాంత పోవాలో అర్ధం కాకుండా ఉంది. వేల కిలోమీటర్లు దూరం నుండి వేగంగా దూసుకు వస్తున్న హుడ్ హుడ్ తుపాన్ ఎక్కడ తీరం దాటుతుందో చెప్పగలిగే అంత టెక్నాలజి ఉన్న మనకు నీరున్న బోరు బావి లో పడిన నాలుగేళ్ల పాప బ్రతికి ఉందా? లేదా ? అని నిర్దారించే టేక్నాలజి లేదనుకోవడం అమాయకత్వమే అవుతుంది. మరి అటువంటి టేక్నాలజి ఉండి కూడా మూడు రోజులు రేయింబవళ్ళు, మన ఘనత వహించిన అధికారులు, ఒక మంత్రి గారి పర్యవేక్షణలో 13 జే సి.బి లు ఉపయోగించి సుమారు ఎకరం భూమిని నాశణం చేసి చివరకు పాప చని పోయిందని సి సి. కెమేరాలు ద్వారా నిర్దారించి చెప్పడ...