భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"
అప్పుడెప్పుడో రాజేంద్ర ప్రసాద్ , మాధవి కలిసి నటించిన తెలుగు సినిమా ఒకటి చూసాను . అందులోని సారాంశం ఏమిటంటే పెండ్లి అయిన కొన్ని రోజులకే భర్త చనిపోతే మాధవికి తన చిన్న తమ్ముడి వయసున్న మరిది రాజేంద్ర ప్రసాద్ ని ఇచ్చి కట్టబెడతారు పెద్దలు. అది వారి సాo ప్రదాయం అట . బహుశా ఈ సినిమా అటువంటి ఆచారం కలిగిన పరబాషా చిత్రం నుండి అనువదించ బడి ఉంటుంది . మన తెలుగు వారిలో అటువంటి దురాచారం లేదు కాబట్టి , అ సినిమా కొంత ఎబ్బెట్టుగానే అనిపించింది . అలాంటిదే ఇంకొక పరబాషా సినిమా లో ఒక వదిన గారు తనకు సంసార సుఖం లేదని భర్తను నిరంతరం అవమాన పరచడమే కాకుండా అతని ముందే అతని తమ్మున్ని వాంచిస్తుంటే అది తట్టుకోలేక భర్త ఆత్మహత్య చేసుకుంటాడు . అది తెలియని తమ్ముడు విడవరాలైన తన వదిన గారి పట్ల ఎంతో పూజ్య బావంతో ఆమె, ఆమె కూతురు ఆలనా పాలనా చూస్తుంటే , ఆ వగలాడి వదిన మాత్రం అతనికి వచ్చే సంబందాలు అన్ని చెడగోడుతూ ఉంటుంది . మరిదిని ఎలాగైనా తన దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటుంది . చివరకు విషయం పసి గట్...