అన్న చని పోయినంత మాత్రానా,వదిన స్టుడియోల చుట్టూ తిరగాల్సిందేనా !!!?

                                                                           

అది సెలబ్రిటిల ప్రపంచం . ఒక రంగుల మాయా లోకం . మన పురాణాలలో వర్ణించిన దేవలోకం అది . ఆ  లోకం లోని వారు ఏమి చేసినా పిచ్చ పబ్లిసిటి . వారు బ్రతికి ఉన్నా పబ్లిసిటియె ,చనిపోయినా పబ్లిసిటియె . ఆ  పబ్లిసిటి యే వారిని చిరంజీవులుగా ఉంచుతుంది అనుకుంటా . దేవతలు అమృతం త్రాగి చిరంజీవులుగా ఉంటే ,వీరు పబ్లిసిటి తో సదా వర్దిల్లుతున్నారు . మరి అటువంటి రంగుల లోకమైన సినిమా జగత్తులో ఒక సంగిత దర్శకులు దురదృష్ట వశాత్తు మరణిస్తే , అతని కుటుంబ సబ్యుల మద్య ఏర్పడిన స్వల్ప బేదాభిప్రాయాలను సరి చెసే పెద్దలే లేరా? లేకుంటే వారి తగాదాకు  కూడా పెద్ద పబ్లిసిటి వచ్చెలా చేసి ,ఆ తర్వాత సినిమా కద గా మార్చి పాయిదా పొందుదాం అనుకుంటున్నారా ?

 సంగీత దర్శకులు స్వర్గీయ చక్రి గారు గుండె పోటుతో మరణించి నెల రోజులైనా కాకముందే ,అయన భార్యా, అతని తల్లి ఇతర కుటుంబ సబ్యుల మిద 498A కేసు పెట్టడమే కాక ,న్యాయం కోసం చానల్ స్టూడియోలు చుట్టూ తిరుగుతూ ఉండడం ,చక్రి గారి అభిమానుల్ని కలచి వేసే విషయం . అత్త తనకు తల్లి లాంటిదని ,మరిది తనకు బిడ్డ లాంటి వాడని వారి బాగోగులు చూడడం తన దర్మం అని ప్రకటించిన పది రోజులకే ,తల్లి బిడ్డ లు లాంటి వారి మీద 498A కేసు పెట్టి ,స్టుడియొల చుట్టూ తిరుగుతూ ,కుటుంబ పరువు తీయడం తద్వారా  చక్రి గారి ఆత్మకు శాంతి  లేకుండా చేయడం సబబా ? చక్రి గారి శ్రీమతి శ్రావణి  గారే స్వయంగా ఒప్పుకున్నారు తన భర్తకు తన కుటుంబ సబ్యులు అంటే వల్ల మాలిన ప్రేమ అని . మరి తన భర్తకు అంత ఇష్టమైన కుటుంబ సబ్యుల ను బజారులోకి లాగడమంటే ,అయన పరువును బజారుకి ఈడ్చడం కాదా? ఇదేనా భార్యాగా తన ఇష్టమైన భర్తకు ఇచ్చె నివాళి . 

  చక్రి గారి కుటుంబ సబ్యులు ఆమెను పట్టించుకోకుండా ,ఆమె గారి ఆర్దిక హక్కులకు బంగం కలిగిస్తున్నారు అని గొడవ చేయడంతో ,చక్రి గారి కుటుంబ పరువు పొగూడదనె ఉద్దేశ్యంతో ,సినిమా పెద్దలు అయిన శ్రీ దాసరి నారాయణ రావుగారు , తమ్మారెడ్డి బరద్వాజా గారు మద్య వర్తిత్వం చెయ్యడానికి ఒప్పుకున్నారు .చక్రి గారి బార్యా ,ఇతర కుటుంబ సబ్యులు కుడా వారు ఇచ్చె తీర్పుకు కట్టుబడి ఉంటాం అని వారికి రాతపూర్వక హామీ పత్రం ఇవ్వడం జరిగింది. మరి పెద్ద మనుషుల నిర్ణయానికి కట్టుబడకుండా స్టుడియోల చుట్టూ న్యాయం కావాలని ఏడుస్తూ తిరగడం ఎందుకు? దీని వలన ఎవరికీ లాభం? పెద్ద మనుషుల తీర్పు నచ్చక పొతే గౌరవంగా సివిల్ కోర్టుల ద్వారా తమ హక్కులను అమలు పరచుకోవచ్చు .కాని క్రిమినల్ కేసులు పెట్టి తల్లి,తమ్ముడు  లాంటి వారిని  పోలిస్ స్టేషన్ ల   చుట్టూ తిప్పడ మెందుకు?

చక్రి గారి కుటుంబ సబ్యులు కుడా ఆలోచించాలి . చక్రి గారి ఆస్తులు స్వార్జితం అయితే వాటికి అయన భార్యా పిల్లలే వారసులు. వారి ఆస్తిని వారికి అప్పచెప్పడం మంచిది .లెకుంటె చట్టం అ పని చెస్తుంది . ఒకవేళ పిత్రార్జిత ఆస్తులు ఏవైనా ఉంటె చట్ట ప్రకారం ఆమెకు వచ్చె వాటా ఆమెకు ఇచ్చి వేస్తె సరి పోతుంది . దాని కోసం ఆమెను బయటకు వెళ్ళేలా చేసి కుటుంబ పరువును పోయేలా చేసుకోవడం విజ్ఞత అనిపిస్తుo దా ?అన్న చని పోయినంత మాత్రానా న్యాయం కోసం వదిన స్టుడియోల చుట్టూ తిరగాల్సిందేనా !!!?  ఆలోచించండి . లెదూ మాకూ మా కుటుంబానికి ఏదో రకంగా పబ్లిసిటి కావాలంటే ఎవరి మాటా వినాల్సిన అవసరం లెదు. కుటుంబం అంటే కేవల ఆర్దిక  బందాలు కావు.సంపూర్ణ మానసిక బందాలు . అటువOటి  బందం ఎప్పుడూ త్యాగం కోరుతుంది . అటువంటి బందం లేనివారిని కలిపి ఉంచలెము . అలాంటి పరిస్తితుల్లో  చట్ట పరమైన హక్కులకె ప్రాదాన్యత . దానిని చక్రి గారి కుటుంబ సబ్యులు గుర్తించాల్సిన అవసరం ఉంది . 
                                           (Republished post, OPD:11/1/2015)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!