షేక్ జాస్మిన్ ఆత్మహత్య , శ్రీ సాయి చావు కొచ్చ్చిందంట !!

                                                                           



                            పుణ్యానికి పొతే పాపం ఎదురైందంటారు చూసారా !. అదిగో అచ్చం అలాగే జరిగింది వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుని విషయం లో . గుంటూరు జిల్లా , నిజాంపట్నం మండలం , మహమ్మదీయపాలెంలో జరిగిన ఈ యదార్థ  సంఘటన , అపోహ మనుషుల్ని ఎంత విచక్షణ హీనులుగా చేస్తుందో కళ్ళకు కట్టినట్లు చేస్తోంది. ఇక వివరాలలోకి వెళితే ,

 మహమ్మదీయ పేటకు చెందిన షేక్ జాస్మిన్ కి 19 ఏండ్లు . కాలేజీలో చదువుకుంటుంది కాబోలు ఆమెకు ఎదో కలుగరాని కష్టం కలిగి , బ్రతికే దారి కానరాక ఉరేసుకుని చనిపోదామని నిర్ణయించుకుంది. అదే విషయం తన స్నేహితురాళ్లకు ఫోన్ చేసి కూడా చేప్పిందంట . ఆ తర్వాత ఉరివేసుకుంటుంటే దానిని గమనించిన 2 యువకులు వేముల శ్రీ సాయి మరియు అతని స్నేహితుడు జొన్నా పవన్ కుమార్ లు పెద్దగా కేకలు వేసి చుట్టుపక్కల వారికి సమాచారం ఇచ్చ్హారు.

    ఇక దానితో అక్కడకు చేరుకున్న మహమ్మదీయ పేటవాళ్ళు , అమ్మాయి ఉరి వేసుకుని ఉండడం, ఆ సమయం లో అక్కడే ఇద్దరు కుర్రాళ్ళు ఉండడం తో ఒక నిర్ణయానికి వచ్చేసారు . వారే అఘాయిత్యమో అమ్మాయి మీద చేస్తే , దానిని భరించలేక ఆ అమ్మాయి ఉరి వేసుకుని చనిపోయిందని . అంటే ఒక్క సారిగా మందంతా ఆ ఇద్దరు యువకుల మీద పడి వారి బట్టలు ఊడదీసి మరి చావబాదారు. మేమేం చేయలేదు మొర్రో అన్నా వినిపించుకునే వారు లేకపోయారు . ఇంతలో విషయం తెలిసిన పోలీసులు అక్కడకు వచ్చి ఆ కుర్రాళ్లని వారి నుండి విడదీసి హాస్పిటల్ కి తరలించారు. తర్వాత జాస్మిన్ స్నేహితురాళ్లు వలన విషయం తెలుసుకున్న బాదుడు గాళ్ళు "అయ్యో అలానా ? అమ్మాయే ఉరివేసుకుందా ? ఎంత పొరపాటు అయింది . అమ్మాయకులని గొడ్డులని బాదినట్లు బాదామే " అని అనుకుని కురాలకి సారి చెప్పారట.

    కానీ అప్పటికే జరగరానిది జరిగిపోయింది . దెబ్బలు తిన్న శ్రీ సాయి హాస్పిటల్కి చేరకముందే మరణించే సరికి అక్కడి డాక్టర్ లు కూడా శ్రీ సాయి పేరెంట్స్ కి సారి చెప్పేశారట. ఇలా బాదుడు గాళ్ళ సారి తో  , అటు డాక్టర్ ల సారి తో ఒక్క క్షణం నివ్వెరబోయిన శ్రీ సాయి బంధువులు ఘొల్లు మని ఏడుస్తూ తమ బిడ్డ చావుకు కారణమైన వారిని శిక్షించాలని ఆందోళన చేపడితే , బాదుడు గాళ్ళ మీద కూడా కేసు బుక్ చేసి విచారిస్తున్నారు పోలీసులు.శ్రీ సాయి స్నేహితుడు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు .

    చూసారా?ఎంకి పెండ్లి సుబ్బి చావుకొచ్చినట్లు , సంబంధం లేని  జాస్మిన్ ఆత్మహత్య శ్రీ సాయి చావు కోచ్చిమ్ది. పాపం ఆ అమ్మాయి తానూ ఒక్కతే  పోవడం ఇష్టం లేక, తన చావును ఆపాలని ప్రయత్నించిన   కుర్రాడిని కూడా వెంటపెట్టుకెళ్లినట్లు ఉంది !!. ఆమె చావుకు కారణం ఎవరో కానీ , శ్రీ సాయి చావుకు మాత్రం ఆమె ఆత్మహత్య కారణ మవడం  అందరిని కలచివేసిన  విషయం.

 Source:   http://www.navatelangana.com/BreakingNews/346309

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!