మీ అయన బెస్టా? నేను బెస్టా ? , అన్న మెసేజ్ వారి 'ఫస్ట్ నైట్' ని 'లాస్ట్ నైట్' చేసిందంట !

                                                                         


                                       కాబోయే దంపతులు పెండ్లికి ముందే అన్నీ మనసు విప్పి మాట్లాడుకునే దమ్మూ , దైర్యం ఇంకా మన సమాజంలో రాలేదు . దానికి కారణం మనది అటు పూర్తిగా చాదస్త సాంప్రదాయ సమాజంకాదు , అలాగని చెప్పి పనికి రాని  పాశ్యాత  విలువలను అక్కున చేర్చుకునే సమాజం కాదు. మారుతున్న పరిస్తితులను ఆకలింపు చేసుకుని మనకు  ఏది మంచో చెడో అర్దం చేసుకుని తదనుగుణంగా మార్పును ఆహ్వానిస్తున్న సమాజం మనది. . వైవాహిక  జీవిత పటిష్టతకు మూలం , దంపతుల మద్య ఉండె నమ్మక్కం తో కూడిన అవగాహన . రెండు సార్లు విడాకులు తీసుకున్నవారిని సైతం పునర్వివాహం చేసుకోవడానికి సిద్ద పడె వారు , మొదటి వివాహమైనా సరే , తన లైఫ్ పార్టనర్ ,వేరొకరి ని తన మనసులో ఉంచుకున్నారు అన్నా , వారితో పాత పరిచయాలు ఉన్నాయని తెలిసినా  అస్సలు తట్టుకోలేరు. కారణం మొదటి దానిలో సామాజిక అనుమతితో పాటు దాపరికం లేకుండా ఉండటం కారణమైతే , రెండవ దానిలో సీక్రెట్ సంబందాలు. ఇవి  కుటుంబ విచ్చిన్నతకు దారి తీస్తున్నాయి.

  యువతీ యువకులు బాయిప్రెండ్ , గర్ల్ ప్రెండ్ సంస్కృతికి నాకర్షితులై , తమ జీవితం తమ ఇష్టం అనే రీతిలో వ్యవహరిస్తే, ఆనక  వారి కాపురాలు ఎలా కూలిపోతాయో  ఈ వాస్తవ ఉదంతం తెలియ చేస్తుంది . 

  వారివురూ కొత్తగా పెళ్ళైన వారు. వారి ఫస్ట్ నైట్ ఆ రోజు! భార్యా భర్తలు తోలి వలపు పండించుకోవడా నికి  తహ తహ లాడుతుంటే ఆ అమాయి సెల్ రింగ్ లు   వారిని చీకాకు పరుస్తున్నాయి . దానితో ఆ అమ్మాయి సెల్ ని సైలెంట్ లో పెట్టింది . ఆ తర్వాత సెల్లో మెస్సేజ్ అలెర్ట్ వచ్చింది . దానిని చూసిన ఆ అమ్మాయి మౌనంగా సెల్ ని దిండు క్రింద పెట్టి , బాత్ రూం కి వెళ్ళింది . ఎందుకో ఆ ఫస్ట్ నైట్ మొగుడికి అనుమానం వచ్చి , కామ్ గా దిండు క్రింద ఉంచిన ఆమె సెల్ ని తీసి అందులో మెసేజ్ చదివ్వాడు . అంతే ! అతని దిమ్మ తిరిగి పోయింది! ఆమె  లవర్ పంపిన మెసేజ్ అది . హ్యాపీ ఫస్ట్ నైట్ అని కాదు. ఆ విషయంలో తను గొప్పా ? ఆమె మొగుడు గొప్పా ? అని అసహ్యకర రీతిలో పంపిన మెసేజ్. దానిని చూసి కూడా ఆమె కామ్ గా ఉండటంతో , దాని గురించి ఆమెను ప్రశ్నించాడు . అంతే ! అగ్గి మీద గుగ్గిలం అయింది ఆ ఆదునిక ఇల్లాలు . "యూ కంట్రీ బ్రూట్ , నా సెల్ లోని మెసేజ్ లు చూడడానికి సిగ్గులేదు , నీకు ? అంటూ అతని పై విరుచుకు పడింది. అతనేలాగూ కంట్రీ మగాడే కాబట్టి ఆమె మీద అతనూ దాడి చేస్సాడు. ఆ విదంగా ముష్టి యుద్దాల గోదా గా మారింది  ఆ శోభనపు గది! 

  తెల్లారే పంచాయతీ పెట్టడం , ఆ అమ్మాయి తన ఇష్టం తనది అనడం , ఆ అబ్బాయి ఇట్లాంటి ఆడది నాకు వద్దనడంతో పెద్దలు ఆ అమ్మాయి మనసెరుగకుండా పెండ్లి చేసిన ఆమె తరపు వారిని తప్పు పట్టి వారిద్దరిని డైవోర్స్ తీసుకోమని సలహా ఇచ్చి పంచాయతి ముగించారు. వారివురూ డైవోర్స్ తీసుకున్నారు. ఇప్పుడూ హాయిగా ఎవరు కోరుకున్న జీవితం వారు అనుభవిస్తున్నట్లుంది. మరి వారిద్దరి జన్మకు కారణమైన మన కుటుంబ వ్యవస్థ లో బాగమైన వివాహ వ్యవస్థ మాత్రం దారుణంగా అవమానింప బడింది . లక్షలు వెచ్చించి , ఎంతో మంది టైమ్ ను ఖర్చు చేయించి దూం !దాం ! గా చేసిన అట్టహాసపు పెండ్లి ఒక మెసేజ్ దెబ్బతో ఫస్ట్ నైట్ నే లాస్ట్ నైట్ గా మార్చింది. ఆ అమ్మాయి కుటుంబ పరువు ప్రతిష్టలను మంట గలిపింది! అ అబ్బాయి కుటుంబమూ నవ్వుల పాలైంది. 

    తాము చేసేది కరెక్టే అని తమకు అనిపించినప్పుడు అదే విషయం పెండ్లికి ముందు తమ వారితో కాని , తనను కట్టుకోబోయే వారితో కాని చెప్పి ఉంటే ఇంత నగుబాట్ల పని జరిగి ఉండెది కాదు కదా? నా జీవితం నా ఇష్టం అంటె ఇదా అర్దం !
                                                      (Republished post., 24/11/2014). 
         

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

మన రాష్ట్రంలో ట్రెజరీ జీతాల కోసం "చర్చ్ పాధర్ " లు రోడ్లెక్కిన సందర్బాలు ఎప్పుడైనా చూసారా ??

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన