ప్రియుడిని చంపించిన చోటే మొగుడితో డ్యూయట్ పాడటానికి వెళ్లిన నెరజాణ !!

     


                             క్రూర మనస్తత్వం ప్రదర్శించడం లోకొంతమంది  స్త్రీలు పురుషులకు ఏ మాత్రం తీసిపోరని నిరూపించింది యునైటెడ్ కింగ్డమ్ లోని మిడ్వే నగరానికి చెందిన ముంధీల్ మహిల్ అనే 23 ఏండ్ల మహిళామణి . ఈమె కు కనీసం మైనార్టీ కూడా తీరని వయసులోనే , ఒక ప్రేమ కహాని , ప్రియుడిని తన బాయిప్రెండ్స్ తో చంపించిన చరిత్ర, దానికి గాను 5 ఏండ్లు జైలు శిక్షపొంది , 3ఏండ్లకే బయటకు వచ్చిన అనుభవము ఉన్నాయి. అన్నింటికి మించి ఆమె అందం చాటున దాగిఉన్న ఆమె క్రూర మనస్తత్వం ఆమెకు హైలెట్ . అదేమిటో చూదాం.

                                                                           

   
                         ముంధీల్ మహిల్ తాను మెడిసిన్ చదువుకునే రోజుల్లో 21 సంవత్సరాల గగన్ దీప్ సింగ్ అనే కుర్ర టీవీ ఎక్జికూటివ్ తో ప్రేమలో పడింది. సహజంగా అందగత్తె కావడం అమ్మాయి గారికి వెంటపడే బాయిప్రెండ్స్ ఎక్కువే కాబోలు . దానితో గగన్ తో ఏవో మనస్పర్థలు ఏర్పడి అతడిని అడ్డుతొలగించుకోవాలని ప్లాం చేసింది. ఇందుకు తన ఇతర బాయిప్రెండ్స్ అయిన హర్విందర్ షోకేర్ , డారెన్ పీటర్స్ తో కుట్రపన్ని దానిని అమలు చేసింది.

                                                             

 

                       తనప్రియుడు అయినా గగన్ ను ప్రేమ విహారం నెపం తో గ్రీన్విచ్ పార్క్ కు తీసుకువెళ్లి , ఆ పార్కులో దూరంగా కారును పార్క్ చేయించి అతనితో రొమాన్స్ చేస్తూ తన బాడ్  బాయిప్రెండ్స్ కు సిగ్నల్ ఇచ్చిమ్ది. దానితో వారివురు వచ్చి గగన్ ను బాగా కొట్టి , కాళ్ళు చేతులు కట్టిపడేసి , కారులోనే ఉంచి కారుతో సహా తగలపెట్టేసారు . దీనితో విచారణ చేపట్టిన పోలీసులు , దుష్ట త్రయాన్ని అరెస్ట్ చేసి కోర్టులో నిలబెట్టారు . ఆన్నింటిని కూలంకషంగా పరిశీలించిన కోర్టు హారవిందర్ శోకేర్ కు 20 ఏండ్లు , పీటర్స్ కు 12 ఏండ్లు , ముందిల్ కు 5 ఏండ్లు శిక్ష విధించింది . ఇలా ఒకే నేరానికి వేర్వేరు శిక్షలు విధించడడానికి కారణం ఏమిటంటే డైరెక్టుగా హత్యలో పాల్గొంది హారవింద్ అయితే , అతనికి సహాయం గా వెళ్ళినది పీటర్స్ . గగన్, మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట కాబట్టి అవసరం అయితే తానూ హారవిందర్ కి సహాయంగా గగన్ మీద దాడి చేద్దాం అని అనుకున్నప్పటికీ అతనికి ఆ అవసరం రాలేదు. ఇక ఈ లేడి డాన్ విషయానికి వస్తే వారు ఎప్పుడైతే గగన్ మీద దాడి చేయడం ప్రారంభించారో అప్పుడే సైలెంట్ గా జారుకుంది. తానూ కేవలం గగన్ ని కొట్టడం జరుగుతుంది అని బావిచాను అని ఆమె చెప్పిన దానిని నమ్మి అందుకు అనుగుణంగా 5 ఏండ్లు జైలు శిక్ష విధించింది కోర్టు .

                                                                   


                      ఇక జైలులో ఆమె బుద్దిగా ఉందంట . అది చూసి జైలు వారు కనికరించి మూడేళ్లకే అంటే 2014 లో ఆమెను విడుదల చేశారు. ఇక ఆమె గారు ఈ  మధ్య లేబర్ పార్టీలో ఇప్పుడిపుడే పైకి వస్తున్నా "వారిందర్ సింగ్ " అనే అయనను వలచి  వరించింది . వారి వివాహం   రోచెస్టర్ నగరం లోని ఒక గురుద్వారా లో అంగరంగ వైభవంగా జరిగింది అట. ఆ సందర్భంగా ఆమె ధరించిన పెండ్లి డ్రెస్ ఖరీదు సుమారు 3000 డాలర్లు. ఇలా పెండ్లి చేసుకోవడమే కాదు అక్కడికి దగ్గరలో ఉన్న గ్రీన్ విచ్ పార్కుకుకి తన మొగుడితో కలసి హాని ట్రిప్ కి వెల్లిందంటా . ఎక్కడైతే తన ప్రియుడిని సజీవదహనం చేయించిందో ఆ ప్రాంతాల్లోనే తన మొగుడితో కలసి విహారం చేసింది.

                                                                       


                           ఇక అక్కడితో ఆగలేదు ఆమె. తాను తన భర్త కళ్ళలోకి మురిపెంగా చూస్తూ , గ్రీన్విచ్ పార్కులో విహరించిన విధం అంతా ఫొటోలు తీసి వాటిని ఫేస్ బుక్లో పెట్టి , తన ఘనకార్యాన్ని లోకానికి చాటింది . దీనితో ఒళ్ళు మంది పోయిన గగన్ దీప్ మాతృమూర్తి , సోదరి , అన్యాయంగా తమ పిల్లవాడిని పొట్టన పెట్టుకున్నదే కాక , ఇలా ఏ మాత్రం పశ్చాత్తాపం లేని విధంగా తన కొత్త మొగుడితో కలసి , ప్రియుడిని చంపించిన చోటే ప్రణయా విహారం చేయడం ఆమెలోని క్రూరత్వం చాటుతుంది. ఈమె స్త్రీ జాతికే మాయానిమచ్చ అని వాపోయారు అట.

   అందమైన రోజా పువ్వు వెనుకాల కసుక్కున దిగే ముళ్ళు ఉన్నట్లే , కొంతమంది అందమైన ముఖాల చాటున  కాటేసే మనస్తత్వాలు ఉంటాయి అని చరిత్ర చెప్పిన అనేక పాఠాల్లో ముంధీల్ మహిల్ జీవితం కూడా ఒకటి. మరి ఇలాంటి నెరజాణ ను వివాహమాడిన  వారిందర్ సింగ్ నిజంగా గట్స్ ఉన్నోడే!

     SOURCE:  http://www.kentonline.co.uk/medway/news/new-life-for-honeytrap-murder-99573/

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!