బాయ్ ప్రెండ్ తో లాడ్జ్ లో కలసి ఉన్న విద్యార్థినిని చెప్పు తీసుకు కొట్టిన కేరళ హైకోర్టు !!?



                      "తెగిడిచిన వానికి తెడ్డే సర్వం " అన్నట్లు ఉంది ఆ విద్యార్థి విద్యార్థినులు చేసిన పని. బహుశా మన తెలుగులో వచ్చిన " చిత్రం " అనే తెలుగు సినిమాను చూసి ప్రేరణ పొందారో ఏమో కానీ ఇద్దరూ కలసి లేచి పోయి ఏకంగా లాడ్జ్ లోనే దుకాణం పెట్టి ఆధునిక పోకడలకు అద్దం లా మారారు . కానీ చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అని చివరకు వారు చేసిన పని వలన కాలేజీ నుండి వెళ్లగొట్టబడడమే కాక , చివరకు ఆ రాష్ట్ర హైకోర్టు తో  చెప్పుతో కొట్టించుకున్నంత పని అయింది. వివరాలు లోకివెళితే :  

    కేరళ లోని చాడాయ మంగళం లో గల మార్ తోమా కాలేజీ అఫ్ సైన్స్ అండ్ టెక్నలాజి లో B.A ఇంగ్లీష్ లిటరేచర్ చదివే ఒక విద్యార్థినికి తన తోటి విద్యార్థి మీద అంతులేని ప్రేమ కలిగింది. దానికి ఆ అబ్బాయి కూడా సరే అనడం తో ఇద్దరూ జాలిగా సహా అధ్యయనం చేయడం మొదలు పెట్టారు.  అమ్మాయికి చట్టప్రకారం పెండ్లి చేసుకునే ఈడు  వచ్చినా , అబ్బాయికి మాత్రం రాలేదు. ఇక సహాధ్యయనం చేస్తూ లవ్ చేసుకుంటున్న వారికి "ప్రేమ లోతులో " ఉన్న మజా ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది కాబోలు , దానికి లేచిపోవడం ఒక్కటే మార్గమని తలచి , ఒక పైన్ మోర్నింగ్ లేచి పోయి త్రివేండ్రం లోని ఒక లాడ్జ్ లో దుకాణం పెట్టేసారు . దానితో అమ్మాయి తల్లితండ్రులు మిస్సిమ్గ్ కేసు పెడితే పోలీసులు వారిని పట్టుకుని తల్లితండ్రులకు అప్ప చెప్పారు. 

   ఇక వీరి ఘనకార్యం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం వారు , వీరి మీద చర్యలు తీసుకోక పోతే కాలేజీ అంతా "సహజీవనం " తో కంపు పుట్టి పోతుందని తలచి వారివురిని , వారి తల్లి తండ్రులను పిలచి విచారణ చేస్తే విద్యార్థి , విద్యార్దిని తాము చేసిన తప్పును అంగీకరించి క్షమాపణ అడిగారు . దానికి  యాజమాన్యం వారు , కాండక్ట్ సర్టిఫికెట్ లో ఏమి రాయకుండా T.C ఇస్తాం , కాలేజీ నుండి వెళ్ళిపోయింది అందుకు వారు అంగీకరించారు . కానీ ఆ తర్వాత వారు జిల్లా కలెక్టర్ గారి దగ్గరకు వెళితే వారిని కాలేజీలో కొనసాగించవలసిందిగా కలెక్టర్ ఆర్డర్ ఇచ్చినా దానిని కాలేజీ యాజమాన్యం ఖాతరు చేయలేదు. దానితో ఆ అమ్మాయి కేరళ హై కోర్టులో ఒక రిట్ ఫైల్ చేసి , తనను కాలేజీలో చదువు కొనసాగించేలా కాలేజీ యాజమాన్యాన్ని ఆదేశించాలని కోరింది . 

      దానితో హై కోర్టు వారు మొదట మానవతా దృక్పధం తో ఏమైనా ఆమె తప్పును క్షమించి కాలేజీలో కొనసాగించే అవకాశం ఇస్తారా అని యాజమాన్యం తరపు లాయర్ని అడిగితే , ఆయన కాలేజీ యాజమాన్యం ని సంప్రదిస్తే , యాజమాన్యం వారు అందుకు ససేమిరా అంగీకరించక తమకు కాలేజీలో డిస్ప్లేయిన్ మైంటైన్ చేయడమే ముఖ్యం అని గట్టిగా అనడం తో హై కోర్టు వారు కేసును విచారణకు స్వీకరించి తమ  తీర్పును ఇచ్చారు . 

                                                                



                                "ఇదేదో మాములు ప్రేమ విషయం కాదు , విద్యార్థులు పెండ్లి చేసుకోవడానికి కాకుండా కేవలం కలసి ఉండడానికి లేచిపోవడం అనే విపరీత నిర్ణయాన్ని తీసుకున్నారు.వారికి తమ జీవితం ఎలా గడపాలి అనే నిర్ణయం తీసుకోవడం లో స్వేచ్ఛ ఉన్నప్పటికీ దానిని చట్టపరిమితులకు లోబడి మాత్రమే  వినియోగించుకోవాలి. లేకుంటే తద్వారా ఏర్పడే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇక్కడ కాలేజీ యాజమాన్యం వారు తమ  క్రమశిక్షణా చర్యలలో భాగంగా వారిని కాలేజీ నుండి పంపించి వేయడం వారినుకున్న అధికార పరిధికి లోబడి చేసిందే . దానిన్ జ్యోక్యం చేసుకోవడానికి జిల్లా కలెక్టర్ కి అధికారం లేదు . కాబట్టి కాలేజీ యాజమాన్య నిర్ణయాన్ని పూర్తిగా సమర్దిస్తూ  ఈ రిట్ కొట్టి వేయడమైనది"  అని   తీర్పును వెలువరించడం తో ఆ అమ్మాయి చర్యను హై కోర్టు వారు చెప్పుతీసుకు కొట్టినట్లు అయింది . 

   కాలేజీలకు వెళ్ళేది చదువుకుని విషయపరిజ్ఞానం పెంచుకోవడానికి తప్పా , సహాధ్యాయులతో కలసి సహజీవనం చేయడానికి కాదు అని, అటువంటి చర్యలను సమాజం ఆమోదించదు అని  ఈ తీర్పు ద్వారా పై కేసులో విద్యార్థిని  విద్యార్థులు లాగా ఆలోచించే వారు గ్రహిస్తే మంచిది . లేకపోతే కాలేజీలు "కో హాబిటేషన్ సెంటర్ " లుగా మారే ప్రమాదముంది . 


Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!