పగ పట్టిన బార్యల హింస నుండి భర్తలను అతని తరపు బంధువులను కాపాడిన సుప్రీం కోర్టు అప్ ఇండియా !


                                                                 

                     బార్యా బాదితులకు నిన్న బుదవారం శుభదినం !. ఎందుకంటె వారికి బారత అత్యున్నత న్యాయస్తానం వారు ఇచ్చిన తీర్పు వరం గా మారి వారిని చాలా కష్టాల నుండి విముక్తం చేయనుంది . అబాగ్యులైన ఆడపిల్లల ను అత్తింటి అరళ్ళ నుండి రక్షించటానికి ఉద్దేశించిన వరకట్న చట్టం ,498 A సెక్షన్లు అసలు ఉద్దేశ్యాలను నెరవేర్చక పోగా , భార్య భర్తల మద్య ఉన్న తగాదాలను అవకాశంగా తీసుకుని భర్తను అతని తరపు బందువులను హింసించడానికి ఉపయోగ పదే విదంగా మారడంతో వీటి మీద ప్రజలలో తీవ్ర వ్యతిరేకత వచ్చింది . నూటికి  96 కేసులలో అరెస్ట్ లు జరిగి భర్తలు వారి తరపు బందువులు జైళ్ళల్లో కి నేట్టబడితే అందులో కేవలం 15%కేసులు మాత్రమే నిజమైనవి అని మిగతావి అన్నీ తప్పుడు కేసులే అని రుజువు అవుతున్నాయి .


                  నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి గణాంకాలు పరిసిలించిన సుప్రీం కోర్టు వారు నిన్న ఒక కేసులో తీర్పును ఇస్తూ , ఇకనుండి దేశంలో 498-A తదితర కేసులలో పోలీసులు ఆటోమాటిక్గా అరెస్ట్లు చేయటానికి వీలులేదని , బార్య పెట్టిన కేసును ఇన్వెస్టిగేషన్ చేసాక అది నిజమని తేలితేనే , అరెస్టుకు కల కారాణాలు వివరస్తూ ఒక రిపోర్ట్ రాసి దానిని మేజిస్ట్రేట్ కు సమర్పించాలని , మేజిస్ట్రేట్ లు కూడా ఆటోమాటిక్ రేమాండ్ ఆర్డర్లు ఇవ్వ కుండా పోలిస్ రిపోర్ట్ ను క్షుణంగా పర్సీలించి , అది సరి అయినదే అని ,నిందితులు బయట ఉండటం వలన సాక్షులు బెదిరింపుకు పాల్పడతారు అని బావిమ్చిన , లేక నిందితులు తప్పించుకుని వేరే ప్రాంతాలకు వెళ్లి పోతారని బావిo చిన కేసులలోనే వారిని రిమాండ్ కు పంపించాలని ఆదేశాలు జారి చేయడం జరిగింది . ఈ ఆదేశాలను బె ఖాతరు చేసిన పోలీసులు , మేజిస్ట్రేట్ లు సైతం క్రమశిక్షణ చర్యలకు గురి అవుతారని హెచ్చరించడం జరిగింది .

                                                         

 
                         

                             మన దేశం లో ఉన్న దౌర్బాగ్యం ఏమిటొ కాని చట్టాలు ఏవి వాటిని వేటి కోసం ఉద్దేసించారో అవి నెరవేర్చక పోగా అమాయకులను హింసించడానికే అవి ఉపయోగ పడుతున్నాయి . అసలు సంసార సమస్యలు తీర్చడానికి చట్టాలను ఉపయోగించడం అంటె "పింగాణి వస్తువుల దుకాణం లోకి ఎద్దును తోలినట్లే " అని న్యాయ పండితులు అంటారు . ఎంతో నేర్పు తో ఓర్పుతో బార్య భర్తలకు కౌన్సెలింగ్ నిర్వహించి వారి సమస్యలు వారు అర్దం చేసుకునేలా చేయాల్సిన వాటిని పోలిసులకు అప్ప చెపితే జరిగిదేమిటి? గుండాలు , రౌడీలు ,ను ఉంచే సెల్ లు, జైళ్ళు లో భర్తలను వారి తరపు బందువులను ఉంచితే , తమ అరెస్ట్ కు కారకురాలైన బార్య పట్ల భర్తకు కాని వారి తరపు బందువులకు కాని ఎటువంటి బావం ఏర్పడుతుంది ? తిరిగి ఆ బార్య అత్తా వారింటితో సాదారణ సంబందాలు కొనసాగిస్తుందా? ఖచ్సితంగా విడాకులు తీసుకుని  వేరు పడటానికి నిరనయించుకున్న బార్యలకు తప్ప పై చట్టాలు సంసారం కొనసాగించాలనుకునే వారికి ఎ మాత్రం ఉపయోగ పడవు .

  ఇన్నాళ్లకు సుప్రీం కోర్టు వారు సెక్షన్ 41 క్రిమినల్ ప్రోసిజర్(7 సంవత్సరాలు అంత కంటె తక్కువ శిక్ష పడే వారికి వర్తింప చేయవలసిన ప్రోసిజర్) ను బార్య బాదితులకు వర్తింప చేయాలని అదేసించటం నిజంగా అమాయకపు భర్తలకు వారి తరపు బందువులకు ఒక వరం లాంటిదే అని చెప్పవచ్చు. అయినా అసలు బామ్మర్దులు గట్టిగా ఉంటె పోలిస్ బామ్మర్దులుతో పని ఏముంటుంది చెప్పండి .ఆడపిల్లకు సహజ రక్షక భటులు పుట్టింటి వారే .  ఏది ఏమైనా సరి అయిన కౌన్సలింగ్ ఇస్తే 90%సంసార సమస్యలు చక్కబడతాయి . ఇదివరకు పెద్దలు స్వలాభం లేకుండా ఆలోచించే వారు కాబట్టి సంసారాలు సజావుగా నడిచాయి . ఇప్పుడు ప్రతిది రాజకీయ నాయకులు , పోలిస్ తో పరిష్కరించాలని అలోచించబట్టే  ఇన్ని అనర్దాలు అని నా అభిప్రాయం

                                      (Republished post. OPD:3/7/2014).
    

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం