ఒక్క రాత్రిలో 2 గాంగ్ రేప్ లు ఒకే స్త్రీ మీద జరగటానికి కారణ మేమిటి?




డిల్లీ లో జరిగిన నిర్భయ ఉదంతం , తద్వారా అమలులోకి వచ్చిన "నిర్భయ" చట్టం అంటే మ్రుగాళ్ళకు అసలు ఖాతరు లేనట్లే అనిపిస్తుంది. అలాగే కొంత మంది స్త్రీలు కూడా జరుగుతున్న  పరిణామాలు గమనించి అయినా తమ జాగర్తలో తాము ఉండటానికి కూడ నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు అనిపిస్తుంది. ఇదే పరిస్తితులు ఇలాగే కొనసాగితే ఖచ్చితంగా అత్యాచార కేసులు ను కూడా  , అవినీతి కేసులు మాదిరి రోటీన్ కేసులు గా బావించే స్తాయికి భారతీయ సమాజం దిగజారిపోతుంది . మొన్న పుద్దుచెర్రిలో జరిగిన జంట గాంగ్ రేప్ కేసులు ఉదంతం విన్నాకా ఇది తద్యం అనిపిస్తుంది.

   పుదుచెర్రిలో ,కరికాల్ అనే ప్రాంతంలో మొన్న క్రిష్టమస్ రోజున ఒక 20 సంవత్సరాల అమ్మాయిని కేవలం గంటల వ్యవదిలో రెండు గాంగ్ లకు చెందిన 7 గురు మ్రుగాళ్ళు రేప్ చేసారట. ఆ అమ్మాయి ఒక కంప్యూటర్    ఫరం లో పని చేసే ఉద్యోగిని అట. ఆ అమ్మాయి తన స్నేహితురాలితో కలసి , ఆ స్నేహిహితురాలు బాయ్ ప్రెండ్ దగ్గరకు వెళ్ళారట. ఆ బాయ్ ప్రెండ్ వయస్సు 17 సంవత్సరాలట. వారు జాలీ గా రాత్రి వేళ  సైట్ సీయింగ్  కి వెళ్లి, అక్కడ అ స్నేహితురాలు తనకు ఒంట్లో బాగో లేదు అంటే , ఆ బాయ్  ప్రెండ్ సిటీలోని తన స్నేహితుడు  ఇంటికి తీసుకు వెళ్ళాడట. అయితే వీళ్లని చాల సేపటి నుండి ఫాలో అవుతున్న 3 గురు వ్యక్తులు ఈ అమ్మాయిని   ఒంటరిగా ఉండటం గమనించి , కిడ్నాప్ చేసారట. ఆమెను ఎవరూ లేని ఏకాంత ప్రదేశానికి తీసుకు వెళ్లి, అక్కడ ఆ ముగ్గురిలో ఒకడు మాత్రమే ఆమెను రేప్ చేసాడట. ఆ తర్వాత ఆ అమ్మాయిని వదలి వేస్తే , ఆమె తన స్నేహితులతో కలసి ఒక సురక్షిత ప్రాంతం లోకి వెళదామని బయలుదేరి  వెళుతుంటే, ఈ  లోపు 7 గురు వ్యక్తులు వచ్చి మరలా ఆ అమ్మాయినే కిడ్నాప్ చేసి తిరిగి జనసంచారం లేని ప్రాంతానికి తీసుకు వెళ్లారట. అక్కడ 7 గురిలో 6 గురు ఆమె మీద అత్యాచారం చేసారట! ఈ  లోపు అమ్మాయికి సంబందించిన స్నేహితులు ఆ గాంగ్ లో ఒక వ్యక్తిని  గుర్తించి   వాడిని తన్నితే   , అది తెలుసుకుని తక్కిన గాంగ్ అంతా వచ్చి, ఈ  స్నేహ బృందానితో   కొట్లాటకు దిగారట. ఆ గొడవతో అక్కడి స్తానికులు పోలీసులకు పోన్ చేస్తే వారు వచ్చి 10 మంది మీద కేసు పెట్టి వారిని అరెస్ట్ చేసారట. అందులో 7 గురు రేపిస్టులు అయితే 3 గురు వారి  స్నేహితులు. స్నేహితులు మీద కేసు పెట్టడానికి క్కారణం పోలీసులకు  రేప్ జరిగిన విషయం గురించి, సమాచారం ఇవ్వనందుకు. 7 గురు రేప్ చేసినా ఆ అమ్మాయికి సీరియస్ గాయాలు ఏమి కాలేదని సమాచారం.

   ఇక  విషయం గురించి మీడియాలలో ప్రసారాలు, ఆందోళనలు మామూలే .   మృగాల్ల మీద నిర్భయ కేసు పెట్టడం తో పాటు త్వరితగతిన  దర్యాప్తు ముగించి కోర్టులో నిందితులకు శిక్షలు వేయించడంతో ప్రభుత్వ బాద్యత
తీరిపోతుంది.ఒక్క రోజో రెండు రోజులో ఆందోళనలు చేయడం తో  సమాజం లోని పౌరుల బాద్యత తీరిపోతుంది. "చీ చీ ఈ  మగవాళ్ళు   లో స్త్రీల పట్ల దృక్పదం లో మార్పు రానంత కాలం , సమాజం లో స్త్రీల పట్ల అత్యాచారాలు ఆగవు" అని మేదావులు ప్రకటనలతో వారి బాద్యత తీరి పోతుంది. మీడియాలలో నాలుగు రోజుల సంచలన  వార్తా ప్రసారాలు చెయ్యడంతో వారి బాద్యత తీరి పోతుంది. కానీ అసలు 17 యేండ్ల కురాడితో ఇద్దరు అమ్మాయిలు ఏ రాచ కార్యాలు వెలగబెట్టడానికి రాత్రి సమయం లో వెళ్ళాల్సి వచ్చింది అని కానీ, మరి ఇద్దరు అమ్మాయిలూ అక్కడ ఉంటే వారిలో ఒకరి మీదే ఎందుకు 2 సార్లు గాంగ్ రేప్ జరిపారు అని కాని, ఆ తర్వాత ఇదే విషయమై పోలీసులకు చెప్పకుండా అమ్మాయి స్నేహితులు డైరెక్టుగా గాంగ్ రేపిస్టులతో  ఎందుకు గొడవపడ్డారు అనేది కాని  ఏ మీడియా చెప్పదు. వీటన్నింటికి కారణాలు తెలుసుకోవలసిన బాద్యత సమాజానికి లేదు.  ఎందుకంటే తెలుసుకుని చేసేది కూడా ఏమి ఉండదు కాబట్టి. మ్రుగాళ్ళకు శిక్షలు వెయ్యడం తప్పా , బాదితులకు బహిరంగంగంగా  జాగర్తలు చెప్పే పరిస్తితిలో  భారతీయ సమాజం లేదు కాక లేదు.


                       ఒక వేళ ఏ పోలిస్ అధికారి కాని , లేక రాజకీయ నాయకుడు కానీ,ఎవరైనా సరే పెద్దమనిషి తరహాలో ఒక మాట సలహాగా చెప్పినా వినే స్తాయిలో యువత లేదు. మొన్నీ  మద్య హైదరాబాద్లో గోల్కొండ పోలిస్ అధికారి ఒకాయన ప్రేమల పేరుతో పబ్లిక్ ప్లేస్ లను కంపు చేస్తున్న జంటలను , కేసులు పెట్టి వారి జీవితాల మీద మచ్చ వేయటం ఎందుకనే సదుదేశ్యంతో కావచ్చు, లేక ఒక తండ్రిగా ఆలోచించి కావచ్చు, వారితో గుంజీళ్ళు తీయించి  వదిలేస్తే మీడియా మొత్తం గగ్గోలు పెట్తీంది. కానీ దాని గురించి చర్చా కార్యక్రమం నిర్వహిస్తే చాలా మంది ఆ మాత్రం బయపెట్డ్డడం తప్పు లేదనే చెప్పారు. కాబట్టి తమ మనసుల్లో ఉన్న దానిని ప్రజలు  కూడా  చెప్పలేని పరిస్తితిని  కొంతమంది సోకాల్డ్ మేదావులు మీడియా రంగం ద్వారా కల్పిస్తున్నారు. పై కేసులో ఆ అమ్మాయి రేప్ కి గురి కావటానికి , చీకటి పడినాక షికారు చేస్తున్నా బాయ్ ప్రెండ్ , గర్ల్ ప్రెండ్స  ని  గోల్కొండ పోలిస్ వారి లాగా   మందలించే వారు లేకపోవడం కూడా ఒక కారణం కావచ్చు. కీడు జరిగాక గగ్గోలు పెట్టె కంటే , దాని నివారణకు అన్ని రకాల చర్యలు తీసుకోవడమే ఉత్తమం.

  గోల్కొండ పోలిసులు చేసిన పనిని ఈ  క్రింది వీడియోలో చూడవచ్చు.
                                                                   
 (Republished post.OPD:27/12/2013)

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!