షూలో రహస్య కెమెరాను అమర్చుకొని మహిళల అసభ్యకర దృశ్యాలను తీసున్న న్యాయవాది ఆశిష్ శర్మ !!
మానసిక రోగాలు రక రకాలు. ఒక గొప్పింటి కోడలు గారికి బట్టల కొట్లో బ్రాసరీలు కాజేసే మానసిక సమస్య ఉందిట. నిజానికి ఆమె గారు కోరుకుంటే లక్షలు పోసి అయినా కావలసిన బట్టలు కొనుకో గలదు . కానీ అలా లక్షలు విలువ చేసే బట్టలు కొనేటప్పుడు కలిగే అనందం కంటే దొంగతనం చేసి చిన్న బ్రాసరీ ని పొందడం లోనే ఆమెకు అమితానందం కలిగిస్తుంది అట. ఇలా ఒక రోజు షాపింగ్ చేస్తూ తన కున్న దొంగబుద్ధిని బయటపెట్టుకుని పదిమందిలో పరువు పోగొట్టుకుంది ఆ మంత్రి గారి కోడలు.
అలాగే కొంతమంది మగవాళ్ళకి స్త్రీలు దుస్తులు మార్చుకుంటుంటే తలుపు సందులు లోనుండి చూస్తూ ఆనందించే జబ్బు ఉంటుంది. ట్రయల్ రూములలో బట్టలు మార్చుకునే స్త్రీల ను రహస్య కెమెరాల ద్వారా ఫొటోలు తీసి వాటిని చూస్తూ ఆనందించే అలవాటున్న ఒక లాయర్ తను చేసే పాడు పని పదిమందికి తెలియకుండా ఉండడం కోసం ఎలాంటి ఏర్పాటు చేసుకున్నాడో చుస్తే ఆశ్చర్యం తో పాటు అసహ్యం కూడా వేస్తోంది. ఇటీవల, షూలో రహస్య కెమెరాను అమర్చుకొని మహిళల అసభ్యకర దృశ్యాలను తీసున్న న్యాయవాదిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఆశిష్ శర్మ అనే 34 ఏళ్ల లాయర్ తన షూలో కెమెరాను ఏర్పాచేసుకున్నాడు. అనంతరం పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ కు వెళ్లేవాడు. అక్కడ ట్రైయల్ రూంలో మహిళలు దుస్తులు మార్చుకుంటుండగా, కెమెరా ఉన్న షూను ట్రైయల్ రూం తలుపుకిందకు కొద్దిగా పోనిచ్చేవాడు.దీంతో రూంలో ఉన్న మహిళల దృశ్యాలు కెమెరాలో రికార్డు అయ్యేవి. ఈ క్రమంలో ఓ షాపింగ్ మాల్ లో ఇదేవిధంగా చేస్తుండగా గమనించిన మేనేజర్ ఆ లాయర్ ను పట్టుకున్నాడు. అనంతరం అతన్ని సెక్యూరిటీ గార్డులు సోదా చేయగా షూలో కెమెరా కనబడింది. ఈ సమాచారాన్ని వారు వెంటనే పోలీసులకు అందించగా వారు వచ్చి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి దగ్గర నుంచి 12 మహిళ అసభ్యకర చిత్రాలతో పాటు. లాప్‌టాప్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు హర్యానా వినియోగదారుల వేదిక మాజీ అధ్యక్షుడు కుమారుడని, అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.అట్టి ఫొటోలు అతను తన మానసిక అనందం కోసం తప్ప ఇతరత్రా ఎక్కడా వినియోగించలేదని శర్మ పోలీసులకు తెలిపాడట. అయినా సర్రే అది స్త్రీల మానాభిమానాలకు సంబంధించిన ఇష్యు కాబట్టి సెక్షన్ 354 సి అండ్ డి క్రింద కేసు బుక్ చేశారు.
కాబట్టి ఎవడి పిచ్చి వాడికి అనందం కావచ్చేమో కానీ , సదరు పిచ్చి ఇతరులను ఇబ్బంది పెట్టనంత వరకు ఓ.కే. లేకుంటే పిచ్చి ఆసుపత్రిలోనో , లేక జైలులోనో గడపాల్సి వస్తుంది.
సోర్స్ : http://www.thehindu.com/news/cities/Delhi/advocate-caught-using-spy-camera-at-mall/article7696394.ece
Comments
Post a Comment