డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి సంబందం ఏమిటి"?

                                                                             
ఇది ప్రసిద్ద డన్ లప్ టైర్ల కంపెనీ వారి ఏడ్.నాదొకటే సూటి ప్రశ్న? "డన్ లప్ టైర్ కి అమ్మాయి హెయిర్ కి 

సంబందం ఏమిటి"?
         
                        చూశారా! ఇదివరకు నేను చెఫ్పినట్లు,"న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి" అని మనువు మనుస్మ్రితిలో రాశాడని, ఈనాటివరకు స్త్రీవాదులు, అబ్యుదయవాదులు,నానారకాలుగ విమర్సిస్తున్నారు. ఈ మద్య ఒకయాన ఐతే ఏకంగా పచ్చిగ్గా బూతులు తిడుతూ తన బ్లాగ్లో టపా పెట్టాడు.ఏది ఎమైనా మనుస్మ్రుతి అనేది ఇతర మత గ్రందాల లాగ మార్చడానికి వీలు లేని పవిత్ర గ్రంథం కాదు. ఈ విషయాన్ని మన పూర్వీకులే చేప్పారు.ఎప్పుడు మనుస్మ్రుతి సమాజాంలోని మర్పులకు అనుగుణంగా ఉండదో అప్పుడు మనుస్మ్రుతిని సవరణ చేయవచ్చు.అంటే మన రాజ్యాంగ సవరణలు లాగ. కాకపోతే ఇలా  సవరణలు చేసే అధికారం మాత్రం తిరిగి మనవు కే ఉంటుంది. అందుకే మన పురాణాలలో 14 మంది మనవులు ఉంటారని చెప్పారు.ఈ మనువులు మన్వంతరంనకు ఒకరు జన్మిస్తూ,మనుస్మ్రుతిని సవరణలు చేసి సమాజానికి అందిస్తుంటారు. ఏ వాదమైనా ఎల్లకాలం అనుసరనీయం కాదు. కాబట్టి మార్పులు అనివార్యం. కాబట్టి మనుస్మ్రుతి దోషాలను మనవే సరిచేస్తాదు. మరి యే ఇతర మతాచారాలను  అనుసరించాల్సిన దౌర్భాగ్యం మనకు లేదు.ఏదో అప్పట్టి పరిస్తితులు అంటె కొంతమంది దేవత స్త్ర్రీలు అని చెప్పబడినవారు తమ ఇచ్చానుసారం చరిస్తూ,ఎవరికి పడితే వారికి, పిల్లల్ని కని పారేసి, వాళ్లని పట్టించోకోకుండా,వదిలి వెళ్లే రోజుల్లొ రాసిన గ్రంథం అది. ఆ తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్ట్లు వారు ప్రక్షిప్తం చేసారు. దీనిని గూర్చి తర్వాత మాట్లాడుదాం .


   ప్రస్తుత విషయం ఏమిటంటే, సరే, మన దేశంలో మనువు వల్ల స్త్రీ వికాసం జరుగలేదు. మరి ఇతర దేశాలలో స్త్రీలు మన వారికంటే అభ్యుదయులుగా ఉన్నారా? చెప్పండి. కేవలం వ్యాపార అవసరాలకు పనికి వచ్చే ఒక భోగ వస్తువుగా,ప్రపంచం అంతట ఈనాడు స్త్రీ పరిగనించబడుతుంది మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. అవి చూసిన తర్వాత ఇటువంటి స్వేచ్చ కోసమే మనువుని ఆడిపోసుకుంటున్నది అని ఎవరైనా బావిస్తే మనుస్మ్రుతిని మార్చాల్సిన అవసరం లేదంటాను.    

ఇది మహిళా పోలిస్ దుస్తుల కోసం ఒక కంపెనీ వారు ఇచ్చిన ప్రకటన. అబ్యుదయమంటే  అంటే ఇలా స్త్రీలను అర్థ నగ్నంగా(ఏమి మిగిలిందిలే ఇంక చూపించాడానికి) చూపించి సొమ్ములు చేసుకోవడమా? 
             ఇది ఒక మోటర్ సైకిల్ కంపెని వారి ప్రకటన . ఏమండీ ఈ ప్రకటన చూస్తున్నవారికి  మోటర్   సైకిల్కంటే    అమ్మాయే అమ్మకపు సరుకులాగుంది.
                                                                 ఇదీ అటువంటిదే. 

                                                                            
బరువు తగ్గే మందుల ప్రకటనల్లో 

  


బీరు ప్రకటనల్లో ఎంత నీచంగా చిత్రీకరించారో 




గడ్డాలు గీసుకునే బ్లేడు ప్రకటనలకు కూడా స్త్రిలైనా? 





జంతు సంరక్షకులకి కూడా ఆడదంటే అలుసే మరి!

సూట్ ప్రరాచారాలకి సూట్ అయినదేనా ఇది? 


                                                      
   ఇదీ వ్యాపార సంస్క్రుతి అసలు స్వరూపం.పురుషుడికి అవసరమైన బోగ వస్తువులు మందు, మగువ. ప్రపంచ వ్యాప్తంగ ఈద్రుక్పదంలో మార్పు లేదు.
                                                                                       కాబట్టి  మనువు చెప్పినా చెప్పక పోయిన,స్త్రీ బోగ వస్తువు గానే పరిగనించబదుతుంది అనేది నిర్వివాదాంశం. కాబట్టి తమ స్త్రీలను కాపాడుకోవడం  నిజమైన పురుషుడి ప్రదాన బాద్యతలో ఒకటి. అలాంటి ఉద్దేశ్యం తో చెప్పబడిందే మనుస్మ్రుతి లోని ఆ శ్లోకం. కాని అదే మనువు"యత్ర నార్యంతు పూజ్యతే,తత్ర రమయతి దేవతా" అంటాడు. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబదతారో అక్కడ దేవతలు కాపురముంటారు  అని అర్థమ్. కాబట్టి  కుటుంబ అభివ్రుద్ది కాంక్షించె వాడు,కుటుంభంలో తల్లిని, చెల్లిని,బార్యని, కూతుర్ని అజ్నానంగా, అద్వాన్నంగ,ఉంచాలని అనుకోడు. కొన్ని ప్రత్యేక కారణాలు స్త్రీలను బోగ వస్తువులుగా మార్చి వేయగా, పురుషులకు తమ స్త్రీలను కాపాడడం బారంగ పరిణమించి కొన్ని కట్టుబాట్లు ఏర్పరిస్తే, కాలాంతరంలో అవి దురాచారాలుగ మారాయి. దానికి మనువు కాదు కారణం.

                       ఏనాడైతే మానవ పునరుత్పతికి( సంతానానికి)మాత్రమే జరపాల్సిన సెక్స్, కామ క్రీడ గ మార్చి, తరచూ ఆనందిచడం మొదలు పెట్టారో మానవులు, ఆ నాడే స్త్రీ తన ఔన్నత్యం కోల్పొయి, రాను రాను బోగ వస్తువుగా మారిపొయింది. బలవంతుడు బలహీనుడిని అణచడమనేది ప్రక్రుతి దర్మం. దీనిని మానవుడు జ్నానం చేతనే అదిగమించాలి. అందరికి ఆ జ్నానం కలిగేదాక కట్టుబాట్లు తప్పవు.  

                                        (Republished post . 27/09/2012)                           

Comments

  1. అచ్చు తెలుగు పుస్తకాలకు ప్లీజ్ visit :

    http://www.logili.com/

    మీకు బాగా నచ్చిన పుస్తకాల గూర్చి మీ అభిప్రాయాలను,
    రివ్యూ లను వ్రాసి ఈ మెయిల్ అడ్రస్ కు పంపించండి
    review@logili.com
    నచ్చిన రివ్యూ లను మీ పేరు లేక మీ కలం తో ప్రచురింపబడును.

    ReplyDelete

Post a Comment

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!