మనశ్శాంతి కోసం "మతం", సమాజ క్రాంతి కోసం సైన్స్ , రెండూ అవసరమేనని నమ్మిన గొప్ప సైంటిస్ట్ "A P J అబ్దుల్ కలాం " గారు !!

                                                                                 

                                       

                                            ఒక వాహనం నడవాలంటే ఇందనం ఎంత అవసరమో , ఆ వాహనం లో చలనం వలన పుట్టే ఘర్షణ నుంచి రక్షింపబడాలంటే "కందెన " కూడా అంతే అవసరం . వాహనం లో ఇంజిన్ ఆయిల్ లేకుండా నడిపితే , కోట్ల విలువ చేసే దైనా మండి పోవడం ఖ్హాయం. అలాగే మనిషికి కూడా , తన నిత్య జీవన గమనానికి సైంటిఫిక్ ఆలోచనా విదానం ఎంత అవసరమో , తన ప్రశాంతత కోసం మత విదానాలు అంతే అవసరం. రోజూగంట సేపు చేసే  ద్యానం , యోగ , దేవుని పూజ, నమాజ్, ప్రేయర్  ఇలాంటి వన్నీ మనసును చల్లపరచి , రోజంతా ఆ మనిషిని బ్యాలెన్స్ మైండ్ తో నిర్ణయాలు తీసుకుంటు ముందుకు సాగే లా చేస్తుంది . వాహనానికి కూడా అంతే కదా! కొంచం కందెన తో చాలా ఇందనం తో బండి ప్రశాంతంగా సాగిపోతూ ఉంటుంది. కందెన ఎక్కువైతే బండి స్టార్ట్ కాదు. అసలు కందెనే లేకుంటే వాహనమే మిగలదు. మత విశ్వాసాలు  కూడా  అంతే  ఎక్కువైతే మూడ విశ్వాసాలు గా మారి మనిషి గమనానికి  అవసరమైన జ్ఞానం లోపిస్తుంది. అసలు లేక పోతే  బుర్ర వేడెక్కి తీవ్ర వాదిగా మారుతాడు.

                                                                           

     ఇదంతా ఎందుకు చెపుతున్నాను అంటే , మన సమాజంలో శాస్త్రీయ జ్ఞానులు అని చెప్పుకునే కొంత మందిలో ఒక అపోహ ఉంది. మత విదానాలు , లేక దేవుని పై విశ్వాసం ఉన్న వారు శాస్త్రీయ దృక్పదం లేని అజ్ఞానులు అని , వారు సైన్స్ తెలిసిన మూర్కులు అని అనుకుంటుటారు. కాని వారి ఆలోచనలు తప్పు అని నిరూపించారు మన దేశపు సైంటిస్టులు. దీనికి ప్రబల సాక్ష్యం రాకెట్ లు అంతరిక్షం లోకి పంపే షార్ కేంద్రం లో ఉన్న "చెంగాలమ్మ తల్లి " గుడి . ఆ తల్లికి మొక్కందే షార్ శాస్త్రజ్ణులు రాకెట్ లాంచింగ్ కార్యక్రమాలు చేపట్టరు. అలాగే మన వెంకటేశ్వర స్వామీ దీవెనలు ఉంటే తమ ప్రయోగాలు 100 %సక్సెస్స్ అని నమ్మే సైంటిస్టులు ఉండడం వారిలోని బ్యాలెన్సింగ్ మైండ్ కు నిదర్శనమ్.

     అలాగే మన దేశ కీర్తి పతాకాలను వినువీదుల్లో రెప రెప లాడించిన ది గ్రేట్ సైంటిస్ట్ A P J అబ్దుల్ కలాం గారు కూడా పై సిదాంతం నమ్మడం వలననే అయన ఎంతో సౌమ్యుడిగా , అందరి మన్ననలు పొంది వివాదరహితుడిగా ఉండడమే కాక ,పేపర్  బాయిగా జీవిత ప్రస్తానం ప్రారంభించి , ప్రపంచం లోనే అత్యున్న శిఖరాలు చేరుకున్న వారి జాబితాలో చోటు సంపందించారు. పదిమందికి పనికి వచ్చే జ్ఞాన బోద చేయడం ప్రవక్తల లక్షణమైతే అయన ప్రపంచంలో మొదటి "సైంటిఫిక్ ప్రవక్త " అని చెప్పవచ్చు. చివరకు విద్యార్దులకు  జ్ఞాన బోద చేస్తూనే తుది శ్వాస విడవడం తో అయన జన్మ సార్దకమైంది.

     మత విశ్వాసాలను  కాదన్న మాత్రం చేత  గొప్ప సైంటిస్ట్ ఎలా కాలేడో , మత విశ్వాసాలను పాఠి చినంత మాత్రానా గొప్ప సైంటిస్ట్ కాకుండా పోజాలరు. ఒక విదంగా సైంటిస్ట్ లకు కూడా ప్రశాంత చిత్తం కావాలంటే ఏదో ఒక నమ్మక్కం కలిగి ఉండడం  మేలు చేసే చర్యే కాని, హాని చేసేది కాదని కలాం గారి జీవితం రుజువు చేసింది. మొన్న గుండెపోటుతో మరణించిన అబ్దుల్ కలాం గారికి ఈ  రోజున అయన స్వ స్తలం రామేశ్వరం లో ప్రధమ వర్థంతి సందర్భంగా 7 అడుగుల అయన గారి కాంస్య విగ్రహాన్ని కేంద్ర మంత్రులు ఆవిష్కరించారు . శ్రీ కలాం గారి స్మృత్యర్థం ఒక ప్లానేటరి , లైబ్రరీ ఏర్పాటుచేయబోతున్నారు  . భగవంతుడు ఆ మహా మనిషి కి ఆత్మ శాంతి కలిగించాలని కోరుకుందాం. అయన మనమధ్య లేకపోవటం  జాతికి తీరని లోటు అయినప్పటికీ సదా అయన చూపిన మార్గం లోనే మనం నడవడం ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి .  అబ్దుల్ కలాం జీ అమర్ రహే !



Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!