'సారా టెక్ ' పల్లెలు , హై టెక్ సిటీలు , ఇవేనా బంగారు తెలంగాణా , సింగపూర్ సిమాంద్ర !?
ఎన్నికల సీజన్ వచ్చింది . దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఒక పార్టి లో నుండి మరో పార్టి లోకి "జంపింగ్ "లు చేస్తుంటే అ యా పార్టి నేతలకు వీరావేశం పొంగి పొర్లుకు వస్తుంది . అ ఆవేశం లో ప్రజలకు వాగ్దానాల వరాలు కురిపిస్తున్నారు . తెలంగాణా నాయకులు ఏమో "బంగారు తెలంగాణా " మాతోనే సాద్యం అంటుంటే , సిమాంద్ర నాయకులు "సింగపూర్ సిమాంద్ర " చూడరా బాబూ అంటూ బై స్కోప్ చూపిచేస్తున్నారు . చాలా సoతోషం కాని హై టెక్ నగరాలు గురించి మాటలను కోటలు దాటిస్తున్న ఈ సో కాల్డ్ రాజకీయ విరులు , పల్లెల్ని కబలించి, ప్రజల ఆరోగ్యాల్ని , ప్రాణాలను దారుణంగా హరిస్తున్న " సారా రాక్షసి " గురించి ఒక్క మాట మాట్లాడరే !దానిని నిర్మూలన చేసే మగాడు , ఒక్కడు అంటే ఒక్కడైనా తెలుగు నాట ఉన్నాడా ? ఖచ్చితంగా లేడు . ఉన్నా వాడు మాట్లాడడు . మాట్లాడితే...