'సారా టెక్ ' పల్లెలు , హై టెక్ సిటీలు , ఇవేనా బంగారు తెలంగాణా , సింగపూర్ సిమాంద్ర !?

                                                                     

ఎన్నికల సీజన్ వచ్చింది . దిక్కుమాలిన రాజకీయ నాయకులు ఒక పార్టి లో నుండి మరో పార్టి లోకి  "జంపింగ్ "లు చేస్తుంటే అ యా పార్టి నేతలకు  వీరావేశం పొంగి పొర్లుకు వస్తుంది . అ ఆవేశం లో ప్రజలకు వాగ్దానాల వరాలు కురిపిస్తున్నారు . తెలంగాణా నాయకులు ఏమో "బంగారు తెలంగాణా " మాతోనే సాద్యం అంటుంటే , సిమాంద్ర నాయకులు "సింగపూర్ సిమాంద్ర " చూడరా బాబూ అంటూ బై స్కోప్ చూపిచేస్తున్నారు . చాలా సoతోషం కాని హై  టెక్ నగరాలు గురించి మాటలను కోటలు దాటిస్తున్న ఈ  సో కాల్డ్  రాజకీయ విరులు , పల్లెల్ని కబలించి, ప్రజల ఆరోగ్యాల్ని , ప్రాణాలను దారుణంగా హరిస్తున్న " సారా రాక్షసి " గురించి ఒక్క మాట మాట్లాడరే !దానిని నిర్మూలన చేసే మగాడు , ఒక్కడు అంటే ఒక్కడైనా తెలుగు నాట ఉన్నాడా ? ఖచ్చితంగా లేడు . ఉన్నా వాడు మాట్లాడడు . మాట్లాడితే వారి పార్టికి వచ్చె వోట్లు రావు కనుక!

   నిజంగా ప్రజల జీవన విదానం ఎలా ఉందొ తెలుసుకోవాలంటే పల్లెలకు వెళ్లి చూడండి . ముక్యంగా విద్యా గందం లేని షెడ్యూల్డ్ కులాలు , తెగలు వారు , వెనుక బడిన వర్గాల వారు అజ్ఞానంతో వారి కుటుంబాలను సర్వ నాశనం చేసుకుంటుంటే , వారికి మద్యం మాన్పించటం ఎలాగో అలోచిచని వారు , బంగారు తెలంగాణాలు , సింగపూర్ సిమాంద్ర లు తెస్తారట !నిన్న ఖమ్మం దగ్గర గ్రామంలో జరిగిన ఈ  సంఘటన చూసాక మన గ్రామ ప్రజల బవిష్యత్ ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది . 

   ఖమ్మం జిల్లాలోని పాలేరు గ్రామంలో ఒక చర్చి వెనుకాల పుసులూరి రాజయ అనే వ్యక్తీ తాత్కాలిక నివాసం ఉంటున్నాడు . ఆతను టాంకర్ డ్రైవర్ ల వద్దనుండి పెట్రోల్ , డీసెల్ ను తక్కువ ధరకు కొని ఎక్కువకు అమ్ముకునే దొంగ బిసినేస్స్ చేస్తున్నాడు . ఆతను నిన్న   ఒక డ్రైవర్ నుంచి" మిదనాల్ " అనే రసాయనం కొన్నాడట .ఈ   మిదనాల్   అనే దానికి నీరును కలిపితే అది అల్కాహళ్ గా పని చేస్తుందట . అయితే నీటి నిష్పత్తిలో ఎ మాత్రం తేడా వచ్చినా అది ప్రాణాలను హరించి వేస్తుంది . అoతే కాదు అసలు అలాంటి కృత్రిమ ఆల్కాహాల్ ప్రజల ఆరోగ్యం మిద తీవ్ర మైన దుస్ప్రబావాలు చోపుతుoదట. కాని చిప్ లిక్కర్ కూడా కొనుక్కోలేని పేద వారికి ఈ మిదనాల్ లిక్కరే గతి అట . 
   అటువంటి మిదనాల్ లికర్ని రాజయ్య   తను సేవించినంత , సేవించి మిగతాది పాలేరు S T కాలనీలో , దగ్గరలో ఉన్న హబ్యా తండాలో అమ్మాడట . అంతే ! దానిని తాగిన 15 మందిలో 5 గురు చనిపోగా మిగతా వారి పరిస్తితి విషమంగా ఉందట !. చనిపోయిన వారిలో రాజయ్య తో పాటు 3 గిరిజిన స్త్రీలు ఉండటం ఆందోళన కలిగించే విషయం . ఇక ఈ విషయం మిద రాజకీయ నాయకులు, అధికార్లు  కొంత   హడావుడి చేసి , ఎవరో ఒకరి మిద కేసులు పెట్టి మమ అనిపిస్తారు . ఆ  తర్వాత అంతా  మామూలే ! ఇది ఒక పాలేరు గ్రామ పరిస్తితి  మాత్రమె అయితే పెద్దగా పట్టించుకోవలసిన పనిలేదు . కాని గత పదేళ్లుగా  తెలంగాణా గిరిజన గ్రామల  మరణాల రికార్డులు పరిశిలిస్తే అందులో ఎక్కువ శాతం మద్యం మరణాలే. ప్రజలులో ఎక్కువశాతం మందిలో  జివ కాంతులు లేవు . ఇదే పరిస్తితి సిమాంద్ర లో కూడా ఉండవచ్చు . ప్రజల సంపాదన లో అదిక బాగం సారా కి , దాని వలన కలిగే రోగాలకే ఖర్చై పోతుంటే వారి జీవన ప్రమాణం ఎలా మేరుగవుతుందో, బంగారు తెలంగాణా కాని , సింగపూర్ సిమాంద్ర కాని ఎలా సాధ్య పడుతోదో  విర నాయకులు చెప్పాలి . 

  మద్యం మిద ఆదాయంతో  ప్రబుత్వాల్ని నడపే రాజకీయ నాయకులకు , ఆడపిల్లలను తార్చి బ్రతికే బ్రోకర్లకు పెద్ద తేడా ఏమి లేదు . వారికి కావాల్సింది ఆరోగ్యాలు , మానాభిమానాలు కాదు. కేవలo  వ్యాపారం .ఒక అంచనా ప్రకారం రాష్ట్రానికి మద్యం ద్వారా లభించే ఆదాయం 15,000 కోట్లు అయితే ,కలిగే ఆరోగ్య నష్టం 16,000 కోట్ల పై చిలుకే నట . మరి ఇటువంటి మద్యం అమ్మకాలు రాష్ట్ర ప్రబుత్వానికి అవసరమా? అటువంటి అమ్మకాలను ప్రోత్సాహించే   ఇటువంటి రాజకీయ వ్యవస్థ మనకు అవసరమా ? ఒక సారి ఆలోచించండి !  

       

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

మొగుడ్ని కొట్టి మొగసాల కెక్కడమంటే, ఇదే మరి !

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!