మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర తెలుస్తుoది అన్నట్లుంది సిమాంద్ర సమైక్యత సంగతి!

                                                   
  

అరె రే ! ఎన్ని మాటలు చెప్పారు ! తెలంగాణా విడిపోతే తెలుగుజాతి ఐక్యతే పోతుంది అన్నారు . తెలంగాణా విభజన వాదులు తెలుగు జాతిని చిలుస్తున్నారు అన్నారు . తెలుగు జాతి సమైక్యంగా ఉండాలని 2 నెలలు పైగా సమ్మె  చేసారు . ఆంద్ర ప్రదేశ్ ను విడదిస్తే తమ తడాఖా డిల్లికి చూపిస్తాం అని ప్రగల్బాలు పలికారు . తమకు జెండాలు , ఎజెండాలు ఏమి లేవు , సమైక్యతా ఒకట్టే తమ ఎజెండా అని రాష్ట్ర విభజన ప్రకటించక ముందు సమైక్యా రాగాలు తీస్తుంటే దేశం అంతా  నిజమే అనుకుంది . సిమాంద్ర లోని తెలుగు ప్రజలు ఉప్పెనలా కధలి వస్తుంటే రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో ఉప్పొంగిన సమైక్యతా బావం ఇది అని నా లాంటి అమాయకులు అనుకున్నారు . కాని అది అంతా  ఉత్తిదె అని ఇటివలి పరిణామాలు చూచిస్తున్నాయి .

  మంచి వాడి సంగతి మాంసం కూర దగ్గర  తెలుస్తుoది అన్నట్లుంది సిమాన్ద్రులలో సమైక్యత  సంగతి .ఆంధ్రులు ఆరంభ శూరులు అనే దానిని మరో సారి రుజువు చేస్తున్నారు సిమాంద్ర నాయకులు, వారిని అనుసరిస్తున్న ప్రజలు. తెలంగాణా విభజన జరుగక ముందు , కాంగ్రెస్ , తెలుగు దేశం , రెండు పార్టిలే ఉండేవి . పరాజ రాజ్యం వచ్చినా దానిని పెద్దగా ఆదరించలేదు కాబట్టి అది కూడా కాంగ్రెస్ లో కలిసి పోయింది . ఇప్పుడు విభజన తేది ప్రకటించాక అదే సిమాన్ద్రాలో 4 పార్టీలు అయ్యాయి . రాజకీయ నాయకులు సమైక్యత నిన్నాదాన్ని  చాప చుట్టి బాహాటంగా రాష్ట్ర విభజనను సమర్దించిన పార్తిలలోకి జంప్ అయి పోతున్నారు . ప్రజలు కూడా వారు నిర్వహిస్తున్న సభలకు వేలాదిగా తరలి వస్తున్నారు . వీరిని చూసి  అ పార్టి గెలిస్తే తమకు నష్టం కలుగుతుంది అనుకున్న వారు, తమ సామాజిక ఓట్లను చీల్చి సదరు పార్టి బలపడకుండా చూడాలని , పెద్ద పెద్ద డైలాగులు రాయించుకుని మరి రంగంలోకి దిగి పోతున్నారు . ఇలా సిమాంద్ర రాజకీయం నాలుగు  ముక్కలవుతుంటే , వీరిలో సమైక్యతా ఉందని ఎవరిని నమ్మించగలరు ? విభజన అయినా , సమైక్యతా అయినా అంతా రాజకీయ నాయకుల కోసమే అనేది స్పష్టంగా అర్ధమవుతుంది .

నేను ఈ  విషయంలో తెలంగాణా వారిని అనవలసింది ఏమి లేదనే బావిస్తున్నాను. ఎందుకంటే విడిపోతేనే బాగు పడతాం అని వారి ప్రగాడ నమ్మక్కం . అది నిజమా కాదా అనేది తేలాలంటే కొంత సమయం పడుతుంది . కాని సిమాంద్ర ప్రజల సంగతి ఏమిటి? ఎందుకు వారిలో సమైక్యతా లేకుండా పోయింది? ఒకే ఒక పార్టీ జెండా క్రింద ఎందుకు ఏకం కాలేక పోతున్నారు? . నాయకులు ఒకరి నొకరు దుమెట్టి పోసుకుంటుంటే , వారిలోని అనైక్యతకు "చీ " కొట్టలేని ప్రజలకు సమైక్యత గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా? తక్కెట్లో కప్పలు లాగా నాయకులు ఆ పార్టి లోంచి ఈ పార్టీలోకి , ఈ పార్తిలోంచి అ  పార్టీలోకి జంప్ లు చేస్తుంటే వారిని ఎంకరేజ్ చేస్తూ , వారు పెట్టె సభలకు వేలం వెర్రిగా వెళ్తున్న ఈ ప్రజలకు తెలుగు జాతి అభిరుద్ది గురించి ఆలోచన ఉందా? రోత పుట్టడం లేదా ఈ దిగజారుడు రాజకీయాలు చూసి ? డిల్లీలో పెద్దలకు స్పష్టంగా తెలుసు. ఆంధ్రులు ఆరంభ శూరులు అని . అందుకే వారు అంత  సాహసం చేసారు . రేపు కాంగ్రెస్ కి ఓట్లు పడినా పడకపోయినా , తెలుగుజాతిలో సమైక్యతా లేదు అనేది మాత్రం ఈ  ఎన్నికల వలన దేశానికి వెల్లడవుతుంది .

.

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

'స్వామీ నిత్యానంద' రాసలీలలు మీద నానా యాగీ చేసిన పెయిడ్ మీడియాకు , 'మౌల్వి కమరుద్దిన్' కామలీలలు కనపడలేదా?!!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!