ఇక నుంచి ఖమ్మం లో 10,000 విలువ చేసే వస్తువు విజయవాడలో 8,000 అట!

                                                           


జై తెలంగాణా అని పదేళ్ళు పోరాడినందుకు తెలంగాణా వారికి "హైదరాబాద్ సహిత" తెలంగాణా ప్రసాదించినందుకు మేడం సోనియాను వేనోళ్ళ కిర్తిస్తున్నారు తెలంగాణా రాజకీయ నాయకులు . కొందరైతే ఏకంగా ఆమెకు గుడులు కట్టి రోజువారి పూజలు చేయాలని కూడా పిక్స్ అయి పోయారు . కాని ఇన్నాళ్లు పోరాడినందుకు   పాడి ఆవు  తెలంగాణా కు దక్కినా , పాల రేట్లు మాత్రం సిమాంద్ర కు తగ్గిoచడo వలన దాని ప్రబావం తెలంగాణా మార్కెట్ ను నిర్వీర్యం చేయక మానదు అని పిస్తుంది . అది ఎలాగో చూదాం .

   ప్రజలు ఇంటి ఆవసరాలు కు వాడే వస్తువుల మిద సెంట్రల్ గవర్నమెంట్ టాక్స్ విదిస్తుంది . ఉదాహరణకి ఒక టెలివిజన్ ను మనం 10,000 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తే , దానిలో సుమారు 1200 రూపాయల నుంచి 1400 రూపాయల దాక సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ కె పోతుంది . అలాగే ఇంకా చిన్నా చితక , అన్ని కలిపి సుమారు రెండు వేల దాక కేంద్ర ప్రబుత్వం వారికి కట్టాల్సి ఉంటుంది . ఇది డైరెక్టుగా వినియోగ దారుడు కట్టక పోయినా, పంపిణి దారులు వస్తువు రేటుల లోనే అది వసూలు చేస్తారు కాబట్టి అంతిమంగా వినియోగ దారులు మిద పడే బారమే అది . మరి అటువంటి T.V.  కి ఒక వేళ సెంట్రల్ ఎక్సైజ్ టాక్స్ లేకుండా పొతే , వినియోగ దారుడికి 8000 రూపాయలకే అమ్ముతారు కదా  . మీ ఊళ్ళో వక వస్తువు 10,000 రూపాయలకు అమ్ముతుంటే , అదే వస్తువు పక్క ఊరిలో 8,000 వేలకే అమ్ముతుంటే  మీరు ఎక్కడ కొంటారు ? ఖచ్చితంగా పక్క ఊరికే వెళ్లి కొంటారు కదా ! దానివలన మీ ఊరి షాపుల్లో వ్యాపారం చాప చుట్టుకు పోయినట్లే కదా ! అదే జరుగబోతుంది తెలంగాణా వస్తు మార్కెట్ కి !

   తెలంగాణాకి హైదరాబాద్ ఇచ్సెసినందుకు నష్ట పరిహారంగా సిమాంద్ర రాష్ట్రానికి ప్రత్యెక ప్రతిపత్తి హోదా 5 ఏండ్లు ఇస్తారట . దానితో అక్కడ కేంద్ర ప్రబుత్వం వారు అనేక టాక్స్ ల రాయితీ లు ఇవ్వ బోతున్నారు . దానికి ఆకర్షితులైన అనేకమంది  పారిశ్రామిక వేతలు అక్కడే తమ పరిశ్రమలు నెలకొల్పుతారు . అలాగే సెంట్రల్ ఏక్సిస్ సుంకం రాయితీలు ఉన్నందు వలన ప్రజలకు తక్కువ రిట్లలో వస్తువులు దొరుకుతాయి . దాని వలన సిమాంద్ర మార్కెట్ కళ కళ లాడుతుంది . ఉదాహరణకు విజయవాడ లాంటి ప్రాంతంలో చౌకగా వస్తువు దొరుకు తుంటే ఖమ్మo లో ఉండే వినియోగ దారులు అక్కడి వస్తువులు తెచ్చుకోవడానికి ఇష్ట పడతారు . ఒక వేళ ఏదైనా నిబందనలు పెట్టినా అవి అన్ని హుష్ కాకి. స్మగ్లింగ్ ఎక్కువైడే తప్పా , సిమాంద్ర సరుకు తెలంగాణాకి రాక తప్పదు. ఇది ఖమ్మం లాంటి దగ్గరి ఎరియాలకే కాదు తెలంగాణా లోని అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుంది .

                    ఉదాహరణకు ప్రస్తుతం చిత్తూర్ లో తయారవుతున్న నల్ల బెల్లం తెలంగాణా లోని సారా బట్టిలకు సరపరా అవుతూ చిత్తూర్ బెల్లం  స్మగ్లర్లకు  విపరీత లాబాలు పంచుతుంది . తెలంగాణా లో అదికారు లుకు కూడా అంతో ఇంతో ముడుతుంది కాబట్టి , బెల్లం స్మగ్లింగ్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిల్లుతుంది .దాని వలన తెలంగాణా లో ఏ "సంబురం " జరుపుకున్నా , దాని వలన లాభాలు సిమాంద్ర వారికి చెందు తాయి . రేపు ఇదే పరిస్తితి చాలా వస్తువులకు అమలు చేయబడుతుంది . దానితో  సదరు వస్తు అమ్మకాలు ద్వారా వచ్చె ఆదాయాన్ని తెలంగాణా రాష్ట్రం  కోల్పోక తప్పదు . ప్రస్తుతం హైద్రబాద్  లో వచ్చె అంత రెవెన్యూ బవిష్యత్ లో తగ్గే అవకాశాలు ఉన్నాయి .సిమాంద్ర ప్రజలు వలసలు తగ్గుతాయి కాబట్టి ఈ ప్రబావం తెలంగాణా రియల్ ఎస్టేట్ మిద కూడా పడే అవకాశ ముంది. వోట్ల రాజకీయాల మిద నడిచే   మన భారత దేశంలో ఒక సారి రాయతీలు ఇచ్చాక దానిని తొలగించాలంటే కష్టం  . కాబట్టి సిమాంద్ర ప్రత్యెక ప్రతి పత్తి మరి కొంత కాలం పోదిగిస్తారు . దానితో రానున్న 10 ఏండ్లలో సిమాంద్ర అభివృద్ధి చెందితే , తెలంగాణా వారు స్మగ్లింగ్ చేసుకోవడం తప్పా గత్యంతరం ఉండదు అనుకుంట !
                     అయితే సిమాoద్ర కు ప్రత్యెక పట్టి ఇవ్వడంలో అనేక అనుమానాలు ఉన్నాయి . దేశంలోని ఇతర ప్రాంతాల వారు దీనిని వ్యతిరేకించడం కంటే సిమాంద్ర కు ప్రత్యెక ప్రతి పత్తి హోదా పొందే అర్హత లేదంటున్నారు . అయినా తోటి తెలుగువారికి దక్కుతున్న సౌకర్యాలు వద్దనడం తెలంగాణా ప్రజలకు అభిలషినియం  కాదు . కాకపొతే దాని వలన తెలంగాణా ప్రాంతానికి జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పనిలో పనిగా తెలంగాణా రాష్ట్రానికి కూడా ప్రత్యెక ప్రతి పత్తి  ఇస్తే ఇక్కడి వారు కూడా నిజాయితిగా తమ రాష్ట్ర అభివృద్దిలో పాలు పంచుకుంటారు . లేకుంటే కరెంట్ కష్టాలు , స్మగ్లింగ్ నష్టాలు తప్పా తెలంగాణలో ఏమి ఉండదు .

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

సెక్స్ లేకుండానే 'గర్బవతులు ' అవుతున్న ఆధునిక "కన్య మాతలు"

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!