T.D.P ,B.J.P ల తెలంగాణా రాష్ట్ర ఉమ్మడి B.C. ముఖ్యమంత్రి అబ్యర్ది "పవర్ స్టార్ పవన్ కళ్యాణా"!?

                                                                       
 

పోయిన వారంలో ఆంధ్రా గబ్బర్ సింగ్ , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  గారు , ఏదో  ఆవహించిన  వాడిలా , ఒక స్టార్ హోటల్లో బ్రహ్మాండమైన సభ ఒకటి ఏర్పాటు చేసి "జనసేన" అనే నూతన రాజకీయ పార్టిని ప్రకటించడం , ఆ సందర్బంగా కేవలం 45 నిమిషాలు మాట్లాడుతారు అని ముందుగా చెప్పిన వ్యక్తీ 2 గంటలు పాటు అభిమానులను పంచ్  డైలాగులతో అలరించడం జరిగింది . అయన చేసిన ఉపన్యాస దోరణి  చూస్తె , తెలంగాణా లోని సిమాంద్ర సెటిలర్స్ కి కొంత మనో దైర్యం ఇచ్చేలా ఉన్నవి. K.C.R గారికి డైరెక్టు వార్నింగ్ లు ఇవ్వడం ద్వారా అయన తనలో ఉన్న డేరింగ్ నెస్ ని బయట పెట్టుకోవడం జరిగింది .
          1956 తెలంగాణాకి , 2014 లో తెలంగాణా కి బోల్దంత తేడా ఉంది . ఆంద్ర ప్రదేశ్ ఏర్పడ్డాక , సిమాంద్ర నుండి లక్షలాది తెలుగువారు తెలంగాణా కు వచ్చి స్తిర పడ్డారు . కొన్ని ప్రాంతాలలో వారి ఓట్లు అబ్యర్దుల గెలుపు ఓటములను నిర్ణయించే స్తాయిలో ఉన్నాయి .ఎవరు ఎన్ని కహనిలు చెప్పినా సెటిలర్స్  ఓట్లు K.C.R కి వేసే ప్రశ్నే లేదు .  అవ్వన్నీ T.R.S  కి వ్యతిరేకంగా పడేవే . మరి తెలంగాణా వ్యాప్తంగా సుమారు 20% పైగా ఉన్న ఈ ఓట్లను చీలకుండా చూడగలిగే పార్టికి విజయ అవకాశాలు ఉండవచ్చు . మరి ఈ  ఓట్లని చీలకుండా చెయ్యగల సిమాంద్ర ఫేవర్  తెలంగాణా నాయకుడు ఎవరు?

    తెలంగాణలో కాంగ్రెస్, T.R.S విడి విడి గా పోటి చేస్తే , వారికి గట్టి పోటి ఇవ్వగలిగిన స్తాయిలో T.D.P , B.J.P కూటమి ఉండవచ్చు . ఈ రెండు పార్టీలకు తెలంగాణలో ఫేవర్ ఉంది . ఇప్పటికే సామాజిక తెలంగాణా పేరుతొ T.D.P B.C అబ్యార్దినే ముఖ్యమంత్రి చేస్తాను అని ప్రకటించి , K.C.R దొర తనానికి చెక్ పెట్టాలని చూస్తుంది . దళితుడిని ముఖ్య మంత్రి చేస్తాను అని ప్రకటించిన T.R.S గమ్మున ఉంటె , కాంగ్రెస్ దళిత ముక్య మంత్రికే తమ మద్దతు అంటుంది . ఈ  విదంగా తెలంగాణా లో దళితులు , B.C ల మద్య అధికార పోరాటం  మొదలవుతుంది . ఈ  రోజు B.J.P కూడా B.C. ముక్యమంత్రికే సై  అన్నట్లు తెలుస్తుంది . అంటే   T.D.P , B.J.P ల ఉమ్మడి  ముక్య మంత్రి అబ్యర్ది ఒక B.C అనేది అర్ధమవుతుంది .

   ఇదే తరుణంలో పవర్ స్టార్ గారు తనకు అధికారం కంటే  తెలుగు ప్రజల అభివృద్ధి ముక్యం అని, దానికోసం ఎవరితోనైనా చేతులు కలుపుతానని ప్రకటించడమే కాక ,అటు చంద్ర బాబు గారి తోనూ , ఇటు నరేంద్ర మోదితోను మంతనాలు జరపటం చూస్తుంటే ఆ రెండు పార్టీలకు ఉమ్మడి ముఖ్యమంత్రి అబ్యర్ది గా పవర్ స్టార్ డిక్లేర్ అయ్యే అవకాశం ఉందా , అనే అనుమానం వస్తుంది . కేంద్రం లో మోడీ సర్కార్ వస్తే , తెలంగాణాలో B.J.P  ఆమోదిత సర్కార్ ఉంటేనే ఏమైనా అభివృద్ధి జరిగే అవకాశం  ఉంది . లేకుంటే తెలంగాణా మరో 20 ఏండ్లు వెనకి వెళ్ళినట్లే! ఆ  ఊహతోనే బహుశా  లోక్ సత్తా పార్టి వారు కూడా B.J.P , T.D.P , జనసేన , లోకసత్తా  కూటమి అనే వాయిస్ వినిపిస్తుంది . తెలంగాణా వచ్సువరకే తెలంగాణా సమస్యకు విలువ. అది వచ్చాక ఇక చూడాల్సింది , తెలంగాణా అభివృద్ధి ఎలా చెయ్యాలి అనేది . కేంద్రంలో కాంగ్రెస్ సర్కార్  వచ్చె అవకాశాలు లేనపుడు , తెలంగాణా ప్రజలు B.J.P మరియు దాని మిత్ర పార్టీలను ఆదరించడమే తెలివైన పని అని నా అభిప్రాయమ్. ఏదైనా ఈ ఎ న్నికలలో  తెలంగాణా ప్రజలు  ఇచ్చెవివేకవంతమైన  తీర్పు మీదే వారి బావిష్యత్ ఆదారపడి ఉంది .

  

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!