పెళ్ళాం మీద అలిగి వెళ్ళిపోయినా, గాడిదలకూ పోలిస్ సెర్చ్ డ్యూటి తప్పదా !?

                                                                   


వెనుకటికి ఒకాయన అపరాద పరిశోదన నవలలు చదివి , చదివి , తానూ ఒక డిటెక్టివ్ అయి బాగుండు అనుకున్నాడట . వెంటనే కొంత డబ్బు ఖర్చు చేసి "xxx డిటెక్టివ్ ఏజెన్సి" అనే దానిని అట్టహాసంగా ప్రారంభించాడట. మొదటి రోజు మొదటి బేరం ఏమి తగులుతుందా అని ఎదురు చూస్తున్న అ డిటెక్టివ్ గారి దాగ్గరకు  , పంచే పైకెగ దోపుకుని , ఆయాసంగా ఒగర్స్తూ ఉన్న వ్యక్తీ ఒకరు రావడం జరిగింది . వచ్చి రావడంతోనే "అయ్యా ఇక్కడ, కనపడకుండా పారిపోయిన వాళ్ళ , జాడ కనిపెడతరంటగా " అని అడిగే సరికి , మొదటి కేసు ఏదో మిస్సింగ్ పర్సన్ కేసు తగిలందుకుని "అవును" , అన్నాడట  ఔత్సాహిక డిటెక్టివ్ . దానికి ఆ ఆసామి "బ్బాబ్బాబు ! మీకు పుణ్యముంటుంది . వారం రోజుల నుంచి నా గాడిద కనపడటం లేదు . వెతికి పెడితే "చచ్చిమీ కడుపున పుడతా " అని అంటుoటే   తెల్ల ముఖం వేసాడట ఆ కొత్త డిటెక్టివ్ . మన రాష్ట్రం లో పోలిస్ వారు నిర్వహిస్తున్న కొన్ని డ్యూటి లు చూస్తుంటే ఈ కదే గుర్తుకు వస్తుంది . విషయం ఏమిటంటే ,

    సికింద్రాబాద్ జీడిమెట్ల పోలిస్ స్టేషన్ పరిది లోని జగద్గిరి గుట్ట మగ్దూం నగర్ ఏరియాలో ప్రైవేట్ ఎలేక్త్రిశియన్ గా పని చేస్తున్న శ్రీదర క్రాంతి కుమార్ ,అతని బార్య స్రవంతి తమ కుమార్తె తో కలిసి ఉంటున్నారు . ఈ 18  న బార్య భర్తలకు ఏదో గొడవ వచ్చి , ఆతను బార్య మిద అలిగి కుమార్తెను తీసుకుని ఎటో వెళ్ళిపోయాడట . సాదారణంగా ఎవరైనా ఇంట్లో చెప్పకుండా వెళ్ళిపోతే, సంబందితుల కోరిక మేరకు మిస్సింగ్ కేస్ గా డైరి నమోదు చేసి అన్ని పోలిస్ స్టేషన్ లకు సమాచార మిస్తారు . అదే కిడ్నాప్ కేస్ అయితే పోలిస్ ప్రత్యెక టీం లతో సెర్చ్ లు నిర్వహించి , నిందితులను అరెస్ట్ చేసి , కిడ్నాప్ కు గురయిన వారిని సంబందితులకు అప్ప చెపుతారు . ఇది పద్దతి .

   అయితే పై కేసులో విచిత్రంగా తన కూతురిని తీసుకువెళ్ళిన తండ్రి మిద జగద్గిరి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేసారట . పిల్ల విషయంలో తల్లి తండ్రి మద్య గొడవ ఉంటె ఎవరి కస్టడిలో పిల్ల ఉండాలి అనేది కుటుంభ న్యాయస్తానాలు తెలుస్తాయి . అంతే కాని , నేచురల్  గార్డియన్ అయిన తండ్రి కూతురును , తల్లికి తెలియకుండా తీసుకువెళ్ళినంత మాత్రానా అది కిడ్నాప్ నేరం క్రిందకు ఎలా వస్తుందో , అసలు తండ్రి మిద FIR ఎలా నమోదు చేసారో అ పోలిసులకే తెలియాలి . ఈ  కేసు కోసం ఉన్న పనులు పక్కన పెట్టి , డోర్నకల్ , భద్రాచలం లో పోలిస్ బృందాలు వెతుకులాట మొదల పెట్టారట . అది తెలిసిన క్రాంతి కుమార్ తన కూతురుతో సహా పోయి జగద్గిరి పోలిస్ స్టేషన్లో లొంగి పోయాడట.  రేపు ఇదే కేసులో తండ్రిని కిడ్నాపర్ గా చూపిస్తూ కోర్టులో ప్రవేశ పెడతారేమో ! ఇది నేను పేపర్లో వచ్చిన వార్తా ఆదారంగా ప్రస్తావిస్తున్న అంశం . నాకు తెలిసి ఇలా కేసు పెట్టి ఉంటె మాత్రం అది ఇల్లీగల్ .

  సరే ఏది ఏమైనా మొగుడు పెళ్ళాల పనికి మాలిన పంచాయతి కోసం ఇంత శ్రద్ద చూపిన పోలీసులు జగద్గిరిలో ఉండగా , విజయవాడలో మాత్రం గాంగ్ రేప్  కు గురై , దారుణంగా మృగాల్ల చేతిలో హత్యకు గురి అయిన హిమబిందు అనే ఇల్లాలి కేసులో మాత్రం ఎ మాత్రం పట్టించుకోకుండా , పిర్యాదు చేసిన వారినే అవమానిoఛి  ఘోర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించారు విజయవాడ పటమట పోలీసులు . ఈ  రోజు విజయవాడలో విద్యార్ది సంగాలు పోలిసుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ, మ్రుగాల్లను ఉరి తియాలంటూ ఆందోళన చేస్తున్నారు . ఇదే విషయమై ఇంతకూ ముందు ఇదే బ్లాగులో పెట్టిన టపా కోసం క్రింది లింక్ ను క్లిక్ చేసి చూడండి .

అవమానకర దర్యాప్తుతో ఇల్లాలి ని అనుమానించి, మాజీ న్యాయ మూర్త్రి చేతనే కంట తడి పెట్టించిన "పటమట పోలీసులు " http://ssmanavu.blogspot.in/2014/03/blog-post_18.html


   ఇలా ఒకే డిపార్ట్మెంట్ కు చెందిన ఆంద్ర ప్రదేశ్ పోలిస్ , ఒక చోట, పనికి మాలిన విషయాలకు అతి శ్రద్ద చూపి , కాలాన్ని,ప్రజల  డబ్బును దుర్వినియోగం చేస్తుంటే , ఇంకొక చోట అతి ప్రాదాన్యత ఉన్న కేసులను పట్టించుకోకుండా , ప్రజలలో ఒక అభద్రతా బావం కలిగేలా చేస్తున్నారు . దీనిని సరి చేయాల్సిన అవసరం ఉంది . పోలిస్ వ్యవస్తను తక్షణమే ప్రక్షాళన చేసి , ప్రజలకు జవాబుదారిగా ఉండేలా తీర్చి దిద్దవలసిన గురుతతర బాద్యత రానున్న కొత్త రాష్ట్ర ప్రబుత్వాల మిద ఉంది .

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )