"అందాల "పేరంటాల పల్లి " ని అదృశ్యం చేస్తున్న వారు రాక్షసులేనా ?

                                                         


పేరంటాల పల్లి ! ఖమ్మం జిల్లాకు ఉన్న ఏకైక అందమైన నదీ పరివాహక టూరిజం స్పాట్ . ఇక్కడకు నిత్యం అనేక వందల మంది రాష్ట్రం లోని వివిధ జిల్ల్లాల నుండి మాత్రమె కాక, పొరుగు రాష్ట్రాలనుండి కూడా  వచ్చి ఇక్కడి రమణీయ ప్రక్రుతి కి పరవశించి పోతుంటారు . అలా ఈ ప్రాంతం బోట్ టూరిజం కి ప్రసిద్ది గాంచింది . మరి అలాంటి ప్రాంతం ఇంకా కొద్ది రోజులలో అధికారికంగా సిమాంద్ర రాష్ట్ర ప్రాంతంలో కలిపివేయ్యడమే కాకుండా పూర్తిగా గోదావరి లో ముంచి వెయ్యడానికి "సోనియా సర్కార్" సిద్ద మయింది .

     భద్రా చలం పరమ పుణ్య దామం . తెలంగాణ ప్రజలు రాముల వారిని తమ రాష్ట్రంలోనే ఉంచాలని , రాముల వారికి హైదరాబాద్ సంస్తానానికి ఉన్న చారిత్రిక నేపద్యం,రామాలయ సంప్రాదాయాల రిత్యా అది అనివార్యం కాబట్టి , కేవలం రామ క్షేత్ర్రాలు ను మాత్రమె తెలంగాణా లోని ఖమ్మం జిల్లాలో ఉంచి , మిగాతా ప్రాంతం అంతటిని "పోలవరం ముంపు ప్రాంతాలు" పేరుతొ సిమాంద్రా లో కలిపి వేస్తున్నారు . దిని కోసం ఆర్డినెన్స్ జారి చెయ్యటానికి కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది . ప్రస్తుతం ఉన్న పరిస్తితిలో అయితే అటు గోదావరి జిల్లాలకు   , ఇటు ఖమ్మం జిల్లాకి టూరిజం ద్వారా ఆదాయం , ఉపాది కల్పిస్తున్న" పేరంటాల పల్లి " టూరిజం కేంద్రం వారి నిర్ణయంతో పూర్తిగా మునిగి పోయే పరిస్తితి.
                                                         


   ఖమ్మం జిల్లాలో "పేరంటాల పల్లి " టూర్   కూనవరం గ్రామం నుడి కాని , పోచారం గ్రామం నుండి కాని ప్రారంభం అవుతుతుంది . భద్రా చలం వచ్చిన యాత్రికులు అక్కడ శ్రీ రాముల వారి దర్సన అనంతరం రోడ్డు మార్గం ద్వారా కూనవరం చేరుకుంటారు . అక్కడ నుండి బోట్  ప్రయాణం మొదలై , కొండల నడుమ గోదావరిలో విహరిస్తూ , పేరంటాలు పల్లి,ఆ ప పాపి కొండల వరకు వెళ్లి అక్కడి కమనీయ దృశ్యాలు చూసి పులకించి పోతుంటారు . అటు రాజమండ్రి వచ్చె యాత్రికులు సైతం రాజమండ్రి నుండి బోట్ ప్రయాణం ద్వారా పేరంటాల పల్లి వరకు వస్తుంటారు . ఈ విదంగా ఇటు తెలంగాణా ప్రాంతానికి  , అటు సిమాంద్ర ప్రాంతానికి ఉపాడితో కూడిన టూరిజం రెండు ప్రాంతాలకు "సమ న్యాయం" చేస్తుంది . కాని ఇప్పుడు సోనియా సర్కార్ నిర్వాకాలు వలన టూరిజం జరిగే ప్రాంతం మొత్తం గోదావరి జిల్లాలకు బదిలి చెయ్య బడడమే కాక అసలు చుట్టూ ప్రక్కల ప్రక్రుతి అందాలు ను గోదావరి లోనే ముంచేయ బోతున్నారు . 
                                                      
  భద్రాచలం డివిజన్ లోని చింతూరు , కూనవరం, V.R పురం మండలాలు పూర్తిగాను ,   భద్రాచలం మండలంలోని ఒక్క భద్రా చలం రెవెన్యూ గ్రామం మినహా మిగతా మండలాలు , అలాగే పాల్వంచ డివిజన్ లోని కుక్కునూరు , వేలేరు పాడు మండలాలు పూర్తిగా "ముంపు ప్రాంతాలు " గా నిర్ణయించారు . ఈ  ప్రాంతాలు అన్ని గిరిజన సంస్కృతీ కలిగిన అందమైన అటవీ ప్రాంతం . పూర్వం శ్రీ రాముల వారు తిరుగాడిన ప్రాంతం . మరి అటువంటి ప్రాంతాన్ని ఒక ఆనకట్ట నిర్మాణం కోసం పూర్తిగా గోదావరిలో ముంచి వెయ్యడం ప్రక్రుతి ప్రేమికులను కలచి వేసే అంశం . పూర్వ కాలం లో వృత్రా సురుడు అనే రాక్షసుడు ఇలాగే ఆనకట్టలు కట్టి , ప్రక్రుతి అసమతుల్యకు కారణ బూతుడు అయ్యాడని , దేవత తల రాజు ఇంద్రుడు "వజ్రాయుధం " తో అతన్ని సహరిoఛి , ఆతను  నిర్మిoచిన ఆనకట్టను బద్దలు కొట్టి నీటిని విడుదల చేస్తాడు అని గాద . ప్రస్తుతం కేంద్రం లోని కొంత మంది పెద్దలు చేసే పనులు చూస్తుంటే వీరంతా అ రాక్షస  వృత్రాసురుడు వారసులే అనిపిస్తుంది .ఇలా ప్రక్రుతి ద్వంసానికి పదకాలు రచించే వారు ఖచ్చితంగా రాక్షసులే . వారు  తప్పకుండా రాముల వారి ఆగ్రహానికి గురి కాక తప్పదు . మరి అ నాడు  ప్రక్రుతి మాతను రక్షించడాని కి "వజ్రాయుధం " ప్రయోగించాల్సి వచ్చింది . మరిపుడు భద్రాచల రాములవారి "రామ భాణం " ఈ నవీన రాక్షసుల భరతం పట్టుదేమో చూదాం .

     భద్రాచల పరిసర ప్రాంతాలు సిమాంద్ర లో కలపడాన్ని సవాలు చేస్తూ K.C.R గారు సుప్రీం కోర్టుకు వేతానని ప్రకటించారు . సంతోషం. లేకుంటే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్నటికి K.C.R  గారిని , అయన పార్టిని క్షమించరు . అలాగే కిరణ్ కుమార్ రెడ్డి గారు అసలు రాష్ట్ర విభజనను సవాలు చేస్తూ సుప్రీం కోర్టుకు వెళతాను అన్నారు. పోనీ , ఈ  విదంగా అయినా ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు ప్రాంతాల విషయంలో , రాష్ట్ర విభజన విషయంలో ఉన్న చట్ట వ్యతిరేక అంశాలు మిద ఒక స్పష్టత రావడమే కాక భవిష్యత్ లో ర్రాష్ట్రాల ఏర్పాటుకు కొన్ని మార్గదర్శక సూత్రాలు ఏర్పడే అవకాశం  ఉంది .

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )