"పాకీ " పని అమానవీయం! ,O.K !, మరి ఈ "లపాకీ " పని గురించి ఏమిటి?

                                                                     
         
"ఆ పాడు పనుల పై చట్టాలను అమలు చేయండి " అనే హెడ్డింగ్ తో ఈ రోజు "ఈనాడు" పేపర్లో వచ్చిన ఐటెం ను చూసి ఈ విషయాన్నీ ఈ టపా ద్వారా ప్రస్తావిస్తున్నాను . నిన్న గురువారం మన సుప్రీం కోర్టు వారు , మానవ విసిర్జితాలను మనుషుల ద్వారా చేయించారాదని చెపుతున్న చట్టాలను పూర్తీ స్తాయిలో అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాలను , కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది . చాలా సంతోష కరమైన విషయo .

         సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందామని చెపుతున్న మన దేశం లో ఒక అంచనా ప్రకారం సుమారు 7 లక్షలు మంది "పాకి పని చేసే వారు ఉండటం, సాంకేతికంగా  సిగ్గుపడాల్సిన విషయమే . ఒక మనిషి విసర్జించిన దానిని మరొక మనిషి తన చేతులతో  తీసి శుబ్రపరచాల్సిన అవసరం , యంత్ర సంస్కృతీ లేని పూర్వకాలంలో అయితే O.K. కాని , హై  టెక్  యుగం అని చెప్పబడుతున్న నేటి సమాజంలో ఎంత మాత్రం కూడనిది . అయితే ఏదైనా ఉనికిలో ఉన్న ఒక వ్రుత్తి వ్యవస్తను సమూలంగా నిర్మూలించాలి అంటే , దాని మీదే ఆదార పడి బ్రతికే ప్రజలకు  ప్రత్యామ్నాయ ఉపాది చూపించవలసిన బాద్యత ప్రబుత్వాల పై ఉంది . అందుకోసం సపాయి కార్మికుల పిల్లలను విద్యావంతులు చేయడం, సపాయి పనికి బదులు వారి కుటుంబాలకు వేరే ఉపాది చూపించడం , వారికి ఇల్లు కట్టించడం లాంటి  చర్యలతో , సమాజంలో ఒక గౌరవ ప్రదమైన జీవితం గడిపేందుకు అన్ని విదాల సహకారం అందించాల్సిన బాద్యత రాష్ట్ర ప్రభుత్వాలు , కేంద్ర ప్రభుత్వం పై ఉంది . దీనికి సంబంధించి 2013 లోProhibition of Employment as Manual Scavengers and their Rehabilitation Act, 2013.   అనే  చట్టం కూడా చేసారు . దాని ప్రకారం అత్యవసర పరిస్తితుల్లో అయినా సరే భద్రతా సాధనాలు లేకుండా మరుగు దొడ్లలో సపాయి కార్మికులు ప్రవేశించడం నేరం . అలాంటి పరిస్తితుల్లో కార్మికుడు మరణిస్తే 10 లక్షలు నష్ట పరిహారం అతని కుటుంబానికి చెల్లించాలి . ఇలా ఈ అమానవియ పనుల నిర్మూలనకు  పై చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేయాలని దేశ అత్యున్నత న్యాయ స్తానం అదేసించడం ముదావహం .
       అయితే పైన చెప్పిన సపాయి కార్మికులు చేసే" పని" అమానవీయం కాదు .యంత్ర లబ్యత ఉండగా , మనుషుల చేత అ పని చేయించడం మాత్రమె అమానవీయం . వారు చేసే పని ఎబ్బెట్టు అనిపించినా , వారు మానవ విసిర్జితాలను తీసివేసి , పరిసరాలు శుభ్రంగా ఉండటానికి , ప్రజలు ఆరోగ్యంగా జీవించడానికి దొహద పడుతున్నారు . కాని ఇదే సమాజంలో , జీవించడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ , వాటిని స్వీకరించడానికి అర్హత ఉన్నప్పటికీ , కష్ట పడటం వెస్ట్ అనుకుని , ఈజీ మని కోసం అలవాటు పడి , అత్యంత నీచమైన "లపాకి " పని చేసే వారి గురించి ప్రభుత్వాలు ఏమి పట్టించుకున్తున్నాయి ? పొట్ట కూటి   కోసమైనా సరే అమానవీయ పనులు చేయటానికి విలు లేదని దేశ అత్యున్నత న్యాయ స్తానం స్పష్టం చేసింది . మరి ఒక్క ఆంద్ర ప్రదేశ్ నుంచే లక్షలాది మంది ఆడపిల్లలు పొట్ట కూటి కొసం ముంబాయి , బెంగళూర్ , హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లి పడుపు వృత్తిని స్వీకరించారు . వీరిలో స్వచ్చందంగా వెళ్ళిన వారి కంటే , బలవంతంగా దించబడిన వారే ఎక్కువంట ! సరే వీరంతా పొట్టకూటికోసం అలా తయారు అవుతున్నారు అనుకున్నా , మరి అన్ని హంగులు ఉన్నవారు కూడా తమ విలాస వంతమైన జీవితాల కోసం ఇదే పాడు పనిని చేయడంలో ఔచిత్యం ఏమిటి? దీనికి ప్రదాన కారణం ఆదునిక బావజాలం అని నా అభిప్రాయం .

   నేను చాలా యేండ్ల క్రింద ఒక సినిమా చూసాను. పేరు గుర్తు లేదు . అదేదో అభ్యుదయ డైరెక్టర్ అని చెప్పుకునే అయన తీసిన సినిమా అని గుర్తు. అందులో ఒక పాత్రదారిని చేత "టైలరింగ్ చేసి జీవించడం తప్పు కానప్పుడు , ఒళ్ళు అమ్ముకుని జీవించడం లో కూడా తప్పు లేదు " అని అనిపిస్తాడు .రెండింటిలోను అమ్ముకునేది శారిరక శ్రమే అని సదరు అబ్యుదయ బావజాలికుడి అభిప్రాయం . అది చూసిన సగటు ప్రజల మనసులో టైలరింగ్ పట్ల ఏమి గౌరవ బావం ఉంటుంది ? శరీరం ,లేక మెదడు ను ఉపగిoచి   తద్వారా వాటి ద్వారా ఏర్పడే  ఉత్పాత్తులు , లేక సేవలు అమ్ముకోవటానికి , అసలు శరీరాన్నే తాత్కాలికంగా అమ్ముకోవడానికి తేడా లేదు అని చెప్పే సదరు సిని బావా జాలాలు , వాటిని కావాలనే వ్యాప్తి చేసిన కుహన మేదావుల వలననే ఈ  విష సంస్కృతీ మన దేశం లో ప్రబలి పోయి , లక్షలాది మంది ఆడపిల్లల బ్రతుకులు బుగ్గి పాలు చేసింది . ఒక్క ఆడపిల్లలేనా , మగ పిల్లలు కూడా ఈజీ మని కోసం లింగ మార్పిడి చేయించుకుని , కోజ్జాలుగా మారి , డబ్బులు సంపాదిస్తున్నారు అంటే , పనికి మాలిన బావాజాలాలు వలననే "గౌరవ ప్రదమైన జీవనం " అనే దానికి విలువ లేకుండా పోయి ఎవడి దగ్గర డబ్బు ఉంటె వాడే గొప్ప అనే విష సంస్కృతీ ప్రబలింది .

    ఇలా మొదట్లో పొట్ట కూటి  కోసమని పరువు తక్కువ పనులు చేసిన వారిలో తెలివి గల వారు కొందరు , డబ్బు బాగా సంపాదించాక వాటిని ఉపయోగించే రాజకీయాలలో చేరి చివరకు మనకు నాయకులు అవుతున్నారు . మరి అటువంటి నాయకులు ఈ అమానవీయ పనులు ను నిర్మూలించడానికి , నడుం బిగిస్తారా ? వారికి వచ్చె ఆదాయాలు ఎక్కువ శాతం ఇటువంటి తప్పుడు పనులు చేసే వారు ,లేక చేయించే వారి వలననే కదా! విరి వలననే పోలిస్ వారికి కూడా ఎక్కువ మామూళ్ళు ముట్టేది . ఒక అంచనా ప్రకారం వేల  కోట్ల రూపాయల బిసినెస్ గా నేడు పడుపువ్రుత్తి రూపాంతరం చెందింది . చూసారా ! ఒక తప్పుడు బావజాలం వలన ఒల్లమ్ముకోవడం  ఎంత గొప్ప బిసినెస్ అయిందో!
 
       మసాజ్ సెంటర్ లు పెట్టి కోట్లు ఎలా గడిస్తున్నారో క్రింది విడియో చూస్తె తెలుస్తుంది . అన్ని మసాజ్ సెంటర్లు అలాంటి వేనా అంటే కాక పోవచ్చు ! కాని అలా కాని వాటికి పాపులారిటి ఏముంటుంది ?అలాంటి  మసాజ్ సెంటర్ లు నడిపే వారికున్న గౌరవ మర్యాదలు , ఇండ్లలో ఒద్దికగా కాపురం చేస్తూ ఉండే సాదారణ గృహిణులకు ఉంటుందా? ఏదో ఒక రోజు మీ వీది మసాజ్ సెంటర్ నిర్వావాహకులే మీ కార్పొరేటర్ అవ్వవచ్చు . ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి నాయకులు అయ్యే దమ్ము" పూర్వ కాలపు పరువు"గల పనులు చేసే వారికి ఎక్కడ నుండి వస్తుంది? కాబట్టి ఇలాంటి వారి నుండి సమాజాన్ని రక్షించాలంటే ఈ  "లపాకి " సంస్కృతిని నిర్మూలించి తీరవలసిందే . అందుకు కఠిన చట్టాలుతో పాటు చిత్తశుద్ది కలిగిన నాయకత్వం అవసరo . "ఆ పాడు పనుల పై చట్టాలను అమలు చేయండి" అంటున్న సుప్రీం కోర్టు వారు కాస్త ఈ  పాడు పనుల పైన దృష్టి సారిస్తే మంచిది .
           మసాజ్ సెంటర్ ల పేరుతొ నగరాల్లో విస్తరిస్తున్న "లపాకి సంస్కృతీ " గురించి మరింత సమాచారం కొరకు క్రింది వీడియోను చూడండి

                

Comments

Popular Posts

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

"కలవారీ కోడళ్ళు" చేసే ఈ "నగ్న " పూజలు వల్ల కాపురాలు చక్కబడతాయా!.

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

దర్మేచ ,అర్దేచ ,కామేచ , నాతి చరామి అన్న మాటలకు నిజమైన అర్దం చెప్పిన సామాన్యుడు !

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )

అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!

70 సంవత్సరాల వృద్దురాలు "బలమైన సెక్స్ చర్యల " చేత చనిపోయినప్పటికి , 45 ఏండ్ల నిందితుడుని నిర్దోషి గా విడుదల చేసిన డిల్లీ హై కోర్టు!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!