'అన్యాయంగా విడగొట్టారు'అని బాదపడుతున్న వారిని ' ఆవిర్బావ దినం'అంటూ అవమానించటం కరెక్టా ?

                                                       


జూన్ 2,2014 ! తెలంగాణా రాష్ట్ర ఆవిర్బావ దినం . ఆ రోజుని తెలంగాణా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖిoచ వలసిన రొజు. తెలంగాణా ప్రజలు నిజంగా ఆ రోజు "సంబురాలు" జరపుకోవడమే  కాక , ప్రతి యేట  ఘనంగా అధికారికoగా "తెలంగాణా రాష్ట్ర అవతరణ దినోత్సవం" జరుపుకునే రోజుగా  మారనుంది . అంతవరకూ సంతోషమే . కాని అదే రోజును ఆంద్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం గా పరిగణిస్తామని కేంద్ర ప్రబుత్వం ప్రకటించడం చూస్తుంటే , కాంగ్రెస్ వారికి ఎందుకో కాని , సిమాంద్ర వారు అంటే చెప్పలేని కసి ఉన్నట్లు అనిపిస్తుంది . వారిని అవమానిoచటానికే ఆ ప్రకటన విడుదల చేసినట్లు కనిపిస్తుంది .

 నిజానికి ఆంద్ర ప్రదేశ్ ఏర్పడింది నవంబర్ 1 1956. ఇప్పుడు తెలంగాణా అందులో నుండి విడిపోయినంత మాత్రానా అది ఆంద్ర ప్రదేశ్ పేరుతోనే ఉంది తప్పా , దానికి కొత్త పేరు ఏమి పెట్టలేదు కదా ! కనీసం సిమాంద్ర అనో , న్యూ ఆంధ్రా అనో పేరు మారిస్తే అప్పుడు నూతన రాష్ట్రం గా బావించి ఆవిర్భావ దినోత్సవం చేస్తే బాగుంటుంది . అంతే  కాని పాత ఆంద్ర ప్రదేశ్ కి కొత్తగా ఆవిర్బావ దినోత్సవం చేసేదేముంటుంది ? మతి లేని మాటలు కాక పొతే !

  ఎవరు ఎన్ని అనుకున్నా , సిమాంద్ర కు ప్రత్యెక ప్రతిపత్తి లాంటి రాయితీలు ఇచ్చినా , అన్యాయంగా తెలుగు జాతిని విడగొట్టారు అనే బావం సిమాంద్ర ప్రజలలో ఉంది . ఇంకా వారికి సుప్రీం కోర్టు వారు ఏదైనా న్యాయం చేయక పోతారా అనే ఆశ కూడా ఉంది . ఒక వేళ చేయక పోయినా దాని గురించి బాద పడాల్సిన అవసరం లేదు . కాని మనసుకి ఒక దెబ్బ తగిలినప్పుడు అది మానటానికి కొంత సమయం పడుతుంది . ఎంతటి గాయానైనా మాన్పగల శక్తి కాలానికి ఉంది . కాబట్టి సిమాoద్రులు త్వరలోనే అన్నిటిని మరచి పోయి మిగిలిఉన్న రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేస్తారు అని ఆశిద్దాం . అలా వారు కోలుకునేందుకు సహకరించడం కేంద్ర ప్రబుత్వం అనే కంటే కాంగ్రెస్ పార్టి వారి బాద్యత . అది మరచి పోయి పుండు మిద కారం చల్లినట్లు జూన్ 2 వ తారికున ఆంద్ర ప్రదేశ్ ఆవిర్బావ దినం జరుపుతామనటం , వారిని అవమానించి బాద పెట్టడం కాక మరేమిటి ?

  సిమాంద్ర కాంగ్రెస్ వారికి మనిషికి ఉండాల్సిన మానావా మానాలు ఉండక పోవచ్చు . అందుకే సోనియాను తీసుకువచ్చి సిమాంద్ర లో ఉరేగుతాం అంటున్నారు .  . తెలంగాణా తీసుకుని కూడా కాంగ్రెస్ వారిని చీ  కొడుతున్న T.R.S  పార్టి వారిని చూసి అయినా సిమాంద్ర కాంగ్రెస్ వారు బుడ్డి తెచ్చుకోవలసి ఉండే . సిమాంద్ర ప్రజలు నిక్కమైన తెలుగు జాతి బిడ్డలు. వారు ఖచ్చితంగా సిమాoద్రా లో కాంగ్రెస్ ని బొంద పెడతారు . ఎలాగు మే నెల చివరి నాటికి ఎన్నికలు పూర్తవుతాయి కాబట్టి , సిమాంద్ర లో అప్పట్టికి కాంగ్రెస్ భూ స్తాపిత మవుతుంది . కాబట్టి జూన్ రెండు ను "కాంగ్రెస్ భూ స్తాపిత దినోత్సవం " గా సిమాంద్ర ప్రజలు సంతోషంగా సంబరాలు చేసుకోవచ్చు అనిపిస్తుంది .

    మొత్తానికి యావత్ తెలుగు గడ్డ మిద జూన్ 2 న ఒక పక్క "సంబురాలు" , మరొక పక్క "సoబరాలు " జరుగుతాయి అన్న మాట . కాకపోతే కారాణాలు  వేరు . తెలంగాణా లో "రాష్ట్ర ఆవిర్బావ దినోత్సవం " జరుపుకుంటే , సిమాంద్ర లో "రాష్ట్ర కాంగ్రెస్ భూస్తాపిత దినోత్సవం " జరుపుకుంటారు . రాజ్యాంగాన్ని తీవ్రంగా అవమానించిన పార్టీలకు ప్రజలు విదిమ్చవలసిన నిజమైన శిక్ష అదే ! ఆ పనిని సిమాంద్ర ప్రజలు చేస్తారని ఆశిద్దాం .

Comments

Popular Posts

కట్టు బాట్లు లేక , కన్న కొడుకు కూతుళ్లనే పెండ్లిచేసుకున్న కామాంధురాలు !!.

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

పెళ్లి అంటే"పిచ్చి పని", మగాడు అంటే "సెక్స్ కోసం వాడి పారేసే వేస్ట్ పేపర్".అంటా!

కలికాలం.. రివర్స్ కాలం..కాలజ్ఞానం

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

తల్లి తండ్రుల అనుమతి లేని పెళ్ళి(వివాహం) చెల్లు బాటు ఎంతవరకు సమంజసం? ఒక శాస్త్రీయ పరీశీలన

దర్శకుడు 'ప్రకాష్ ఝా' దర్శకత్వం లో నటుడు తుషార్ కపూర్ నటించిన ఎపిసోడ్ " ఆలి లేని అబ్బ కి అమ్మ లేని బాబు" !!!

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )