పెండ్లిలో పరాచికాలాడినందుకు , కాబోయే "ఆవిడ "తో పాటు 5 లక్షలు పోగొట్టుకున్న పెండ్లికొడుకు !!
పరాచికాలు ఆడటానికి కూడా ఒక హద్దూ ,పద్దుతో పాటు సమయం సందర్భం ఉంటాయి .కట్టుకున్న మొగుడు అయినా సరే ,పది మందిలో ఓవర్ పరాచికాలు ఆడితే ,భారతీయ ఇల్లాలు సహించలేదు . నాలుగు తిట్లతో పాటు ,అవసరమయితే చెంప చెళ్ళు మనిపిస్తుంది . పదిమందిలో ఆడే పరాచికం సుతి మెత్తగా ,సున్నితంగా ఉంటేనే అందం !అనందం ఇస్తుంది . సన్నిహిత స్త్రీలతో పరాచికం ఆడితే వారి బుగ్గలు ఎరుపెక్కాలి కాని , కళ్ళు ఎరుపెక్క కూడదు .ఈ చిన్న సూత్రం తెలియని ఒక పెండ్లి కొడుకు ,అతని స్నేహితులు చేసిన పనికి ,పెండ్లి కూతురి మెడలో తాళి కట్టకుండానే , 5 లక్షల నష్ట పరిహారం కూడా ఇచ్చి ఉత్త చేతులతో ఇంటికి తిరిగి వెళ్ళాల్సి వచ్చింది . వివరాలు లోకి వెళితే :- ...