అడిగే వాడు లేక " అత్తకు మొగుడు, అమ్మాయికి యముడు " అయిన అల్లుడు!
మనిషి సంతోషంగా జీవించాలంటే ఆరోగ్యం ఎంత అవసరమో , సమాజం లో సాఫీగా మనుగడ సాగించాలి అంటే మనుషుల మద్య అరోగ్యకరమైన సంబందాలు అంతే అవసరం. అటువంటి ఆరోగ్యకరమైన సంబందాలను కొనసాగించేదుకు నిర్దేసించినవే కట్టు బాట్లు. అటువంటి కట్టుబాట్లను కాలదన్ని "నా ఇష్టం నాది " అని ప్రవర్తించే వారి కుటుంబాలు ఎలాంటి అదమా స్తితికి దిగజారుతాయో తెలుపుతుంది మొన్న నల్గొండలో ఆత్మహత్య చేసుకున్న ఇంజనీరింగ్ విద్యార్దిని ఝాన్సీ ఆత్మహత్య ఉదంతం. వివరాలులోకి వెలితే, నల్లగొండ జిల్లా నకిరేకల్ మండలం నోములకి చెందిన గుర్రపు పద్మ తన భర్త మరణం తర్వాత కుమార్తె ఝాన్సీరాణి, కుమారుడితో కలిసి నకిరేకల్‌లోని మూసీ రోడ్డులో నివాసం ఉంటోంది. నల్లగొండ మండలం దీపకుంటకి చెందిన ఝాన్సీ మేనబావ విజయేందర్ నుంచి పద్మ రూ.4 లక్షలు అప్పు తీసుకుంది. ఆ అప్పు తీర్చాలంటూ విజయేందర్ తరచూ పద్మ ఇంటికి వచ్చేవాడు. ఆ సమయంలో ఝాన్సీ పట్ల అసభ్యంగా ప్రవర్తించేవాడు. 'నీ కూతురును ఇచ్చి పెళ్లి ...