"తెలంగాణా దొర" ప్రజలకు ఇచ్చిన మాట తప్పి, దేవతను అటువంటి కోరికను కొరుతాడా ? !
"తెలంగాణా రాష్ట్రం ఏర్పడితే, దళితుడే ముఖ్యమంత్రి " . ఇది తెలంగాణా రాష్ట్ర సమితి అద్యక్షులు అయిన K.C.R వారు తెలంగాణా ప్రజలకు ఇచ్చిన వాగ్దానం . మరి అటువంటి వాగ్దాన్నాన్ని మరచి పోయారా !? T.R.S పార్టి స్వయంగా అధికారం లోకి వచ్చినా , లేక ఇతర పార్టీల సహకారంతో అధికారంలోకి వచ్చినా ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం K.C.R గారి ప్రదమ కర్తవ్యo . కాని ఈ రోజు టైమ్స్ అప్ ఇండియాలో వచ్చిన ఈ సమాచారం చూస్తుంటే ఆయనగారి వాగ్దాన విశ్వస నియతను తెలంగాణా ప్రజలు శంకిoచే పరిస్తితి ఏర్పడింది . టైమ్స్ అప్ ఇండియా వారి ప్రకారం T.R.S వారు డిల్లి కాంగ్రెస్ అధిష్టానానికి ఒక బంపర్ అపర్ ఇచ్చారట ! తెలంగాణా రాష్ట్రానికి తోలి ముఖ్యమంత్రి కావాలన్న K.C.R గారి కోరికను తీరిస్తే తెలంగాణలో M.P సీట్లలో సింహ బాగం కాంగ్రెస్ వారికే వదిలేస్తాం అని . ఎంత మాట ! నిన్న K.C.R గారు సొనియాగాoది గారిని కుటుంభ సమే...