అమరావతి భారతదేశ రెండో రాజధాని కానుందా!?
అమరావతి ! నవ్యాంద్ర నూతన రాజధాని! రేపు విజయదశమి నాడు గుంటూర్ జిల్లా, తుళ్ళూర్ మండలంలోని ఉద్దండ రాయుని పాలెంలో, అమరావతి నగర నిర్మాణానికి, భారత దేశ ప్రియతమ ప్రధానమంత్రి గారైన శ్రి నరేంద్ర మోడి గారి చేతుల మీదుగా శంకుస్తాపన జరుగనుంది. ఇదేదో మాములు ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా అత్యంత వేడుకగా, యజ్ణ హోమాది క్రతువులతో పాటు, సర్వ మత ప్రార్దనలతో, అనేక మంది జాతియ, అంతర్జాతీయ అధికార, అనధికార ప్రముఖుల సమక్షంలో దూం దాం గా జరుగుతున్న కార్యక్రమం. దీనిని కేవలం ఒక రాష్ట్ర రాజధాని శంఖుస్తాపన కార్యక్రమం అనుకునేలా కాకుండా, ఒక జాతీయ స్తాయి రాజధాని నగర శంఖుస్తాపన కార్యక్రమం అని తలపించేలా ఘనంగా కార్యక్రమాలు నిర్వహింస్తుంది, ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం. కేవలమ్ ఒక రాష్ట్ర రాజధాని నగర నిర్మాణం కోసమే అయితే, ఆ రాష్ట్రం లోని పుణ్యనదీ జలాలు, పుణ్యక్శేత్రాల నుండి మట్టి ని తెప్పిస్తే సరి పోతుంది అనుకుంటా. కాకపోతే హిందూ దేశం లోని పుణ్య నది జలాలు కూడా తెప్పించవచ్చు.