సూది కోసం సోది అడిగితే పాత కధ అంతా బయటపడినట్లు అయింది ,వేముల రోహిత్ కేసు వ్యవహరం !
సూది కోసం సోది అడిగితే పాత కధ అంతా బయటపడినట్లు అయింది , ఇటివల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్ది వేముల రోహిత్ కేసు వ్యవహరం. ఎవరు ఏమంటున్న ఒక రిసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకునే పరిస్తితులు , విశ్వవిద్యాలయాల్లో ఉండటం దురదృష్ట కరం. ఆత్మహత్య చేసుకున్న వారి కులం , మతం ఏదైనా వారి చావుకు దారి తీసిన పరిస్తితులు మీద నిక్ష్పాక్షిక విచారణ జరిపి , తిరిగి అటువంటి దురదృష్టకర పరిస్తితులు , బవిష్యత్ లో ఏ విద్యార్దికి ఎదురుకాకుండా చూడవలసిన బాద్యత విశ్వవిద్యాలయం అధికారులు మీద ఉంది. అలాగే నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరే హక్కు, సదరు దర్యాప్తుకు నిజాలు వెల్లడించడం ద్వారా సహకరించవలసిన బాద్యత విద్యార్దులు , ఇతరులు మీద ఉంది. అలా విచారణ ఏది జరుపకుండానె ఒక్క సారిగా మంత్రులు , విశ్వవిద్యాలయ అధికారులను బాద్యులను చేస్తూ , వారిని రాజీనామాలు చేయమని డిమాండ్లు చేయడం, అలా డిమాండ్ చేస్తున్న వర్గాలకు