సూది కోసం సోది అడిగితే పాత కధ అంతా బయటపడినట్లు అయింది ,వేముల రోహిత్ కేసు వ్యవహరం !
ఆత్మహత్య చేసుకున్న వారి కులం , మతం ఏదైనా వారి చావుకు దారి తీసిన పరిస్తితులు మీద నిక్ష్పాక్షిక విచారణ జరిపి , తిరిగి అటువంటి దురదృష్టకర పరిస్తితులు , బవిష్యత్ లో ఏ విద్యార్దికి ఎదురుకాకుండా చూడవలసిన బాద్యత విశ్వవిద్యాలయం అధికారులు మీద ఉంది. అలాగే నిష్పాక్షిక దర్యాప్తు జరిపించాలని కోరే హక్కు, సదరు దర్యాప్తుకు నిజాలు వెల్లడించడం ద్వారా సహకరించవలసిన బాద్యత విద్యార్దులు , ఇతరులు మీద ఉంది. అలా విచారణ ఏది జరుపకుండానె ఒక్క సారిగా మంత్రులు , విశ్వవిద్యాలయ అధికారులను బాద్యులను చేస్తూ , వారిని రాజీనామాలు చేయమని డిమాండ్లు చేయడం, అలా డిమాండ్ చేస్తున్న వర్గాలకు వత్తాసుగా డిల్లి నుండి రాజకీయ నాయకులు వచ్చి నానా యాగీ చేయడం చూస్తుంటె , చివరకు వేముల రోహిత్ కేసును "శవరాజకీయాలకు " వాడుకోవడానికి తప్పా , కేసులోని నిజా నిజాలు వెలుగులోకి రావాలనే ఆలోచన యాగి చేస్తున్న ఆ యా వర్గాల్లో లేనట్లు ఉంది.
ఆత్మహత్య జరిగినప్పుడు , ఆత్మహత్య చేసుకున్న వారు ఏదైన లేఖ రాసి ఆత్మహత్య చేసుకుంటే , ఆ లేఖ నిజమైనదే అని రుజువు చేయబడితే , ఖచ్చితంగా దాని లో పేర్కొన్న విషయాలకు ప్రాదాన్యత తప్పదు. వేముల రోహిత్ తన మరణానికి ఎవ్వరు కారణం కాదని ఒక లేఖ రాసి ఆత్మ హత్య చేసుకున్నాడని తెలుస్తుంది . దానిని పోరేన్సిక్ లాబ్ కి పంపారు పోలిసులు. ఆ రిపోర్ట్ వచ్చిన దాక వేచి చూడాల్సిన అవసరం ఉంది. అలా చేయకుండా హడావుడిగా రాజకీయ లబ్ది కోసం హుటా హుటిన డిల్లి నుండి, కాంగ్రస్ అధినేత రాహుల్ గాంది గారు వచ్చి "శవరాజకీయమ్ " చేసి పోవడం ఎంతవరకు సమంజసమ్. నిష్పాక్షిక దర్యాప్తును కోరడానికి బదులు ఏమి తెలియకుండానే మంత్రులు రాజీనామా కోరితే వారు చేస్తారా/? ఇది జరిగే పనేనా?
గౌరవ రాహుల్ గారి కాంగ్రెస్ ఏలుబడిలో , తమ మంత్రి గారొకరు కట్టుకున్న భార్యను తెలివిగా విషప్రయోగం చేసి చంపితే , కనీసం ఆ మంత్రిని మందలించిన పాపానా పోలేదు. సునంద పుష్కర్ ఆత్మహత్య జరిగి ఏండ్లు గడుస్తున్నా , ఇప్పటికీ దర్యాప్తు ఒక కొలిక్కి రాలేని పరిస్తితి. స్వంత పార్టి నాయకులే తమ భార్యల , కోడళ్ళ చావుకు కారాణాలు అవుతుంటె , వారిని మందలించలెని ఈ ఘరానా రాజకీయ నాయకుడు కల్ల బొల్లి మాటలు చెపుతూ , తమ రాజకీయ ప్రాభవం పెంచుకోవాలి అనుకుంటున్నాడు. అలాగే మిగతా రాజకీయ నాయకుకూడాలు కూడా. ఇటువంటి రాజకీయ నాయకులు, వర్గ నాయకుల ప్రేలాపనలు వలన, వారి ప్రయోజనాలు నెరవేరడం తప్పా , అటు రోహిత్ కుటుంబానికి కాని , బాదిత విద్యార్దులకు కాని ఒరిగేదేమీ లెదు.
సాదారణంగా, శత్రుత్వం ఉన్న విద్యార్దులు అయినా సరే , తమ తోటి విద్యార్ది ఆత్మహత్య చేసుకున్నాడు అని తెలిసిన తర్వాత అతని మీద సానుభూతితో ఉంటారు. చనిపోయిన విద్యార్ది కారెక్టర్ ఎటువంటిది అయినా కామెంట్ చేయడానికి ఇష్టపడరు. కాని రోహిత్ రాసిన లేఖకు ఎ మాత్రం విలువ ఇవ్వకుండా , తమ రాజకీయ మరియు వర్గ ప్రయోజనాల కోసం, విద్యార్ది సంఘాలు మరియు వారి మతం నే కాక , చివరకు మంత్రులను సైతం టార్గెట్ చేసే సరికి డిపెన్స్ కోసం ఎదురు దాడికి దిగక తప్పలేదు వారికి. దానిలో బాగం గానే రోహిత్ పుట్టు పూర్వోత్తరాలు వెలుగులోకి తెస్తున్నారు .
అప్పటి దాక దళితులూ దళితులూ అని పిలువబడిన రోహిత్ కాస్తా B.C వర్గానికి చెందిన వాడిగా నిర్దారింపబడినాడు. కంచ ఇలైయ్య లాంటి వారు తండ్రికి గౌరవం ఇవ్వలేకపోయినా , పదవ తరగతి వరకు BC గా ఉన్న వ్యక్తీ , ఆ తర్వాత దళిత వర్గానికి ఎలా చెందుతాడో , ఐలయ్య గారి లంటి మేదావులే సెలవు ఇయ్యాలి. అసలు వేమూరి అనే ఇంటి పేరు తండ్రిదా , తల్లిదా ? తండ్రి నుండి సంక్రమించిన ఇంటి పేరు మారకుండా, సామాజిక వర్గం ఎలా మారుతుందో కూడా ఆ మేదావులకె ఎరుక . ఇంత యాగీ చేసిన వారు, రోహిత్ కుటుంబం లోని వారిని, వారి సంబంద బాంద్వ్యాలు లోని లోటు పాట్లును బయటకు తేవడమే కాక , చివరకు రోహిత్ ను కూడా చీటింగ్ కు పాల్పడిన వాడిగా బయలు పడడానికి కారకులయ్యారు. హిందూ మతానికి చెందిన ఒక BC కులం కి చెందిన విద్యార్దిని , మబ్యపెట్టి , రిజర్వేషన్ ఆశ చూపి , దళితుడిగా ముద్ర వేయించి, అతనిలో హిందూ మతం అంటేనే అశ్యహించుకునేలా విషబావాలు నాటి , తోటి విద్యార్దుల పట్ల ద్వేష బావం పెంచుకునే లా చేసారు. చివరకు అతనిలోని హిందూ మూలాలకు , అరువు తెచ్చుకున్న విదేశి బావజాలాలకు అంతులేని సంగర్షణ ఏర్పడి , అది తట్టుకోలేక అతను ఆత్మహత్య చేసుకుని ఉందాలి. అలాగే నా చావుకు ఎవరూ కారణం కాదని ఆత ను రాసిన లేఖ వలన తమ వర్గ ప్రయోజనాలు , రాజకీయ ప్రయోజనాలు నెరవేరవని గ్రహించిన వారు , రాజకీయ డ్రామాలు మొదలుపెట్టి ,ఎదుటి వర్గాలను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. అంతకు మించి మరేమి లేదు .
చివరకు ఈ విషయం లో ప్రధాన మంత్రి గారి తో సహా దేశ ప్రజలు అందరూ విచారం వెలిబుచ్చడమె కాక , రోహిత్ కేసు లోని నిజా నిజాలు వెలికి రావాలని కోరుకుంటున్నారు. నిష్పాక్షిక విచారణ ద్వారా కేంద్ర విశ్వవిద్యాలయం లో జరిగిన ఈ దారుణ ఉదంతం వెనుకాల ఏ శక్తులు ఉన్నాయో , వారిని బయట పెట్టాల్సిన అవసరం కేంద్ర ప్రబుత్వం పై ఉంది. కుల , మతం తో ప్రమేయం లేకుండా దోషులు ఎవరైనా సరే వారిని శిఖ్శింపచేసి , విశ్వ విద్యాలయాలను ప్రశాంతి నిలయాలు గా మారేలా చేయాలి. అదే రోహిత్ లాంటి అబాగ్య విద్యార్దులకు జాతి ఇచ్చె నివాళి .
రోహిత్ ఆత్మకు శాంతి చేకూర్చాలని ఆ భగవంతుణ్ణి ప్రార్డుస్తున్నాను .
chala bhaga chepparu.
ReplyDeleteThank you
Delete