పెండ్లి పెటాకులు లేకుండా, చిరకాలం ఇలా "శవరాజకీయాలు" చేసుకుంటూ వర్దిల్లు రాహుల్ రాజా !!!


                                                                              

                                      

                                     అయన ఒక జాతీయ పార్టి నాయకుడు . కుటుంబ వారసత్వం లో బాగంగా భారత దేశానికి  రాజు కావాలని ఉవ్విలూరుతుతున్న యువకుడు కాని యువ రాజు. వయస్సు 45 యేండ్లు. పెండ్లి చేసుకోలేదు. కారణం తెలియదు. మగాళ్ళని మగాళ్ళు , ఆడాళ్ళు ని ఆడాళ్ళు పెండ్లి చేసుకోవడం తమ జన్మ హక్కు అని కొంతమంది ధర్నాలు చేస్తుంటే , "అవును అది కరెక్టు " అని అంటూ వారికి వంత పాడుతూ ఉంటాడు . తను పాడటమే కాదు , అయన అమ్మగారిని సైతం వంత పాడమని ఒత్తిడి చేస్తాడు అనుకుంట , ఆవిడ గారూ పాడుతుంది . మరి ఇదే సిద్దాంతం తన తల్లి తండ్రులు పాటిస్తే తనెలా పుట్టెవాడో చెప్పడు. 

                         ఇక రాజకీయ పరిజ్ఞానం కి  వస్తే, ఈయన గారి నాయనమ్మ గొప్ప రాజకీయ వేత్త కావడానికి , ఆమె తండ్రి గారి రాజకీయ శిక్షణ ఉపయోగపడింది. అలాగే ఈయన తండ్రి గారికి , నాయనమ్మ జ్ఞానం కొంత అబ్బి అలా అలా నడిచింది. ఇక ఈయన గారి హయాం వచ్చే సరికి రాజకీయ శిక్షణ ఇవ్వడానికి తండ్రి లేడు . ఉన్న తల్లి కి రాజకీయమంటెనె తెలియని పరిస్తితి. తన తల్లి ప్రాపకం కోసం వచ్చే కొంతమంది పార్టి వందిమాగధులు "నీవు ఇంద్రుడివి , చంద్రుడివి , మేము అంతా దిక్కుమాలినోళ్లమ్ , నీవే మాకు దేశానికి దిక్కు " అని పొగడుతుంటె , అదే నిజమనుకుని రాజకీయ రంగంలోకి దిగిన వాడు. ఈయన ప్రచారానికి వెళ్ళిన చోటల్లా అయన పార్టి ఓడిపోవడమే తప్పా గెలిచిందంటూ లేదు. అయినా సరే సందు దొరికితే చాలు ఎటువంటి రాజకీయం అంటె చివరకు శ వ రాజకీయాలు చేయడానికి అయినా రెడి అయిపోతుంతాదు.  

      అదిగో అలాంటి నాయకుడికి  మన హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో ప్రచారం చేయాలని బుద్ది  పుట్టిందట. దానికి పార్టి పెద్దలు కొందరు అబ్యంతరం చెప్పినట్లుంది. " మీరు దేశానికి కాబోయే రాజు. ఆప్ట్రాల్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలుకి ప్రచారం చేస్తే , మీ స్తాయి తో పాటు పార్టి స్తాయి తగ్గుతుంది " అనే సరికి ఏమి చేదామా అని అలొచిస్తూన ఆయనకి ఎవరో గొప్ప ఇడియా ఇచ్చారంట. హైదరాబాద్ లో కేంద్రియ విశ్వ విద్యాలయం లో ఒక రెసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకున్నాడు. దానిని మీరు రాజకీయం చేయండి. ఆ వంక తో పోయి విద్యార్దులు తో దీక్ష చేయండి. పార్టి వాళ్ళు గోల గోల చేసి అరెస్టులు అవుతారు. ఇది వీదుల్లో పార్టి ప్రచారం చేసిన దానికంటే 100 రెట్లు పలితం ఎక్కువ ఇస్తుంది అనే సరికి , నిన్న సదరు యునివర్సిటికి వెళ్లి అక్కడి విద్యార్దులు తో 10 గంటలు దీక్ష చేసి , నిమ్మరసం ఇస్తే తాగి  వెళ్లి పోయాడు . కాని ఇదే పెద్ద మనిషి తన పార్టికి చెందిన నాయకుడి కోడలు ఆత్మహత్య చేసుకుంటే కనీసం పరామర్శించడానికి రాలేదు.  ఎమ్డుకంటే ఆవిడ గారి ఆత్మహత్య ఈయన గారి పార్టికి లాబసాటి కాదు కాబట్టి. 

       ఏది ఏమైనా ఒక జాతీయ పార్టికి అగ్రనాయకుడు,  కాబట్టి "పెండ్లి పెటాకులు లేకుండా, చిరకాలం ఇలా "శవరాజకీయాలు" చేసుకుంటూ వర్దిల్లు   రాహుల్ రాజా  !!! " అని ఆయన్ని ఆశిర్వదించాల్సిందే .  

            

Comments

  1. మనకో సామెతుంది "పిచ్చి కుదిరితే గానీ పెళ్ళి కుదరదు,పెళ్ళి కుదిరితే గానీ పిచ్చి కుదరదు" అని.ఈయన కాంగ్రెసుని అధికారంలోకి తీసుకొచ్చేవరకూ పెళ్ళి చేసుకోననై భీష్మించాడు - పాపం:-(

    ReplyDelete

Post a Comment

Popular Posts

సెక్స్ కోసం 17 యేండ్ల విద్యార్ధిని వశ పరచుకుని , 40 యేండ్ల మొగుడిని చంపించిన లేడి టిచర్ !

భర్త లేని లోటు తీరుస్తాడు అని బరువు బాద్యతలు అప్పచెపితే , అల్లుడు లేని లోటు కూడా తీర్చి హతమై పోయాడు అట !!!

తమ్ముడ్ని పెండ్లాడి, అన్న మీద మనసు పడితే చివరకు జరిగేది ఇదే!.

భర్త చనిపోతే, మరిది తనను పెండ్లి చేసుకోనందుకు అతని పై పోలిస్ కేసు పెట్టిన "వదిన"

"కార్యేషు దాసీ" అనే నీతి శ్లోకం పాపులర్ అయినంతగా "కార్యేషు యోగీ" అనే శ్లోకం ఎందుకు పాపులర్ కాలేదు ?

తిరుమల దేవస్థానం వివాదాన్ని, కమ్మ ,బ్రాహ్మణ సామాజిక వర్గాల మధ్య జరిగే వివాదంగా చూడటం ఎంతవరకు సమంజసం?

మరిది పెండ్లిలో వదిన ముద్దు పెట్టినందుకు , మరిది పెళ్లి మటాష్ అయి , బందువులంతా బాదుకున్నారట!

స్త్రీ స్వేచ్చా , స్త్రీ స్వేచ్చా , ఎంతవరకు వెళ్ళావు అంటే "కొడుకు వయసున్న వాడితో కడుపు తెచ్చుకునే దాకా" అన్నట్లు ఉంది ఈ 'అతి'వ చేసిన పని !!?

బాయ్ ప్రెండ్ ఇంట్లో పడుకున్న 16 యేండ్ల అమ్మాయి కి , 30 మంది రేప్ చేసాక కాని మెలుకువ రాలేదట!!!?

ఒక కమ్యూనిస్టు"గార్లఒడ్డు లక్ష్మీనరసింహా స్వామి" భక్తుడిగా ఎందుకు మారాడు?( గార్లఒడ్డు శ్రీ లక్ష్మి నరసింహా స్వామీ దేవాలయ చరిత్ర )